ఎస్బీఐ 4, 5 స్టార్ రేటేడ్ టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్.. 10 ఏళ్లలో మంచి రాబడి!-check out 4 and 5 star rated top 5 sbi best mutual funds good returns in 10 last years ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఎస్బీఐ 4, 5 స్టార్ రేటేడ్ టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్.. 10 ఏళ్లలో మంచి రాబడి!

ఎస్బీఐ 4, 5 స్టార్ రేటేడ్ టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్.. 10 ఏళ్లలో మంచి రాబడి!

Anand Sai HT Telugu

ఎస్బీఐ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి చెందిన మ్యూచువల్ ఫండ్స్ మీద చాలా నమ్మకం. రాబడులు కూడా బాగుంటాయి.

ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్

్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఏ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలో అనే డౌట్ వస్తుంటుంది. ఏదైనా ఫండ్ రేటింగ్ దాని సామర్థ్యాన్ని నిర్ణయించడంలో ముఖ్యమైన అంశం అని గుర్తుంచుకోవాలి. అధిక రేటింగ్ ఉన్న ఫండ్ మెరుగైన పనితీరును కనబరుస్తుంది. మార్కెట్ హెచ్చుతగ్గుల సమయంలోనూ స్థిరంగా ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే సమయంలో నాణ్యమైన ఫండ్స్ ఎంచుకోవడం ముఖ్యం. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు 5 స్టార్ రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. పెట్టుబడిదారులకు మంచి రాబడిని కూడా అందిస్తున్నాయి. గత 10 సంవత్సరాలలో అధిక రాబడిని ఇచ్చిన ఎంఎఫ్‌లు ఉన్నాయి. టాప్ 5 ఉత్తమ మ్యూచువల్ ఫండ్ల గురించి చూద్దాం..

  1. ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ కూడా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్ మార్చి 31, 1993న మెుదలైంది. 10 సంవత్సరాలలో సగటు వార్షిక రాబడి 13.63 శాతం.
  2. ఎస్బీఐ కాంట్రా ఫండ్ 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్ జూలై 5, 1999న ప్రారంభించారు. 10 సంవత్సరాల రాబడిని పరిశీలిస్తే సగటు వార్షిక రాబడి 15.04 శాతం.
  3. ఎస్‌బీఐ మాగ్నమ్ మిడ్‌క్యాప్ ఫండ్‌కు 4 స్టార్ రేటింగ్ ఉంది. ఈ ప్రాజెక్ట్ మార్చి 29, 2005న ప్రారంభించారు. గత 10 సంవత్సరాలలో ఇది సగటున 14.82 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది.
  4. ఎస్బీఐ బ్లూచిప్ ఫండ్ 4 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరి 14, 2006న ప్రారంభించారు. 10 సంవత్సరాలలో సగటు వార్షిక రాబడి 12.02 శాతం.
  5. ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్ ఈ పథకం 4 స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరి 29, 1993న మెుదలైంది. 10 సంవత్సరాలలో సగటు వార్షిక రాబడి 13.96 శాతం.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఫండ్ గురించి సరైన సమాచారం తెలుసుకోవాలి. మార్కెట్ రిస్క్ ఎల్లప్పుడూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల సమయాల్లో కూడా స్థిరమైన రాబడిని అందించే ఫండ్ ఎంచుకోవడం వలన నష్టాల ప్రమాదం తగ్గుతుంది. మార్కెట్ నిపుణుల సలహా తీసుకోవాలి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.