Network Speed Check : నెట్‌వర్క్ మార్చే ముందు ఇలా సిగ్నల్ స్పీడ్ టెస్ట్ చేయండి.. సింపుల్ ప్రాసెస్
Network Speed Check In Telugu : టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్స్ పెంచడంతో వినియోగదారులు గందరగోళంలో పడ్డారు. చాలా మంది నెట్‌వర్క్ మారేందుకు చూస్తున్నారు. అయితే దీనికంటే ముందు మీరు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది.
కొన్ని రోజుల కిందట టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్స్ ధరలను పెంచేశాయి. దీనితో మధ్యతరగతి వారిపై ప్రభావం ఎక్కువగా పడింది. చాలా మంది తమ నెట్‌వర్క్‌లను మార్చేందుకు పోర్ట్(PORT) పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు చూసి.. సరైన అవగాహన లేక నెట్‌వర్క్ మార్చేస్తున్నారు. ఈ కారణంగా సిగ్నల్ సరిగా అందక మళ్లీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే మీ ఏరియాలో ఉన్న నెట్‌వర్క్‌లపై స్పీడ్ టెస్ట్ చేయండి. మీరు ఏ నెట్‌వర్క్‌కు వెళితే బాగుంటుందో ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే మీరు తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్స్ ఇచ్చే నెట్‌వర్క్‌కు పోర్ట్ అయినా సిగ్నల్ లేకపోతే ఫలితం ఉండదు. ఈ స్పీడ్ టెస్ట్ చేసిన తర్వాత మీకు కావాల్సిన నెట్‌వర్క్‌లోకి మారిపోవచ్చు. ఇందుకోసం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. .
దేశంలోని చాలా ప్రాంతాల్లో కొన్ని నెట్‌వర్క్‌ల సిగ్నల్ సరిగా ఉండటం లేదు. ఇతర ప్రాంతాల్లో సిగ్నల్ ఫుల్ ఉంటుంది..కానీ మీ ప్రాంతంలో తక్కువే ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు మారిపోయినంత మాత్రన వచ్చే లాభం లేదు. వినియోగదారులు ఏ కంపెనీ నెట్‌వర్క్ మారాలి అనుకున్నా.. ముందుగా స్పీడ్ చూసుకోండి.
ఇలా చెక్ చేయండి
మీ ప్రాంతంలో సిగ్నల్స్ ఏ విధంగా ఉన్నాయో పరీక్షించుకోండి. దీనికోసం మీరు మీ మొబైల్‌లో గూగుల్‌లోకి వెళ్లి www.nperf.com ను ఓపెన్ చేయండి.
అందులో coverage mapలోకి వెళ్లండి.
Carrier optionలో మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఆపరేటర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
సెర్చ్‌లో మీ ఊరు పేరు ఇచ్చి ఎంటర్ నొక్కండి. దీంతో మీ ఊరు చుట్టూ ఉన్న నెట్‌వర్క్ సిగ్నల్స్ కనిపిస్తాయి.
గ్రీన్ కలర్ కనిపిస్తే 3G సిగ్నల్స్, ఆరెంజ్ కలర్ కనిపిస్తే 4G సిగ్నల్స్, పర్పుల్ కలర్ కనిపిస్తే 5G సిగ్నల్స్ ఉన్నాయని అర్థం.
అసలు ఏ కలర్ కనిపించకపోతే అక్కడ ఆ నెట్‌వర్క్‌కి సిగ్నల్ లేదని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుని మీ నంబరు మార్చుకోవడం, లేదా కొత్త కనెక్షన్ తీసుకోవడం మంచిది.