Savings Schemes Interest : చిన్న పొదుపు పథకాలపై తాజా వడ్డీ రేట్లు.. తెలుసుకునే ఇన్వెస్ట్ చేయండి
Savings and Investments : ఈ మధ్యకాలంలో చిన్న పొదుపు పథకాలపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరుగుతుంది. కొందరు లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ చేసి డబ్బును పెంచుకుంటారు. పొదుపు పథకాల్లో పెట్టుబడితో భవిష్యత్తుకు ఎంతో కొంత భరోసాగా ఉంటుంది. చిన్న పొదుపు పథకాలపై తాజా వడ్డీ రేట్ల గురించి ఇక్కడ చెక్ చేయండి..
కొంతమంది పెట్టుబడిదారులు తమ ఆదాయాలను పెంచుకోవడానికి స్టాక్ మార్కెట్ వైపు చూస్తుంటారు. అయితే ఇది రిస్క్‌తో కూడుకున్నది. కొన్నిసార్లు పెట్టుబడిపై రాబడి రావొచ్చు.. రాకపోవచ్చు. అందుకే చాలా మంది తమ డబ్బును రెట్టింపు చేసుకునేందుకు స్థిర-ఆదాయ వనరుల కోసం కూడా ఎదురుచూస్తారు. ఇందులో భాగంగా చిన్న పొదుపు పథకాలపై పెట్టుబడి పెడతారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), పోస్టాఫీసు డిపాజిట్లు వంటి చిన్న పొదుపు పథకాలు స్థిర ఆదాయాన్ని పొందేందుకు ఉపయోగపడతాయి. ఇవి ప్రభుత్వ అందించే పథకాలు. అయితే ఈ చిన్న పొదుపు పథకాలపై తాజా వడ్డీ రేట్లు ఇక్కడ ఉన్నాయి.
ప్రస్తుతం ప్రముఖ PPF, సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ప్రస్తుతం వరుసగా 7.1 శాతం, 4 శాతంగా ఉన్నాయి. కిసాన్ వికాస్ పత్రపై వడ్డీ రేటు 7.5 శాతం పెట్టుబడులు 115 నెలల్లో మెచ్యూర్ అవుతాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సి)పై వడ్డీ రేటు 7.7 శాతంగా కొనసాగుతోంది. నెలవారీ ఆదాయ పథకానికి వడ్డీ రేటు పెట్టుబడిదారులకు 7.4 శాతాన్ని ఇస్తుంది.
PPF, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్, టర్మ్ డిపాజిట్లు, NSC, SSY వంటి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికం చివరిలో సమీక్షిస్తారు. తదనుగుణంగా తదుపరి త్రైమాసికానికి నిర్ణయిస్తారు. తాజా వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
చిన్న పొదుపు పథకాలపై తాజా వడ్డీ రేట్లు
సేవింగ్స్ డిపాజిట్: 4 శాతం
1-సంవత్సరం పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 6.9 శాతం
2-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 7.0 శాతం
3-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 7.1 శాతం
5-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 7.5 శాతం
5-సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లు: 6.7 శాతం
నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు (NSC): 7.7 శాతం
కిసాన్ వికాస్ పత్ర: 7.5 శాతం (115 నెలల్లో మెచ్యూర్ అవుతుంది)
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: 7.1 శాతం
సుకన్య సమృద్ధి ఖాతా: 8.2 శాతం
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్: 8.2 శాతం
నెలవారీ ఆదాయ ఖాతా: 7.4 శాతం.
మూడు విభాగాలుగా
చిన్న పొదుపు పథకాలు మూడు విభాగాలను కలిగి ఉంటాయి. 1.పొదుపు డిపాజిట్లు, 2. సామాజిక భద్రతా పథకాలు, 3. నెలవారీ ఆదాయ ప్రణాళిక.
పొదుపు డిపాజిట్లలో 1-3 సంవత్సరాల టైమ్ డిపాజిట్లు, 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లు ఉంటాయి. వీటిలో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు (NSC), కిసాన్ వికాస్ పత్ర (KVP) వంటి పొదుపు ధృవపత్రాలు కూడా ఉన్నాయి. సామాజిక భద్రతా పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి ఖాతా, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఉన్నాయి. నెలవారీ ఆదాయ ప్రణాళికలో నెలవారీ ఆదాయ ఖాతా ఉంటుంది.