Affordable electric car : ఇంతకన్నా చౌకైన ఎలక్ట్రిక్​ కారు ఇండియాలో దొరకదు! రేంజ్​ కూడా సూపర్​..-check affordable electric car tata tiago ev on road price in hyderabad and its range ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Affordable Electric Car : ఇంతకన్నా చౌకైన ఎలక్ట్రిక్​ కారు ఇండియాలో దొరకదు! రేంజ్​ కూడా సూపర్​..

Affordable electric car : ఇంతకన్నా చౌకైన ఎలక్ట్రిక్​ కారు ఇండియాలో దొరకదు! రేంజ్​ కూడా సూపర్​..

Sharath Chitturi HT Telugu
Dec 07, 2024 11:00 AM IST

Tata Tiago EV on road price Hyderabad : టాటా టియాగో ఈవీ కొనే ప్లాన్​లో ఉన్నారా? అయితే ఈ టాటా టియాగో ఎలక్ట్రిక్​ కారు ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇండియాలోనే మోస్ట్​ అఫార్డిబుల్​ ఈవీ ఇదే..
ఇండియాలోనే మోస్ట్​ అఫార్డిబుల్​ ఈవీ ఇదే.. (Tata Motors)

ఐసీఈ వెహికిల్​​ నుంచి ఎలక్ట్రిక్​ కారుకు షిఫ్ట్​ అవ్వాలని చూస్తున్నారా? అఫార్డిబుల్​ ధరలో మంచి ఈవీ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలోనే మోస్ట్​ అఫార్డిబుల్​ ఎలక్ట్రిక్​ కార్లలో ఒకటి.. టాటా టియాగో ఈవీ! బడ్జెట్​ ఈవీల్లో ఇదొక సంచలనం అనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో టాటా టియాగో ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

yearly horoscope entry point

హైదరాబాద్​లో టాటా టియాగో ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

టాటా టియాగో ఈవీ ఎక్స్​ఈ ఎంఆర్​ - రూ. 8.33లక్షలు

  • ఎక్స్​టీ ఎంఆర్​- రూ. 9.36 లక్షలు
  • ఎక్స్​టీ ఎల్​ఆర్​- రూ. 10.40 లక్షలు
  • ఎక్స్​జెడ్​ ప్లస్​ ఎల్​ఆర్​- రూ. 11.02 లక్షలు
  • ఎక్స్​జెడ్​ ప్లస్​ ఎల్​ఆర్​ ఏసీఎఫ్​సీ- రూ. 11.54 లక్షలు
  • ఎక్స్​జెడ్​ ప్లస్​ టెక్​ ఎల్​యూఎక్స్​ ఎల్​ఆర్​- రూ. 11.54 లక్షలు
  • ఎక్స్​జెడ్​ ప్లస్​ టెక్​ ఎల్​యూఎక్స్​ ఎల్​ఆర్​ ఏసీఎఫ్​సీ- రూ. 12.06 లక్షలు

అంటే.. హైదరాబాద్​లో టియాగో ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ రూ. 8.3లక్షల నుంచి రూ. 12.06 లక్షల మధ్యలో ఉంటుంది. అన్ని వేరియంట్లలో ఎక్స్​జెడ్​ ప్లస్​ ఎల్​ఆర్​ బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా కొనసాగుతోంది.

సాధారణంగా వెహికల్​కి ఎక్స్​షోరూం ప్రైజ్​, ఆన్​రోడ్​ ప్రైజ్​లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్​ని లాంచ్​ చేసే సమయంలో ఆటోమొబైల్​ సంస్థలు ఎక్స్​షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్​రోడ్​ ప్రైజ్​ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటూ ఉంటుది. అందుకే కస్టమర్లు వెహికిల్​ని కొనే ముందు, ఎక్స్​షోరూం ప్రైజ్​ కాకుండా ఆన్​రోడ్​ ప్రైజ్​ తెలుసుకుని బడ్జెట్​ వేసుకోవాలి. సమీప డీలర్​షిప్​ షోరూమ్స్​ని సందర్శిస్తే.. ఆ సమయంలో వెహికిల్​పై ఏవైనా ఆఫర్స్​ ఉన్నాయా? అనేది కూడా తెలుస్తుంది. అది ఖర్చు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

టాటా టియాగో ఈవీ రేంజ్​..

టాటా టియాగో ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్​లతో లభిస్తుంది. లోయర్ వేరియంట్లలో 19.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 250 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. పెద్ద 24 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కిలోమీటర్ల రేంజ్​ని ఇస్తుంది. ఇందులోని 55 కిలోవాట్ల (74 బీహెచ్​పీ) పీఎమ్ఎస్ ఎలక్ట్రిక్ మోటార్ 114 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

ఎంజీ కామెట్​ ఈవీ, సిట్రోయెన్​ ఈసీ3 వంటి ఎలక్ట్రిక్​ వాహనాలు టాటా టియాగో ఈవీ ప్రత్యర్థులుగా ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం