Mini Electric Car : చాలా అంటే చాలా తక్కువలో ఎలక్ట్రిక్ కారు.. లక్ష రూపాయల ధర ఉండొచ్చని అంచనా!
Mini Electric Car : భారతీయ మార్కెట్లో చాలా కంపెనీలు రాబోయే కాలంలో చౌకగా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఫ్రెంచ్ కంపెనీ లిజియర్.. భారతదేశంలో లిజియర్ మినీని విడుదల చేయడానికి ప్రణాళికలు వేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర చాలా తక్కువగా ఉండనుందని అంచనా.
భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. దీంతో కంపెనీలు సైతం కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. సరికొకొత్త మోడల్స్ మార్కెట్‌లోకి దూసుకుపోతున్నాయి. ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్రీ ఈవీలపై కంపెనీలు పని చేస్తున్నాయి. తద్వారా ఎక్కువ మంది కస్టమర్లను పొందాలని భావిస్తున్నాయి. ఫ్రెంచ్ కంపెనీ లిజియర్.. భారత్‌లో చౌక ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రూ.1 లక్ష ధర ఉండొచ్చని అంచనా
ఇప్పటికే లిజియర్ మినీ ఎలక్ట్రిక్ కార్ టెస్టింగ్ సమయంలో కనిపించింది. నివేదికల ప్రకారం.. ఈ కారును భారతదేశంలో రూ. 1 లక్ష ధరతో విడుదల చేయవచ్చని ఆటోమెుబైల్ మార్కెట్‌లో అంచనా ఉంది. ఈ ధర గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. యూరోపియన్ మోడల్ ఆధారంగా ఈ 2 సీటర్ మినీ ఈవీని విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో తీసుకువస్తున్నారు. దీని సింగిల్ ఛార్జ్‌పై 63 కిలోమీటర్ల నుండి 192 కిలోమీటర్ల వరకు ఉంటుంది. బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ కారు కోసం చూసేవారికి ఇది బెటర్.
మూడు బ్యాటరీ ఆప్షన్స్
లిజియర్ మినీ ఈవీ G.OOD, I.DEAL, E.PIC, R.EBEL అనే 4 విభిన్న వేరియంట్‌లలో అందించవచ్చు. మూడు బ్యాటరీ ఆప్షన్స్ రానున్నాయి. అందులో 4.14 kWh, 8.2 kWh, 12.42 kWh ఉంటాయి. ప్రస్తుతానికి దీని గురించి సమాచారం పెద్దగా లేదు. ఈ కొత్త మోడల్‌కు సంబంధించిన అధికారిక అప్‌డేట్‌లు మరికొన్ని రోజుల్లో అందుకోవచ్చు.
డిజైన్
డిజైన్ పరంగా లిజియర్ మినీ ఎలక్ట్రిక్ కారు చిన్నదిగా ఉంటుంది. ఇది మోపెడ్ డిజైన్‌లో రావచ్చు. ఈ ఈవీ పొడవు 2958ఎంఎం, వెడల్పు 1499ఎంఎం, ఎత్తు 1541ఎంఎంగా ఉండనుంది. యూరోపియన్ మోడల్ ఆధారంగా ఈ ఈవీలో కేవలం రెండు డోర్లు మాత్రమే కనిపిస్తాయి. ఇందులో 12 నుంచి 13 అంగుళాల చక్రాలు కనిపిస్తాయి. ఎల్ఈడీ డీఆర్ఎల్, రౌండ్ హెడ్‌లైట్ ముందు భాగంలో స్లిమ్ గ్రిల్‌తో కనిపిస్తాయి. వెనుక భాగంలో పెద్ద గ్లాస్‌తో కూడిన టెయిల్‌గేట్ ఉంటుంది. సైడ్ లుక్ కాస్త స్పోర్టీగా అనిపించవచ్చు.
10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ , పవర్ స్టీరింగ్ , ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో కూడిన హీటెడ్ డ్రైవర్ సీట్, కార్నర్ AC వెంట్ వంటి ఫీచర్లను ఇందులో చూడవచ్చు . ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ కారును ప్రదర్శిస్తుందో లేదో చూడాలి.
గమనిక : ఈ కారుకు సంబంధించిన వివరాలు వివిధ ప్లాట్‌ఫామ్‌ల నుంచి సేకరించినది. కారు లాంచ్ సమయంలో ధర మారవచ్చు. అంచనా ధర ఆధారంగా కథనం ఇచ్చాం.