చాట్ జీపీటీ లో ఈ నెల ప్రారంభంలో కొత్త ఇమేజ్ జనరేటర్ ఫీచర్ వచ్చింది. ఇది ప్రారంభం నుంచే ఇంటర్నెట్ ను షేక్ చేసింది. యూజర్లు దీనిని ఉపయోగించి సూపర్-పాపులర్ గిబ్లీ ట్రెండ్ తో సహా అనేక రకాల చిత్రాలను సృష్టించడం ప్రారంభించారు. ఆ తరువాత, తమ చిత్రాలతో యాక్షన్ ఫిగర్లను రూపొందించారు. ఇప్పుడు, వారు తమను తాము పిల్లులు, కుక్కలు, ఇతర అన్ని రకాల సరదా అవతారాలుగా మార్చుకుంటున్నారు.
అయితే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ చిత్రాలను సేవ్ చేసుకోవడం కొంత గందరగోళంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి, ఓపెన్ఎఐ ఇప్పుడు కొత్త ఫీచర్ ను ప్రకటించింది. లైబ్రరీ అనే ఈ కొత్త ఫీచర్ తో మీ ఏఐ జనరేటెడ్ చిత్రాలన్నింటినీ ఒకే చోట సేవ్ చేసుకోవచ్చు.
చాట్ జీపీటీని ఉపయోగించి మీరు సృష్టించే ఏదైనా ఇమేజ్ ఇప్పుడు ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది. చాట్ జీపీటీ వినియోగదారులందరికీ ఇది ఉచిత అప్డేట్ గా అందుతుంది. చాట్ జీపీటీ మొబైల్ యాప్, వెబ్ వెర్షన్ రెండింటిలోనూ ఇది అందుబాటులో ఉంది. "మీ ఇమేజ్ క్రియేటివిటీలన్నీ ఒకే చోట. మీ చాట్ జిపిటి ఇమేజ్ క్రియేషన్ ల కోసం కొత్త లైబ్రరీని పరిచయం చేస్తున్నాం. ఫ్రీ, ప్లస్, ప్రో వినియోగదారులందరికీ ఇప్పుడు ఇది అందుబాటులో ఉంది" అని చాట్ జీపీటీ యాజమాన్య సంస్థ ఓపెన్ ఏఐ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది.
సంబంధిత కథనం