Changes from April 1 : ప్రజలకు రిలీఫ్​! ఏప్రిల్​ 1 నుంచి ఈ ‘టీడీఎస్​’ రూల్స్​లో మార్పులు..-changes from april 1 2025 new tds rules in dividends fds lottery rent and others check details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Changes From April 1 : ప్రజలకు రిలీఫ్​! ఏప్రిల్​ 1 నుంచి ఈ ‘టీడీఎస్​’ రూల్స్​లో మార్పులు..

Changes from April 1 : ప్రజలకు రిలీఫ్​! ఏప్రిల్​ 1 నుంచి ఈ ‘టీడీఎస్​’ రూల్స్​లో మార్పులు..

Sharath Chitturi HT Telugu

TDS rules changes : ఏప్రిల్​ 1న 2025 బడ్జెట్​ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ‘టీడీఎస్​’ విషయంలో భారీ మార్పులు కనిపించబోతున్నాయి. ఇది ప్రజలకు చాలా రిలీఫ్​ని ఇస్తుంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఏప్రిల్​ 1 నుంచి కొత్త రూల్స్​.. ఇవి తెలుసుకోండి..

ఏప్రిల్​లో ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంతో దేశంలో అనేక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. మరీ ముఖ్యంగా 2025 బడ్జెట్​లో నిర్మలా సీతారామన్​ ప్రకటించిన అనేక అంశాలు ఏప్రిల్​ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అనేక అంశాల్లో టీడీఎస్​ పరిమితిని పెంచారు. ఈ నేపథ్యంలో ‘టీడీఎస్’​ విషయంలో కనిపించే మార్పులను ఇక్కడ తెలుసుకోండి..

కొత్త టీడీఎస్​ రూల్స్​ గురించి తెలుసుకోండి..

"డివిడెండ్​ ఆదాయంపై ఇప్పటివరకు ఉన్న రూ. 5వేల టీడీఎస్​ ఇప్పుడు రూ.10వేలకు పెరుగుతుంది. ఇది సెక్యూరిటీ మార్కెట్​లో తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్​ చేస్తున్న వారికి మంచిది," అని సీఏ నిపుణులు చెబుతున్నారు.

ఏప్రిల్​ 1 నుంచి అమల్లోకి వచ్చే మరో పెద్ద మార్పు.. లాటరీలు, గేమ్స్​, గుర్రం రేసుల్లో వచ్చే డబ్బుపై ఉన్న టీడీఎస్​ రూల్స్​. ఇప్పటివరకు ప్రతి ఆర్థిక ఏడాదిలో రూ. 10వేల లిమిట్​ ఇప్పుడు ప్రతి లావాదేవీకి రూ. 10వేలుగా మారనుంది. తక్కువ అమౌంట్​లో ఆదాయ లావాదేవీలు చేసే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. కొత్త నిబంధనతో ట్యాక్స్​ డిడక్షన్​ని నివారించుకోవచ్చని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఇండియాలో ఆన్​లైన్​ గేమింగ్​కి పెరుగుతున్న డిమాండ్​ నేపథ్యంలో టీడీఎస్​ భారత తగ్గుతుండటం విశేషం.

ఇక ఏప్రిల్​ 1 నుంచి అమల్లోకి వచ్చే మరో మార్పు సీనియర్​ సిటిజెన్​లకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది. బ్యాంక్​ ఎఫ్​డీ, బ్యాంక్​ వడ్డీ వంటి వాటిపై టీడీఎస్​ రూల్స్​ మారనున్నాయి. గతంలో రూ. 50వేలుగా ఉన్న లిమిట్​ ఇప్పుడు రూ. 1లక్షకు వెళుతుంది. అంటే వడ్డీపై టీడీఎస్​ లిమిట్​ని పెంచారు. కేవలం వడ్డీపై వచ్చే ఆదాయం మీద పడే టీడీఎస్​ రీఫండ్​ కోసం ఫైలింగ్​ చేసే వారికి ఇది ఉపశమనం అవుతుందని అని నిపుణులు అంటున్నారు.

ఏప్రిల్​ 1 నుంచి టీడీఎస్​ రూల్స్​లో కనిపించే మార్పులు..

సెక్యూరిటీస్​పై వడ్డీ- ఇప్పటివరకు రూ. 5వేలు, ఇప్పుడు రూ. 10వేలు

డివిడెండ్లు- ఇప్పటివరకు రూ. 5వేలు, ఇప్పుడు రూ. 10వేలు

బ్యాంక్​ కంపెనీ- కోఆపరేటివ్​ సొసైటీ, పోస్టాఫీస్​ల నుంచి అందే వడ్డీ మినహాయించి ఇతర వడ్డీలు (సీనియర్​ సిటిజెన్​ కాకుండా)- ఇప్పటివరకు రూ. 40వేలు, ఇప్పుడు రూ. 50వేలు

ఇతర అంశాల్లో (పైన పేర్కొనవి కాకుండా)- ఇప్పటివరకు రూ. 5వేలు, ఇక నుంచి రూ. 10వేలు

(పైన పేర్కొన్నవి) సీనియర్​ సిటిజెన్​ విషయంలో- ఇప్పటివరకు రూ. 50వేలు, ఇక నుంచి రూ. 1లక్ష

లాటరీ, గుర్రం రేసు, క్రాస్​వర్డ్​, పజిల్స్​ గెలుపు- ఇప్పటివరకు ఆర్థిక ఏడాది మొత్తం మీద రూ. 10వేలు, ఇప్పటి నుంచి ప్రతి లావాదేవీపై రూ. 10వేలు

ఇన్సూరెన్స్​ కమిషన్​- ఇప్పటివరకు రూ .15వేలు, ఇప్పటి నుంచి రూ. 20వేలు

లాటరీ టికెట్​ విక్రయం- ఇప్పటివరకు రూ .15వేలు, ఇప్పటి నుంచి రూ. 20వేలు

కమిషన్​ లేదా బ్రోకరేజ్​- ఇప్పటివరకు రూ. 15వేలు, ఇప్పటి నుంచి రూ. 20వేలు

రెంట్​- ఇప్పటివరకు ఆర్థిక ఏడాదిలో రూ. 2,40,000, ఇప్పటి నుంచి నెలకు రూ. 50వేలు

టెక్నికల్​ సర్వీస్​ ఫీజు- ఇప్పటివరకు ఆర్థిక ఏడాదిలో రూ. 30వేలు, ఇక నుంచి నెలకు రూ. 50వేలు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం