Nara Bhuvaneshwari: ఐదు రోజుల్లో రూ. 579 కోట్ల మేర పెరిగిన భువనేశ్వరి సంపద.. కారణం ఇదే-chandrababu naidus wife nara bhuvaneshwari earns 579 crore from this stock ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nara Bhuvaneshwari: ఐదు రోజుల్లో రూ. 579 కోట్ల మేర పెరిగిన భువనేశ్వరి సంపద.. కారణం ఇదే

Nara Bhuvaneshwari: ఐదు రోజుల్లో రూ. 579 కోట్ల మేర పెరిగిన భువనేశ్వరి సంపద.. కారణం ఇదే

Sharath Chitturi HT Telugu
Jun 07, 2024 01:02 PM IST

Nara Bhuvaneshwari net worth : హెరిటేజ్​ఫుడ్స్​ స్టాక్​.. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతోంది. ఫలితంగా.. నారా భువనేశ్వరి సంపద రూ. 579 కోట్లు పెరిగింది.

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి

Heritage foods Nara Bhuvaneshwari: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సంపద ఐదు రోజుల్లో రూ. 579 కోట్లు పెరిగింది! ఆమె ప్రమోటర్​గా ఉన్న హెరిటేజ్​ ఫుడ్స్​ స్టాక్​.. ఐదు రోజుల్లో భారీగా పెరగడం ఇందుకు కారణం.

భారీగా పెరిగిన హెరిటేజ్​ ఫుడ్స్​..

2024 లోక్​సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్టాక్​ మార్కెట్​లో తీవ్ర ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి. కానీ.. హెరిటేజ్​ ఫుడ్స్​ స్టాక్​ మాత్రం.. భారీగా పెరుగుతూనే ఉంది.

హెరిటేజ్​ ఫుడ్స్​కి ప్రమోటర్​గా ఉన్నారు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి. కంపెనీలో ఆమెకు 24.37 శాతం వాటా ఉంది. ఫలితంగా.. ఆమె వద్ద 2,26,11,525 హెరిటేజ్​ ఫుడ్స్​ షేర్లు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమి గెలిచి, చంద్రబాబు నాయుడు త్వరలో సీఎం అవుతున్న నేపథ్యంలో.. హెరిటేజ్​ ఫుడ్స్​లో భారీ ర్యాలీ కనిపిస్తోంది. సంస్థ ప్రదర్శన, నిర్ణయాల్లో నారా భువనేశ్వరి పట్టుకు ఇది నిదర్శనంగా మారింది.

ఇదీ చూడండి:- Stocks to buy today : ఈ రూ. 190 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు..!

Nara Bhuvaneshwari net worth : 2024 మే 31న రూ. 402.గా ఉన్న హెరిటేజ్​ ఫుడ్స్​ స్టాక్​.. అతి తక్కువ ట్రేడింగ్​ సెషన్స్​లో రూ. 661కి చేరింది. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఈ స్టాక్​ రూ. 60 పెరిగి 10శాతం అప్పర్​ సర్క్యూట్​ వద్ద లాక్​ అయ్యింది.

గత ఐదు రోజుల్లో.. నారా భువనేశ్వరికి చెందిన హెరిటేజ్​ ఫుడ్స్​ స్టాక్​.. దాదాపు 56శాతం మేర పెరిగింది. ఫలితంగా నారా భూవనేశ్వరి.. ఈ ఒక్క స్టాక్​ నుంచి రూ. 579 కోట్లు సంపాదించారు.

Heritage foods share price target : ఇక హెరిటేజ్​ ఫుడ్స్​ ప్రదర్శన విషయానికొస్తే.. ఒక నెలలో ఈ స్టాక్​ 102శాతం పెరగడం గమనార్హం. ఆరు నెలల్లో ఏకంగా 181శాతం మేర వృద్ధి చెందింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 117శాతం పెరిగింది.

(గమనిక:- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం