Chahal Dhanashree divorce : ధనశ్రీకి 4.75 కోట్ల భరణం- అందులో ట్యాక్స్ ఎంత కట్టాలో తెలుసా?
Chahal Dhanashree divorce : టీమిండియా స్పిన్నర్ యుజ్వెందర్ చాహల్ నుంచి రూ. 4.75 కోట్లు భరణంగా అందుకోనున్నారు ధనశ్రీ. మరి ఈ భరణంపై పన్ను ఎంత కట్టాలో మీకు తెలుసా? అసలు దేశంలో భరణంపై ఎలాంటి ట్యాక్స్ చట్టాలు ఉన్నాయో తెలుసా?
ప్రముఖ భారత క్రికెటర్ యుజ్వెందర్ చాహల్- ధనశ్రీ వర్మకు అధికారికంగా విడాకులు లభించాయి. అంతేకాదు భరణం కింద చాహల్ నుంచి ధనశ్రీ రూ. 4.75 కోట్లు అందుకోనున్నారు. మరి ఈ అమౌంట్‌పై ధనశ్రీ ఎంత పన్ను కట్టాలో మీకు తెలుసా? భరణం విషయంలో భారత దేశ చట్టాలు ఏం చెబుతున్నాయంటే..
అసలు భరణం అంటే ఏంటి?
విడాకులు లేదా విడిపోయిన తర్వాత గత జీవిత భాగస్వామి ఆర్థిక అవసరాలకు సాయం అందించడాన్నే భరణం అంటారు. దీన్ని ఇంగ్లీష్‌లో ఆలిమోని అని పిలుస్తారు.
భారత దేశంలో భరణం చుట్టు అనేక చట్టాలు ఉన్నాయి. హిందూ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఇండియన్ డివోర్స్ యాక్ట్, ముస్లిం ఉమెన్ యాక్ట్, పార్సీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్ వంటివి ఉదాహరణలు. గత జీవిత భాగస్వామికి భరణం ఇచ్చే ముందు కోర్టులు అనేక విషయాలను పరిగణలోకి తీసుకుంటాయి. వివాహం సమయంలో జీవన శైలి, ఖర్చులు, వివాహ బంధం నిడివి, పిల్లల కస్టడీ వంటిని పరిశీలిస్తుంది.
సదరు మహిళ ఒకవేళ ఉద్యోగం చేస్తున్నప్పటికీ, భర్త జీతానికి- తన జీతానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటే, ఆమెకు భరణం లభించవచ్చు. ఒకవేళ ఆమె ఆర్థికంగా స్థిరంగా ఉంటే మాత్రం భరణం అమౌంట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి.
ధనశ్రీ భరణంపై సున్నా ట్యాక్స్..!
ఏ విధంగా భరణం అందుతోంది? అన్న దానిపై అసలు ట్యాక్స్ ఉంటుందా? లేదా? అనేది ఆధారపడి ఉంటుంది. వన్ టైమ్ సెటిల్మెంట్ జరిగితే.. దాన్ని నాన్-ట్యాక్సెబుల్ అసెట్‌గా పరిగణిస్తారు. అలాంటి వాటిపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు.
ఒకవేళ భరణం నెలవారీ లేదా ప్రతి ఏడాది అందుతుంటే, దాన్ని రెవెన్యూ రెసిప్ట్గా పరిగణిస్తారు. ఇది "ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం" కింద ట్యాక్స్ అవుతుంది. భరణం పొందిన వ్యక్తి వీటిని ఆదాయపు పన్ను రిటర్నుల్లో పొందుపరచాలి.
ఒకవేళ ఆస్తుల బదిలీ ద్వారా భరణం లభిస్తే, దాని మీద కూడా పన్ను పడుతుంది. భరణం పొందిన వ్యక్తి పన్ను కట్టాలి. అదే సమయంలో భరణం ఇచ్చిన వ్యక్తి దాన్ని డిడక్షన్స్ కింద చూపించుకోలేరు. ఒకవేళ విడాకుల ముందే ఆస్తులు బదిలీ జరిగి ఉంటే, దాన్ని భరణంగా కాకుండా, గిఫ్ట్‌గా పరిగణిస్తారు. ఈ తరహా గిఫ్ట్‌లపై ట్యాక్స్ ఉండదు.
ఇక.. చాహల్ వన్-టైమ్ లంప్సమ్ పేమెంట్ కింద ధనశ్రీకి భరణం ఇస్తున్నాడు కాబట్టి.. దాని మీద ఎలాంటి పన్ను ఉండదు.
చాహల్- ధనశ్రీ పెళ్లి, విడాకులు..
టీమిండియా స్పిన్నర్ యుజ్వెందర్ చాహల్, ధనశ్రీలు 2020 డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. ధనశ్రీ ఒక డెంటిస్ట్. కానీ యూట్యూబ్‌లో తన డ్యాన్స్ వీడియోల వల్ల ఆమె చాలా ఫేమస్ అయ్యింది.
అయితే విభేదాల కారణంగా ఇరువురు జూన్ 2022 నుంచే విడిగా ఉంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినికి ఒకరు అన్‌ఫాలో చేసుకోవడంతో వీరి మధ్య విడాకుల వ్యవహారం బయటకు వచ్చింది.
ఇక గురువారం చాహల్- ధనశ్రీకి ముంబయి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే విడాకులకు ముందే ధనశ్రీకి చాహల్ రూ. 2కోట్లకుపైగా డబ్బులు ఇచ్చినట్టు తెలుస్తోంది.
సంబంధిత కథనం