Centre to borrow 16 trillion: ‘‘కేంద్రానికి 16 లక్షల కోట్ల అప్పు కావాలి..’’-centre to borrow rs 16 trillion in fiscal 2023 24 say economists report ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Centre To Borrow <Span Class='webrupee'>₹</span>16 Trillion In Fiscal 2023-24, Say Economists: Report

Centre to borrow 16 trillion: ‘‘కేంద్రానికి 16 లక్షల కోట్ల అప్పు కావాలి..’’

HT Telugu Desk HT Telugu
Jan 24, 2023 10:54 PM IST

Centre to borrow 16 trillion: వచ్చే ఆర్థిక సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర ఖర్చుల (budget 2023) కొరకు కనీసం రూ. 16 లక్షల కోట్లు అప్పు చేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Centre to borrow 16 trillion: ఈ ఆర్థిక సంవత్సరం, అంటే మార్చి 2023 నుంచి మార్చి 2024 వరకు కేంద్ర ప్రభుత్వానికి వివిధ అవసరాల నిమిత్తం రూ. 16 లక్షల కోట్ల రూపాయల (198 బిలియన్ డాలర్లు) అప్పు (budget 2023) అవసరమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Centre's upcoming budget: వివిధ ప్రాజెక్టుల ఖర్చు..

వచ్చే ఆర్థిక సంవత్సరం (budget 2023) భారత ప్రభుత్వం వివిధ అవసరాల కోసం చేయాల్సిన ఖర్చు, తీసుకోవాల్సిన రుణాలపై రాయిటర్స్ సంస్థ 43 మంది ఆర్థిక రంగ నిపుణులతో సర్వే నిర్వహించింది. ఆర్థిక క్రమశిక్షణకు, మౌలిక వసతుల అభివృద్ధికి ఈ బడ్జెట్ (budget 2023) లో ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని వారిలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. గత నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం వివిధ అవసరాల కోసం చేసిన అప్పు రెండింతలు అయింది. కొరోనా మహమ్మారి వల్ల తలెత్తిన ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడానికి ఈ అప్పులు చేయాల్సి వచ్చింది.

Centre to borrow 16 trillion: చివరి పూర్తి స్థాయి బడ్జెట్

ఈ ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ (budget 2023) ను ప్రవేశపెట్టనున్నారు. 2024 ఏప్రిల్, మే నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ (budget 2023) ఈ ప్రభుత్వ చివరి పూర్తి స్థాయి బడ్జెట్ (budget 2023) కానుంది. అంతర్జాతీయ పరిణామాలు, ముంచుకొస్తున్నఆర్థిక మాంద్యం, పన్ను ఆదాయంలో తగ్గుదలకు అవకాశాలు.. తదితర సమస్యల నేపథ్యంలో రుణాలను తగ్గించుకునే అవకాశం ఈ ఆర్థిక సంవత్సరం (budget 2023) కూడా ప్రభుత్వానికి లభించకపోవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2022/23) ప్రభుత్వ రుణాలు రూ. 14.2 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Centre's loans in 2014: 2014లో..

2014లో ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రధాన పక్షంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన సంవత్సరం దేశ స్థూల వార్షిక రుణాలు రూ. 5.92 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా, రీ పేమెంట్ భారం వల్ల ఈ సంవత్సరం రుణ ణాల భారం భారీగా పెరగనుందని ఏఎన్ జెడ్ (ANZ)లో ఎకనమిస్ట్ గా చేస్తున్న ధీరజ్నిమ్ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో (budget 2023) రుణాల రీపేమెంట్ భారం రూ. 4.4 లక్షల కోట్లుగా ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేపిటల్ ఎక్స్ పెండేచర్ రూ. 8.85 లక్షల కోట్లుగా ఉండవచ్చని మెజారిటీ ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు. ఇది జీడీపీలో 2.95% గా ఉంటుంది.

Centre to borrow 16 trillion: ఆర్థిక క్రమ శిక్షణ, మౌలిక వసతులు

పారిశ్రామిక ఉత్పత్తుల రంగంలో చైనాకు దీటుగా ఎదగడానికి వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం, మౌలిక వసతుల కల్పన కోసం భారత ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఈ బడ్జెట్ (budget 2023) లో భారత ప్రభుత్వం ప్రధానంగా ఆర్థిక క్రమ శిక్షణ, మౌలిక వసతుల కోసం పెట్టుబడులపై దృష్టి పెట్టాలని 18 మంది ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు. ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాలపై దృష్టి పెట్టాలని, ఆయా రంగాలపై budget 2023 లో పెట్టుబడులను పెంచాలని మరో 18 మంది ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు.

WhatsApp channel