Ceigall India IPO: జీఎంపీ బావుంది.. ఈ ఐపీఓకు అప్లై చేయొచ్చా..?
Ceigall India IPO: సీగల్ ఇండియా ఐపీఓ కు ఇన్వెస్టర్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఐపీఓకు గ్రే మార్కెట్లో రూ.61 ప్రీమియం లభిస్తోంది. ఈ ఐపీఓకు ఆగస్ట్ 5 వ తేదీ వరకు బిడ్డింగ్ చేసుకోవచ్చు.
sCeigall India IPO: సీగల్ ఇండియా లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) 2024 ఆగస్టు 1 న భారత ప్రైమరీ మార్కెట్ లోకి వచ్చింది. 2024 ఆగస్టు 5 వరకు ఈ ఐపీఓకు బిడ్డింగ్ చేసుకోవచ్చు. మార్కెట్ ప్రతికూలతల మధ్య కూడా శుక్రవారం ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా సబ్ స్క్రైబ్ అయినట్లు సీగల్ ఇండియా ఐపీఓ సబ్ స్క్రిప్షన్ స్టేటస్ సూచిస్తోంది.
ప్రైస్ బ్యాండ్ ఇదే..
సీగల్ ఇండియా ఐపీఓ ప్రైస్ బ్యాండ్ (Share price) ను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.380 నుంచి రూ.401గా కంపెనీ ప్రకటించింది. ప్రారంభ ఆఫర్ ద్వారా రూ.1,252.66 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకోగా, ఇందులో రూ.684.25 కోట్లు తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించాలనుకుంటోంది. ఆఫర్ ఫర్ సేల్ (OFS) మార్గంలో రూ.568.41 కోట్లు సమీకరించనుంది. శనివారం గ్రే మార్కెట్లో సీగల్ ఇండియా షేరు ధర రూ.61 వద్ద ఉందని స్టాక్ మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు.
నేటి సీగల్ ఇండియా ఐపీఓ జీఎంపీ
సీగల్ ఇండియా ఐపీఓ (Ceigall India IPO) జీఎంపీ శుక్రవారం రూ. 75 గా ఉంది. అయితే, శనివారం ఈ ఐపీఓ జీఎంపీ రూ.14 తగ్గి, రూ. 61 కి చేరింది. శుక్రవారం స్టాక్ మార్కెట్ పతనం కారణంగా సెగల్ ఇండియా ఐపీఓ జీఎంపీ (GMP) పడిపోయిందని మార్కెట్ పరిశీలకులు తెలిపారు. బలహీనమైన ప్రపంచ మార్కెట్ సంకేతాలు గత వారం చివరి సెషన్లో ఆసియా, యూరోపియన్, అమెరికా స్టాక్ మార్కెట్లలో భారీ అమ్మకాలకు దారితీశాయి. అయితే సెకండరీ మార్కెట్లో బలహీన ధోరణులు ఉన్నప్పటికీ సీగల్ ఇండియా ఐపీఓ పూర్తిగా సబ్ స్క్రైబ్ కావడం గమనార్హం. బిడ్డింగ్ కు ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉందని, సోమవారం ఈ ఐపీఓకు సబ్ స్క్రిప్షన్స్ పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు.
సీగల్ ఇండియా ఐపీఓ సబ్ స్క్రిప్షన్ స్టేటస్
ఓపెన్ అయిన రెండు రోజుల తరువాత, సీగల్ ఇండియా ఐపీఓ 1.23 రెట్లు బుక్ అయింది. ఇందులో రిటైల్ భాగం 1.65 రెట్లు, ఎన్ ఐఐ భాగం 1.75 రెట్లు, క్యూఐబీ భాగం 0.01 రెట్లు బుక్ అయ్యాయి.
సీగల్ ఇండియా ఐపీఓకు అప్లై చేయొచ్చా?
ఈ పబ్లిక్ ఇష్యూకు ఆనంద్ రాఠీ 'సబ్ స్క్రైబ్' ట్యాగ్ ఇచ్చారు. "కంపెనీకి వివిధ వ్యాపార రంగాలు, భౌగోళిక ప్రాంతాలలో విస్తరించిన బలమైన ఆర్డర్ బుక్ ఉంది. వారి వ్యాపార పరిమాణం, లాభాల మార్జిన్లు పెరిగే అవకాశం ఉంది. కంపెనీ పీ / ఈ నిష్పత్తి దాని ఆర్థిక సంవత్సరం 2024 ఆదాయాల ఆధారంగా 22.9 రెట్లుగా ఉంది. ఈక్విటీ షేర్ల జారీ తర్వాత కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 69,854 మిలియన్లకు చేరుకుంది. బీపీ ఈక్విటీస్ కూడా ఈ ఐపీఓకు 'సబ్స్క్రైబ్' ట్యాగ్ ఇచ్చింది. అజ్కాన్ గ్లోబల్ సర్వీసెస్, అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్, ఇండ్సెక్ సెక్యూరిటీస్, మార్వాడీ షేర్స్ అండ్ ఫైనాన్స్, మోతీలాల్ ఓస్వాల్, నిర్మల్ బ్యాంగ్, రిలయన్స్ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్ సెక్యూరిటీస్, స్టోక్స్బాక్స్ కూడా బుక్ బిల్డ్ ఇష్యూకు 'సబ్స్క్రైబ్' ట్యాగ్ను కేటాయించాయి.
సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి. హెచ్ టీ తెలుగు వి కాదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.