Chanda Kochhar arrest: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్ అరెస్ట్-cbi arrests ex icici bank ceo chanda kochhar deepak kochhar in videocon case ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Cbi Arrests Ex-icici Bank Ceo Chanda Kochhar, Deepak Kochhar In Videocon Case

Chanda Kochhar arrest: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్ అరెస్ట్

Sudarshan Vaddanam HT Telugu
Dec 23, 2022 11:16 PM IST

ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) మాజీ సీఈఓ, ఎండీ చందా కొచ్చర్ ను శుక్రవారం సీబీఐ(CBI) అరెస్ట్ చేసింది. బ్యాంక్ ఉన్నతాధికారిణిగా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన నేరంపై ఆమెను అరెస్ట్ చేసింది.

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ, మాజీ ఎండీ చందా కొచ్చర్ (ఫైల్ ఫొటో)
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ, మాజీ ఎండీ చందా కొచ్చర్ (ఫైల్ ఫొటో)

నిబంధనలకు వ్యతిరేకంగా, వ్యక్తిగత లబ్ధి పొందడానికి వీలుగా వీడియోకాన్ గ్రూప్ నకు 2012లో ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) నుంచి చందా కొచ్చర్ రూ. 3,250 కోట్ల రుణం ఇచ్చారన్న ఆరోపణలపై సీబీఐ శుక్రవారం ఆమెను అరెస్ట్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

criminal conspiracy: నేరపూరిత కుట్ర

మనీ లాండరింగ్, నేర పూరిత కుట్ర, అవినీతి తదితర నేరారోపణలపై చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియో కాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ లతో పాటు న్యుపవర్ రెన్యువబుల్స్(Nupower Renewables), సుప్రీం ఎనర్జీ, వీడియోకాన్ ఎలక్ట్రానిక్స్, వీడియోకాన్ ఇండస్టీస్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. చందా కొచ్చర్ సహకారంతో ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) నుంచి రూ. 3,250 కోట్ల రుణం తీసుకుని, అందులో కొత్త మొత్తాన్ని న్యుపవర్ రెన్యువబుల్స్(Nupower Renewables) లో వేణుగోపాల్ ధూత్ పెట్టుబడులు పెట్టాడని సీబీఐ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఐసీఐసీఐ(ICICI Bank) రుణ నిబంధనలను అతిక్రమించి వీడియోకాన్ గ్రూప్ నకు చందా కొచ్చర్ రుణాలిచ్చారని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఆమె చేసిన ఆ సహకారానికి బదులుగా, చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ కు చెందిన న్యుపవర్ రెన్యువబుల్స్(NuPower Renewables)లో వేణుగోపాల్ ధూత్ కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారని ఆరోపిస్తున్నారు.

Enforcement Directorate: ఈడీ కూడా..

ఈ కేసును సీబీఐ తో పాటు, ఈడీ (Enforcement Directorate ED) కూడా దర్యాప్తు జరుపుతోంది. గతంలో మనీ లాండరింగ్ నేరారోపణల కింద చందా కొచ్చర్ ను ఈడీ గత సంవత్సరం సెప్టెంబర్ లో అరెస్ట్ కూడా చేసింది.

WhatsApp channel