Cars Under 10L : కొత్తకారు తీసుకోవాలనుకుంటున్నారా? 10లక్షలలోపు ధరలోని వీటిపై లుక్కేయండి-cars under 10 lakhs rupees kia sonet to tata curvv check budget cars here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Cars Under 10l : కొత్తకారు తీసుకోవాలనుకుంటున్నారా? 10లక్షలలోపు ధరలోని వీటిపై లుక్కేయండి

Cars Under 10L : కొత్తకారు తీసుకోవాలనుకుంటున్నారా? 10లక్షలలోపు ధరలోని వీటిపై లుక్కేయండి

Anand Sai HT Telugu
Oct 20, 2024 02:30 PM IST

Cars Under 10L Rupees : కొత్త కారు తీసుకోవాలి అనుకునేవారికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ పండుగ సీజన్‌లో చాలా ఆఫర్లు కూడా ఉన్నాయి. మీరు పది లక్షలలోపు ధరతో కారు తీసుకోవాలి అనుకుంటే మీకోసం కింద లిస్ట్ ఉంది. ఓ లుక్కేయండి..

సిట్రోయెన్​ బసాల్ట్
సిట్రోయెన్​ బసాల్ట్

కారు కొనాలి అని అందరికీ ఆశ. అయితే అతిగా రేట్లు పెట్టి మిడిల్ క్లాసు వాళ్లు కొనలేరు. పది లక్షల రూపాయల వరకూ ఏదో కష్టం మీద కొనుక్కుంటారు. బడ్జెట్‌ ధరలో కొనే కారు డిజైన్‌, ఫీచర్లు ఎలా ఉంటాయా అనే ప్రశ్న అందరికీ ఉంటుంది. మీరు కొత్త కారు కొనాలి అని చూస్తుంటే.. మీ కోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ3ఎక్స్ఓ, టాటా కర్వ్, సిట్రోయెన్ బసాల్ట్ ఎస్‌యూవీవంటి కార్లురూ.10 లక్షలలోపు లభిస్తాయి.

కియా సోనెట్ ధర రూ. 8 నుండి రూ. 15.77 లక్షలుగా ఉంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో ఉంది. 24.1 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (10.25-అంగుళాల), 7-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్‌తో సహా చాలా ఫీచర్లు ఇందులో ఉంటాయి.

హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.94 లక్షల నుంచి రూ.13.53 లక్షల మధ్య ఉంది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్, 1-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఇది 24.2 కేఎంపీఎల్ మైలేజీని కూడా అందిస్తుంది. ఇందులో 5 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (8-అంగుళాల), సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, కనెక్ట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్ వంటి వివిధ ఫీచర్లు కూడా ఉంటాయి. ఇందులో సేఫ్టీ కోసం 6-ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ రూ. 7.79 నుండి రూ. 15.49 లక్షల ఎక్స్-షోరూమ్‌గా దొరుకుతుంది. 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ని కలిగి ఉంటుంది. ఇది 5 మంది వ్యక్తులకు సౌకర్యవంతంగా వెళ్లేందుకు బాగుంటుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది.

సిట్రోయెన్ బసాల్ట్ కూపే ఎస్‌యూవీ రూ.7.99 నుండి రూ.13.83 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలో వినియోగదారులకు దొరుకుతుంది. పెట్రోల్ ఇంజన్ కూడా వస్తుంది. ఇది 18 నుండి 19.5 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా అనేక ఫీచర్లు ఉంటాయి.

టాటా కర్వ్ కూపే కారు ధర రూ.9.99 నుంచి 17.69 లక్షల వరకు ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంటుంది. ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్‌తో సహా అనేక లక్షణాలను కలిగి ఉంది.

పైన చెప్పిన కార్లలో దీపావళి ఆఫర్లు కూడా ఉంటాయి. దగ్గరిలోని డిలర్‌షిప్‌ను సంప్రదించండి.

Whats_app_banner