Car sales in India : 2022లో రికార్డు స్థాయిలో వాహన విక్రయాలు!-car sales in india clocks record 37 93lakh vehicles in 2022 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Car Sales In India : 2022లో రికార్డు స్థాయిలో వాహన విక్రయాలు!

Car sales in India : 2022లో రికార్డు స్థాయిలో వాహన విక్రయాలు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 02, 2023 01:19 PM IST

Car sales in India in 2022 : 2022లో ఆటో పరిశ్రమ దూసుకెళ్లింది! గతేడాదిలో రికార్డు స్థాయిలో వాహనాల విక్రయాలు జరిగాయి!

2022లో రికార్డు స్థాయిలో వాహన విక్రయాలు!
2022లో రికార్డు స్థాయిలో వాహన విక్రయాలు!

Car sales in India in 2022 : కొవిడ్​ సంక్షోభంతో దాదాపు రెండేళ్ల పాటు అల్లాడిపోయిన ఆటో పరిశ్రమకు 2022 కలిసొచ్చింది! దేశీయ ఆటో రంగం.. 2022లో భారీగా పుంజుకుంది. ముఖ్యంగా డొమెస్టిక్​ ప్యాసింజర్​ వెహికిల్స్​ సెగ్మెంట్​ రయ్​రయ్​మంటూ దూసుకెళ్లింది. 2022లో మొత్తం మీద 37.93లక్షల ప్యాసింజర్​ వెహికిల్స్​ అమ్ముడుపోయాయి. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే ఇది 23శాతం అధికం! టాటా మోటార్స్​, మారుతీ సుజుకీ, హ్యుందాయ్​ వంటి దిగ్గజ ఆటో సంస్థలు.. కొత్త కొత్త లాంచ్​లతో కస్టమర్లకు ఆకర్షించాయి. సెమీకండక్టర్​ల కొరత వంటి సవాళ్లు తగ్గిపోతుండటం కూడా ఆటో పరిశ్రమకు కలిసివచ్చింది. ముఖ్యంగా టయోటా, స్కోడా వంటి సంస్థలు.. అత్యధిక సేల్స్​ను సాధించాయి.

తగ్గేదే.. లే!

"2022 జనవరి- డిసెంబర్​లో పరిశ్రమ హోల్​సేల్​ విక్రయాలు దాదాపు 38లక్షల యూనిట్​లుగా నమోదయ్యాయి. ఓ క్యాలెండర్​ ఇయర్​లో ఆటో పరిశ్రమకు ఇదే అత్యధిక నెంబర్​! 2018లో 33.5లక్షల యూనిట్​లు అమ్ముడుపోయాయి. అంటే.. అప్పటితో పోల్చుకుంటే ఇది 14శాతం ఎక్కువ. ఇండియాలో ఆటో రంగానికి ఇంకా పొటెన్షియల్​ ఉంది," అని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​, మార్కెటింగ్​ అండ్​ సేల్స్​ శశాంక్​ శ్రీవాస్తవ మీడియాకు వెల్లడించారు. 2022లో కొవిడ్​ సంక్షోభం ప్రభావం తగ్గడం, సెమీకండక్టర్​ల సమస్య పరిష్కారమవుతుండటం.. ఆటో సంస్థలకు కలిసివచ్చిందని శశాంక్​ అభిప్రాయపడ్డారు.

Car sales in India : "గత మూడేళ్లల్లో ఆటో విక్రయాలు తగ్గాయి. కానీ ఎస్​యూవీలకు డిమాండ్​ పెరుగుతూనే ఉంది. మొత్తం ప్యాసింజర్​ వెహికిల్​ సేల్స్​లో ఎస్​యూవీ వాటా 42.3శాతంగా ఉండటం విశేషం. 2022లో అమ్ముడుపోయిన మొత్తం వాహనాల్లో రూ. 10లక్షలు, అంతకన్నా తక్కువ ధర ఉన్న వెహికిల్స్​ వాటా 40శాతం ఉండొచ్చు," అని శశాంక శ్రీవాస్తవ వెల్లడించారు.

Maruti Suzuki car sales in December : ఇక మారుతీ సుజుకీ విషయానికొస్తే.. 2022లో 15.76లక్షల యునిట్​లను విక్రయించింది ఈ దేశీయ దిగ్గజ ఆటో సంస్థ. 2021లో ఇది 13.64లక్షలుగా ఉండేది. అంట 16శాతం పెరిగినట్టు. మరోవైపు.. హ్యుందాయ్​ మోటార్స్​.. 2022లో 5,52,511 యూనిట్​ను అమ్మింది. 2021(5,05,033)తో పోల్చుకుంటే ఇది 9.4శాతం ఎక్కువ.

Tata Motors car sales in 2022 : అదే విధంగా టాటా మోటార్స్​కి సైతం 2022 కలిసి వచ్చింది. హోల్​సేల్​గా 5,26,798 యూనిట్​లను గతేడాదిలో విక్రయించింది టాటా మోటార్స్​. ఈ సంస్థకు చెందిన డిసెంబర్​ ఆటో సేల్స్​ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

టయోటా కిర్లోస్కర్​, స్కోడా ఆటో ఇండియా వంటి సంస్థలు.. 2022లో దుమ్మురేపాయి! ఇండియాలో.. ఆయా సంస్థల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సేల్స్​ జరిగాయి. టయోటా 1,60,357 యూనిట్​లను విక్రయించగా.. స్కోడా సంస్థ 53,721 వాహనాలను అమ్మింది.

భారత ఆటో పరిశ్రమకు 2022 ఆగస్టు- అక్టోబర్​ నెలలు కలిసివచ్చాయి. పండుగ సీజన్​లో వాహనాల విక్రయలు రికార్డు స్థాయిలో జరగడం ఇందుకు ప్రధాన కారణం.

2023లోనూ ఇదే తరహా జోష్​ కొనసాగుతుందని ఆటో సంస్థలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు పలు లాంచ్​లతో సన్నద్ధమవుతున్నాయి. డిమాండ్​ ఉన్న వాహనాలకు సంబంధించిన ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లను కూడా సిద్ధంచేస్తున్నాయి.

సంబంధిత కథనం