కారు రంగు మార్చాలనుకుంటే ఈ రూల్స్ తెలుసుకోవాలి.. లేదంటే ఫైన్, బీమా రిజెక్ట్ అవ్వొచ్చు!-car colour change legal requirements and procedure in india know must follow rto rules ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  కారు రంగు మార్చాలనుకుంటే ఈ రూల్స్ తెలుసుకోవాలి.. లేదంటే ఫైన్, బీమా రిజెక్ట్ అవ్వొచ్చు!

కారు రంగు మార్చాలనుకుంటే ఈ రూల్స్ తెలుసుకోవాలి.. లేదంటే ఫైన్, బీమా రిజెక్ట్ అవ్వొచ్చు!

Anand Sai HT Telugu
Dec 08, 2024 10:00 PM IST

Car Colour Change Rules : ఎక్కువ సంవత్సరాలు ఒకే రంగు కారును వాడితే బోర్ కొట్టవచ్చు. ఇలాంటి సమయంలో కొందరు కారు రంగును మార్చాలని అనుకుంటారు. కానీ దీనికి సంబంధించి రూల్స్ ఏమున్నాయో తెలుసుకోరు. తర్వాత చాలా ఇబ్బందులు పడుతుంటారు.

కారు రంగు మార్చితే పాటించాల్సిన రూల్స్
కారు రంగు మార్చితే పాటించాల్సిన రూల్స్

కారు అందంగా కనిపించాలంటే ముఖ్యమైనది దాని రంగు. కొందరు కారు రంగును మార్చాలనుకుంటారు. ఉదాహరణకు నలుపు రంగు కారును.. ఎరుపు రంగుకు మారుస్తారు. అయితే వాహనాల రంగును మార్చడానికి అనుమతి ఉంది. ఇందుకోసం కొన్ని అధికారిక విధానాలను పాటించాల్సి ఉంటుంది. రూల్స్ పాటించకపోతే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడవచ్చు. చాలా మందికి తమ వాహనాల రంగు మార్చడానికి ముందు ఏం చేయాలో తెలియదు. ఈ విషయాలు తెలుసుకోండి..

yearly horoscope entry point

కారు రంగును మార్చడానికి మొదట చేయాల్సిన పని ఏంటంటే.. ఆ ప్రాంతంలోని ప్రాంతీయ రవాణా కార్యాలయం(RTO) నుండి అనుమతి తీసుకోవాలి. ఆర్టీఓ నుండి అనుమతి పొందిన తర్వాత వాహనం రంగును మార్చడంలో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(RC)లో రంగు మార్పును అప్‌డేట్ చేయాలి. ఆర్టీఓ అధికారులు ధృవీకరించిన తర్వాత ఆర్సీ అప్‌డేట్ అవుతుంది.

ఆమోదించిన రంగును పెయింట్ చేయడానికి జాగ్రత్త తీసుకోవాలి. వాహనం రంగును మార్చడానికి ఆర్టీఓకి నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు కారు ఆర్సీలో నమోదు అయిందని చూసుకోవాలి. ఈ విషయాలను పాటించకుండా కారు రంగు మార్చడం సమస్యలు తెచ్చిపెడుతుంది. వాహన తనిఖీ సమయంలో పోలీసు లేదా మోటారు వాహన శాఖ అడిగే మొదటి పత్రాల్లో ఆర్‌సి పుస్తకం ఫస్ట్ ఉంటుంది.

తనిఖీల్లో వాహనం రంగులో తేడాలు కనిపిస్తే జరిమానా విధించడం లేదా కారును జప్తు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. మీరు కారు రంగును మార్చినట్లయితే దాని ఆర్సీలో అప్‌డేట్ చేయాలి. ఇది చట్టపరమైన సమస్యలను లేకుండా చేస్తుంది. కారు రంగును మార్చడంతోపాటు వాహనానికి చేసిన చట్టపరమైన సవరణలు కూడా అధికారికంగా నమోదు అవ్వాలి.

ఈ అంశాలు తెలియక కొందరు తమ వాహనం రంగు మార్చుకుని పోలీసులకు చిక్కి జరిమానా చెల్లించాల్సి వస్తోంది. కారు గుర్తింపులలో రంగు ఒకటి. అందుకే ప్రభుత్వ పత్రంలో కూడా మార్చాలని మోటారు వాహన చట్టం చెబుతోంది. కారు దొంగలించి రంగు మార్చడంలాంటి వాటిని అరికట్టేందుకు అధికారులు ఇలాంటి వాటిని కఠినతరం చేస్తున్నారు.

ఆర్టీఓ నుండి అనుమతి తీసుకోవడం, రంగు మార్చడానికి ముందు ఆర్సీ అప్‌డేట్ చేయడం అంత కష్టం కాదు. ఇలా చేయడం జరిమానాలను నివారించవచ్చు. కారు రంగు మార్పు గురించి బీమా కంపెనీకి తెలపాలి. పెనాల్టీ ఛార్జీలు లేదా అధిక ప్రీమియంలు విధించవచ్చు. భవిష్యత్తులో ఏవైనా క్లెయిమ్‌లు అవసరమైతే కొన్నిసార్లు బీమా కంపెనీ ఈ కారణంతో దానిని తిరస్కరించవచ్చు. కారు బేస్ కలర్‌ను మార్చకుండానే కారులో చిన్న స్టిక్కర్ వర్క్, హైలైట్ రంగు మార్పులకు అనుమతి ఉంటుంది. దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

Whats_app_banner