Car Battery Tips : చలికాలంలో మీ కారు బ్యాటరీ పాడవకుండా ఈ 5 చిట్కాలు ఉపయోగపడతాయి
Car Battery Tips : చలికాలం మనుషులకే కాదు.. కారు ఇంజిన్‌కు కూడా ఇబ్బందే. కారు బ్యాటరీతో శీతాకాలంలో సమస్యలను ఎదుర్కొంటే.. బ్యాటరీ నిర్వహణకు సంబంధించి కొన్ని చిట్కాలను ఫాలో అవ్వండి. వీటితో మీ కారు బ్యాటరీ పాడవకుండా ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో చలి బాగా పెరిగింది. ఈ సమయంలో వాహనాలను కూడా సరిగా చూసుకోవాలి. కారు బ్యాటరీ శీతాకాలంలో చాలా సమస్యలను ఎదుర్కొంటుంది. కొన్ని రోజులు కారుని ఉపయోగించకపోతే తర్వాత దాన్ని స్టార్ట్ చేయడం కష్టంగా అవుతుంది. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, బ్యాటరీ పనితీరు కూడా తగ్గుతుంది. బ్యాటరీని జాగ్రత్తగా చాలా మంది చూసుకోరు. బ్యాటరీ నిర్వహణకు సంబంధించి కొన్ని చిట్కాలు పాటించాలి.
బ్యాటరీ టెర్మినల్స్‌పై గ్రీజు
వాహనాన్ని సర్వీస్ చేయిస్తున్నప్పుడు మెకానిక్స్ బ్యాటరీ టెర్మినల్స్‌పై గ్రీజును అప్లై చేస్తారు. అయితే బ్యాటరీ నిపుణులు దీనిని తప్పుగా భావిస్తారు. ఇది బ్యాటరీకి హాని కలిగించవచ్చు. అందువల్ల గ్రీజుకు బదులుగా పెట్రోలియం జెల్లీ లేదా వాసెలిన్ ఉపయోగించవచ్చు. బ్యాటరీ టెర్మినల్స్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. బ్యాటరీ టెర్మినల్స్ దగ్గర తరచుగా యాసిడ్ పేరుకుపోతుంది. ఇది శుభ్రం చేయడం చాలా ముఖ్యం.
ఎలక్ట్రానిక్ సిస్టమ్
కారులో హీటర్, లైట్లు, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అనేక ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లు ఉన్నాయి. ఇవన్నీ ఆన్‌లో ఉన్నప్పుడు అవి బ్యాటరీ శక్తిని అనవసరంగా వినియోగిస్తాయి. అవసరం ఉన్నప్పుడే వాటిని వాడుకోవాలి. కారును ఆఫ్ చేసినప్పుడు బ్యాటరీపై ఎటువంటి ఒత్తిడి ఉండదని గుర్తుంచుకోండి.
ఇంజిన్ సరిగా చూసుకోవాలి
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇంజిన్ వేడి అయితే అది కారు బ్యాటరీపై కూడా ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో కారు బ్యాటరీలోని నీరు త్వరగా ఆరిపోతుంది. దీని కారణంగా బ్యాటరీ త్వరగా ఆక్సీకరణం చెందుతుంది. అందువల్ల ఇంజిన్ సంరక్షణ కూడా చాలా ముఖ్యం.
బ్యాటరీ వార్మర్
బ్యాటరీ వార్మర్ కారు బ్యాటరీకి సులభంగా అందుబాటులో ఉంటంది. దీనితో మీరు బ్యాటరీని చల్లగా ఉన్నప్పుడు సులభంగా వేడి చేయవచ్చు. దీని కారణంగా పనితీరు మెరుగుపడుతుంది. బ్యాటరీ త్వరగా చెడిపోదు. ముఖ్యంగా ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉన్న చోట, బ్యాటరీ వార్మర్ ఉపయోగించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
సింథటిక్ ఆయిల్
సింథటిక్ ఆయిల్ వాడకం శీతాకాలంలో కారు ఇంజిన్‌కు మంచిదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది సులభంగా ప్రవహిస్తుంది. దీని కారణంగా చల్లని వాతావరణంలో ఇంజిన్‌ను త్వరగా స్టార్ట్ చేయడంలో సహాయపడుతుంది. బ్యాటరీపై ఒత్తిడిని తగ్గిస్తుంది. బ్యాటరీ జీవితకాలాన్ని పెంచుతుంది.
టాపిక్