Electric SUV : సింగిల్​ ఛార్జ్​తో 500 కి.మీ రేంజ్​- ఈ లగ్జరీ, ఫీచర్​ లోడెడ్​ ఈవీ ఇండియాలోకి వచ్చేస్తోంది..-byd to launch high performance sealion 7 electric suv in india debut at auto expo 2025 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Suv : సింగిల్​ ఛార్జ్​తో 500 కి.మీ రేంజ్​- ఈ లగ్జరీ, ఫీచర్​ లోడెడ్​ ఈవీ ఇండియాలోకి వచ్చేస్తోంది..

Electric SUV : సింగిల్​ ఛార్జ్​తో 500 కి.మీ రేంజ్​- ఈ లగ్జరీ, ఫీచర్​ లోడెడ్​ ఈవీ ఇండియాలోకి వచ్చేస్తోంది..

Sharath Chitturi HT Telugu
Jan 07, 2025 06:40 AM IST

BYD Sealion 7 : సరికొత్త ఎలక్ట్రిక్​ కారును ఇండియాలోకి తీసుకొస్తోంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ బీవైడీ. దీని పేరు సీలియన్​ 7. ఇదొక హై పర్ఫార్మెన్స్​తో కూడిన ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ. ఈ మోడల్​ పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

బీవైడీ సీలియన్​ 7 ఎలక్ట్రిక్​ కారు..
బీవైడీ సీలియన్​ 7 ఎలక్ట్రిక్​ కారు..

ఇండియాలో లగ్జరీ ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో పోటీ మరింత పెరగనుంది! దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ బీవైడీ.. సరికొత్త మోడల్​పై కీలక ప్రకటన ఇందుకు కారణం. జనవరి 17న ప్రారంభంకానున్న భారత్​ మొబిలిటీ గ్లోబల్​ ఎక్స్​పోలో తన హై పర్ఫార్మెన్స్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ అయిన సీలియన్​ 7ని ఆవిష్కరించనున్నట్టు తెలిపింది. ఈ ఏడాది చివరిలో ఈ ఎలక్ట్రిక్ కారును భారత్​లో లాంచ్ చేయనున్నట్లు బీవైడీ ధృవీకరించింది.

yearly horoscope entry point

ఈ బీవైడీ సీలియన్ 7​ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ ఇప్పటికే చైనా, యూరప్ వంటి మార్కెట్లలో అందుబాటులో ఉంది.

బీవైడీ సీలియన్​ 7..

యూరో-స్పెక్ సీలియన్ 7 వెర్షన్​ను భారతదేశంలో ప్రదర్శించాలని సంస్థ భావిస్తోంది. ఇది రేర్-వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్లతో వస్తుంది. ఈవీ మొత్తం పొడవు 4,830 ఎంఎం, వెడల్పు 1,925 ఎంఎం, ఎత్తు 1,620 ఎంఎం, వీల్ బేస్ 2,930 ఎంఎం. ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ 19-ఇంచ్​ అల్లాయ్ వీల్స్​పై ఉంటుంది. ఆప్షనల్ 20-ఇంచ్​ వీల్స్​ కూడా ఉన్నాయి.

బీవైడీ సీలియన్ 7: అత్యంత శక్తివంతమైన బీవైడీ ఎలక్ట్రిక్ కారు?

బీవైడీ సీలియన్ 7ని పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీగా పిలుస్తున్నారు. సీలియన్ 7 కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని, గరిష్టంగా గంటకు 215 కిలోమీటర్ల వేగంతో ప్రయాణింవచ్చని బీవైడీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ.. 523 బీహెచ్​పీ పవర్, 690 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని అందిస్తుంది. సీలియన్ 7 23,000 ఆర్​పిఎమ్ వేగంతో నడుస్తుందని, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ మోటారుగా ఇది గుర్తింపు పొందిందని బీవైడీ తెలిపింది.

బివైడి సీలియన్ 7: రేంజ్- బ్యాటరీ..

సీలియన్ 7 ఎలక్ట్రిక్ ఎస్​యూవీ బీవైడీ ప్రసిద్ధ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ నుంచి ప్రయోజనం పొందుతుంది. ఇది రెండు సైజుల్లో బ్యాటరీలను కలిగి ఉంటుంది. రేర్ వీల్ డ్రైవ్ కంఫర్ట్ వేరియంట్, ఆల్-వీల్ డ్రైవ్ డిజైన్ వేరియంట్ 82.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​ను పొందుతాయి. సింగిల్-మోటార్ ఆర్​డబ్ల్యూడీ వర్షెన్ సింగిల్ ఛార్జ్​తో 482 కిలోమీటర్ల రేంజ్​ని అందిస్తుంది. డ్యూయల్-మోటార్ ఏడబ్ల్యూడీ 456 కిలోమీటర్ల రేంజ్​ని అందిస్తుంది. ఏడబ్ల్యూడీ ఫీచర్​తో టాప్-ఆఫ్-రేంజ్ ఎక్సలెన్స్ వేరియంట్ 91.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​ను పొందుతుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 502 కిలోమీటర్ల రేంజ్​ని అందిస్తుంది. ఈ బ్యాటరీలు డీసీ ఫాస్ట్ ఛార్జర్లకు అనుకూలంగా ఉంటాయి. 230 కిలోవాట్ల వరకు సపోర్ట్ చేస్తాయి. టాప్-స్పెక్ వేరియంట్ ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి కేవలం 24 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు రీఛార్జ్ చేసుకోవచ్చని బీవైడీ తెలిపింది.

బీవైడీ సీలియన్ 7: సూపర్​ ఫీచర్లు..

బీవైడీ సీలియన్ 7.. సెగ్మెంట్​లోనే ఫీచర్​ లోడెడ్​ ఎలక్ట్రిక్​ కారుగా వస్తోంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్​ప్లే రెండింటికీ అనుకూలమైన 15.6 ఇంచ్​ రొటేటింగ్ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇందులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీలో 10.25 ఇంచ్​ డిజిటల్ డ్రైవర్ డిస్​ప్లే, వైర్లెస్ స్మార్ట్​ఫోన్​ ఛార్జింగ్, ముందు, వెనుక ప్రయాణీకుల కోసం యూఎస్​బీ పోర్ట్​లు, 12-స్పీకర్ ఆడియో సిస్టెమ్, చిన్న ఫ్రిజ్ లేదా కాఫీ మెషిన్ వంటి బాహ్య గాడ్జెట్లను శక్తివంతం చేయడానికి సహాయపడే వెహికల్-టు-లోడ్ (వీ2ఎల్) టెక్నాలజీ వంటివి ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం