BYD Sealion 6 : ఈ బీవైడీ లగ్జరీ ఎస్యూవీ ఎక్కితే.. ఆగకుండా ఈజీగా 1090 కి.మీల ప్రయాణం!
BYD Sealion 6 : ఆటో ఎక్స్పో 2025లో బీవైడీ సీలియన్ 6ని సంస్థ ప్రదర్శించింది. ఇదొక హైబ్రీడ్ వెహికిల్. దీనిలో 1090 కి.మీల దూరం ప్రయాణించవచ్చు.
దిల్లీ వేదికగా జరుగుతున్న ఆటో ఎక్స్పో 2025లో సరికొత్త మోడల్ని ప్రదర్శించింది బీవైడీ. దీని పేరు బీవైడీ సీలియన్ 6. ఇది భారతదేశంలో వాహన తయారీదారు నుంచి మొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ కావచ్చు.
బీవైడీ సీలియన్ 6..
బివైడి సీలియన్ 6 పీహెచ్ఈవీ ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 18.3 కిలోవాట్ల బ్యాటరీ కూడా ఉంది. ఈ రెండు వనరులతో ఈ బీవైడీ సీలియన్ 6 హైబ్రిడ్ ఎస్‌యూవీలో.. ఫుల్‌ఛార్జ్, 60 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ పూర్తి రీఫిల్‌పై 1,092 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించొచ్చు.
ఈ లగ్జరీ ఎస్‌యూవీకి సంబంధించి అంతర్జాతీయంగా రెండు వేరియంట్లు ఉన్నాయి. సీలియన్ 6 డైనమిక్ అని పిలిచే ఈ బేస్ మోడల్లో నేచురల్లీ ఆస్పిరేటెడ్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 218 బీహెచ్పై పవర్‌ని, 300 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
ప్రీమియం వేరియంట్ 163 బీహెచ్పీ రేర్ మోటార్‌తో వస్తుంది. టర్బోఛార్జ్డ్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇందులో ఉంటుంది. డైనమిక్ వేరియంట్ 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 8.5 సెకన్లలో అందుకుంటుందని, ప్రీమియం దీనిని 5.9 సెకన్లలో పూర్తి చేస్తుందని సంస్థ పేర్కొంది. ఈ రెండు వేరియంట్లు 81 కిలోమీటర్లు, 92 కిలోమీటర్ల ఎలక్ట్రిక్-ఓన్లీ రేంజ్‌ని అందిస్తాయి.
బీవైడీ సీలియన్ 6: డిజైన్- డైమెన్షన్స్..
సీలియన్ 6 4,775 ఎంఎం పొడవు, 1,890 ఎంఎం వెడల్పు, 1,670 ఎంఎం ఎత్తు, 2,765 ఎంఎం వీల్ బేస్‌తో వస్తుంది. బూట్ సామర్థ్యం దాని సీట్ల కాన్ఫిగరేషన్‌ని బట్టి 425 లీటర్ల నుంచి 1,440 లీటర్ల వరకు ఉంటుంది. ఈ ఎస్యూవీ బరువు వేరియంట్‌ను బట్టి 1,940 కిలోల నుంచి 2,100 కిలోల మధ్య ఉంటుంది. 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ని అమర్చారు. ఇవి 235/50 ఆర్ 19 టైర్లతో ఉంటాయి.
బీవైడీ సీలియన్ 6: క్యాబిన్- ఫీచర్లు..
ఈ ఎస్యూవీ క్యాబిన్లో డ్యాష్ బోర్డ్, సెంటర్ కన్సోల్‌పై సిల్వర్ ట్రిమ్‌తో టాన్, నలుపు లేదా ఆఫ్-వైట్, నలుపు రంగులలో డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌ని కలిగి ఉంది. త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్, లెథరెట్ అప్‌హోలిస్ట్రీ, 15.6 ఇంచ్ రొటేటింగ్ ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, 12.3 ఇంచ్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ప్రత్యేకతలున్నాయి.
ఏడు ఎయిర్ బ్యాగులు, అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్), 360 డిగ్రీల కెమెరాలు, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 10 స్పీకర్ల ఇన్ఫినిటీ ఆడియో సిస్టమ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, పనోరమా సన్ రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
సంబంధిత కథనం