Electric Vehicles : ఈ కంపెనీ 10 మిలియన్ల ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసింది.. డిమాండ్ మాత్రం అస్సలు తగ్గేదేలే
BYD Electric Car : ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో చైనా కార్ల తయారీ సంస్థ బీవైడీ చరిత్ర సృష్టించింది. బివైడి ఇటీవల 10 మిలియన్ల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని దాటింది. ఆ విషయాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ భారీ ఉత్పత్తి మైలురాయిని సాధించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారైన హీవైడీ ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ కార్లతో సహా 10 మిలియన్ల న్యూ ఎనర్జీ వాహనాలను (ఎన్ఇవి) ఉత్పత్తి చేసింది. బీవైడీ ఇటీవల అమెరికా ఈవీ దిగ్గజం టెస్లాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థగా అవతరించింది. చైనాలోని షెన్ జెన్-షాన్వే స్పెషల్ కోఆపరేషన్ జోన్‌లో ఉన్న బీవైడీకి చెందిన జియావోమో ఉత్పత్తి కేంద్రం నుంచి ఈ ఎలక్ట్రిక్ కార్లు ఉత్పత్తి అవుతున్నాయి.
ఈ చారిత్రాత్మక ఘనతను సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు బీవైడీ. టెస్లా వంటి ఇతర ఈవీ దిగ్గజాలను అధిగమించింది. బీవైడీ 5 మిలియన్ ఎన్ఇవి ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడానికి 15 సంవత్సరాలు పట్టింది. గత 15 నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని 5 మిలియన్ యూనిట్లకు పెంచారు. ఈ సమయంలో బీవైడీ టెస్లాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుగా అవతరించింది.
బీవైడీ 1995లో రీఛార్జబుల్ బ్యాటరీ తయారీదారుగా ప్రారంభమైంది. ఆ తర్వాత 2003లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోకి అడుగుపెట్టింది. ఇది ప్రస్తుతం భారతదేశంతో సహా సుమారు 70 దేశాల్లో తన ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర వాహనాలను విక్రయిస్తోంది.
భారతదేశంలో బీవైడీ మార్చి 2007లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు చెన్నై నుండి కార్యకలాపాలను ప్రారంభించింది. దీంతో ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలు భారతదేశంలో అరంగేట్రం చేశాయి. తమిళనాడులో ఈ కంపెనీ 1.40 లక్షల చదరపు కిలోమీటర్లలో ఉంది. 200 మిలియన్లకు పైగా పెట్టుబడితో యు.ఎస్ అంతటా రెండు ప్లాంట్లు ఉన్నాయి. బీవైడీ ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఎలక్ట్రిక్ ఫోర్క్ లిఫ్ట్‌లను తయారు చేస్తుంది.
బీవైడీ ఇటీవల తన కొత్త ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీ ఇమాక్స్ 7ను భారతదేశంలో విడుదల చేసింది. భారత మార్కెట్లో మరో రెండు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. వీటిలో బీవైడీ ఆటో 3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ ఉన్నాయి. ఈవీ తయారీదారుకు ప్రస్తుతం భారతదేశంలోని 23 నగరాల్లో 27 షోరూమ్‌లు ఉన్నాయి.