లగ్జరీ ఫీచర్లు ఇష్టపడేవారి కోసం వస్తున్న బీవైడీ ఎలక్ట్రిక్ కారు.. పేటెంట్ కోసం దరఖాస్తు!
BYD Denza N19 Electric Car : బీవైడీ కార్లకు గ్లోబల్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ కంపెనీకి చెందిన డెంజా ఎన్9 ఎలక్ట్రిక్ కారు వచ్చేందుకు సిద్ధమవుతోంది. భారత్‌లో పేటెంట్ కోసం ఈ కంపెనీ దరఖాస్తు చేసింది.
బీవైడీ ధనవంతుల ఇష్టమైన కార్ బ్రాండ్‌గా మారింది. చైనాకు చెందిన ఈ కంపెనీ భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌పై దృష్టి సారించింది. బీవైడీ త్వరలో భారతదేశంలో ఒక పెద్ద షిప్‌లాంటి కారును విడుదల చేయబోతున్నట్లు నివేదికలు ఉన్నాయి. భారతదేశంలో తన కొత్త కారు మోడల్ కోసం పేటెంట్ రిజిస్ట్రేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పత్రం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ పత్రం ద్వారా డెంజా ఎన్9 కారు మోడల్‌కు పేటెంట్ నమోదు చేసినట్లు తెలిసింది.
ఇది పెద్ద బాడీ షేప్‌తో కూడిన ఎస్‌యూవీ రకం ఎలక్ట్రిక్ కార్ మోడల్. ఇప్పుడు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ కారు కంటే ముందు మరికొన్ని కార్ల మోడల్స్ విక్రయానికి రావచ్చని సూచిస్తున్నాయి. కొత్త డెంజా ఎన్9 భారతదేశంలో అమ్మకానికి వస్తే, ఇది ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కార్ మోడల్‌కు పెద్ద సవాలుగా మారుతుంది.
ఈ కారు మోడల్‌కు చైనాతో పాటు గ్లోబల్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. డెంజా ఎన్9 భారతదేశంలో కూడా అదే డిమాండ్‌ను పొందుతుందని భావిస్తున్నారు. ఈ కారులో 2+2+2 మూడు వరుసల సీటింగ్ అరేంజ్ మెంట్ ఉంటుందని, ఇది ఆరుగురు వ్యక్తులు కూర్చునేందుకు వీలుగా ఉంటుందని చెబుతున్నారు. డెంజా ఎన్9 ఫ్యామిలీ ప్రయాణించేందుకు సౌకర్యవంతమైన కారు.
ఇందులో 50 అంగుళాల స్క్రీన్, 17.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 13.2-అంగుళాల డ్రైవర్స్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండనుంది. ఈ కారులో అనేక ఫీచర్లు రానున్నాయి. లగ్జరీ ఫీచర్లను ఇష్టపడే వారిని ఈ మోడల్ ఆకర్షించనుంది. రేంజ్, హై పవర్ పరంగా ఈ కారు మోడల్ అద్భుతంగా ఉంటుందని అంటున్నారు.
పూర్తి ఛార్జ్‌పై 400 కిమీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందించే బ్యాటరీ ప్యాక్‌తో, 952 బీహెచ్‌పీ శక్తిని పంపింగ్ చేయగల ఎలక్ట్రిక్ మోటారుతో అందుబాటులోకి రానుంది. ఈ కారు ప్లగ్-ఇన్ హైబ్రిడ్‌గా కూడా అందుబాటులో ఉంది. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.