BYD Atto 3 EV launch : ఇండియాలో బీవైడీ అట్టో 3 లాంచ్​.. ధర రూ. 34లక్షలు!-byd atto 3 ev launched in india at 33 99 lakhs check full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Byd Atto 3 Ev Launch : ఇండియాలో బీవైడీ అట్టో 3 లాంచ్​.. ధర రూ. 34లక్షలు!

BYD Atto 3 EV launch : ఇండియాలో బీవైడీ అట్టో 3 లాంచ్​.. ధర రూ. 34లక్షలు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 14, 2022 01:44 PM IST

BYD Atto 3 EV launched in India : బీవైడీ అట్టో 3 ఈవీ ఇండియాలో లాంచ్​ అయ్యింది. దీని ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

బీవైడీ అట్టో 3
బీవైడీ అట్టో 3 (HT AUTO)

BYD Atto 3 EV launched in India : చైనా ఆటో సంస్థ బీవైడీ(బిల్డ్​ యువర్​ డ్రీమ్స్​).. ఇండియాలో అట్టో 3 ఈవీని లాంచ్​ చేసింది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 33.99లక్షలుగా ఉంది. ఈ6 ఎంపీవీ తర్వాత.. ఇండియాలో బీవైడీ లాంచ్​ చేసిన రెండో మోడల్​ ఈ అట్టో 3.

ఈ బీవైడీ అట్టో 3కి సంబంధించిన బుకింగ్స్​ అక్టోబర్​ 11 నుంచే ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 1,500 బుకింగ్స్​ వచ్చినట్టు సంస్థ చెప్పింది. రూ. 50వేలు చెల్లించి కారును బుక్​ చేసుకోవచ్చు. 2023 జనవరి నుంచి వాహనాల డెలివరీ ప్రారంభమవుతుంది.

తమిళనాడులోని శ్రీపెరంబదూర్​ ఫ్యాక్టరీలో ఈ బీవైడీ అట్టో 3 అసెంబ్లింగ్​ జరుగుతోంది. ఇందులో ఈడీఏఎస్​ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఎంజీ జెడ్​ఎస్​ ఈవీ, హ్యుందాయ్​ కోనాకు ఇది గట్టి పోటినిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

డిజైన్​.. ఫీచర్స్​..

BYD Atto 3 EV price : బీవైడీ అట్టో 3 ఈవీలో సిల్వర్​ ఫ్రంట్​ గ్రిల్​ ఉంటుంది. ఎల్​ఈడీ డీఆర్​ఎల్​లు వింగ్​ షేప్​లో కనిపిస్తాయి. గ్రిల్​ మీద బీవైడీ అని అక్షరాలు బోల్డ్​గా ఉంటాయి. ట్రపెజోయిడ్​ ఆకారంలోని డ్యూయెల్​ టోన్​ బంపర్​, ఫౌక్స్​ సిల్వర్​ స్కిడ్​ ప్లేట్​లు.. ఈ వాహనానికి మరింత స్టైలిష్​ లుక్​ను తెచ్చిపెడుతున్నాయి.

ఈ బీవైడీ అట్టో 3 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో 18 ఇంచ్​ డ్యూయెల్​ టోన్​ అలాయ్​ వీల్స్​ ఉంటాయి. రేర్​లో ఫుల్​ లెంత్​ ఎల్​ఈడీ టెయిల్​ ల్యాంప్స్​ ఉన్నాయి. డ్యుయెల్​ టోన్​ బంపర్​ కూడా ఉంది. బౌల్డర్​ గ్రే, పార్కౌర్​ రెడ్​, స్కై వైట్​, సర్ఫ్​ బ్లూ రంగుల్లో ఈ ఈవీ అందుబాటులో ఉంది.

BYD Atto 3 EV features : ఇక ఈ కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఇంటీరియర్​ యునీక్​గా కనిపిస్తోంది. డోర్​ మౌంటెడ్​ స్పీకరస్​, స్టైలిష్​ ఎయిర్​ కాన్​ వెంట్స్​, 12.8 ఇంచ్​ రొటేటింగ్​ సెంట్రల్​ స్క్రీన్​ ఉన్నాయి. స్క్రీన్​కు ఆండ్రాయిడ్​ ఆటో, యాపిల్​ కార్​ప్లే సపోర్ట్​ లభిస్తుంది. అట్టో 3 ఈవీలో పానారోమిక్​ సన్​రూఫ్​, పవర్డ్​ టెయిల్​గేట్​, పవర్డ్​ ఫ్రెంట్​ డ్రైవర్​- ప్యాసింజర్​ సీట్లు ఉంటాయి.

ఏడీఏఎస్​ టెక్నాలజీతో పాటు 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్​, ఈఎస్​సీ, ట్రాక్షన్​ కంట్రోల్​, హిల్​ డిసెంట్​ కంట్రోల్​తో పాటు 7 ఎయిర్​బ్యాగ్స్​.. ఈ బీవైడీ అట్టో 3 ఈవీలో సేఫ్టీ ఫీచర్స్​గా ఉన్నాయి.

బీవైడీ అట్టో 3 ఈవీ పర్ఫార్మెన్స్​..

BYD Atto 3 EV bookings : ఇక ఈ బీవైడీ అట్టో 3లోని ఎలక్ట్రిక్​ మోటార్​.. 201హెచ్​పీ, 310 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఫలితంగా ఈ వాహనం.. 0-100 కి.మీల వేగాన్ని కేవలం 7.3సెకన్లలో అందుకుంటుంది! ఇందులో 60.48కేడబ్ల్యూహెచ్​ బ్లేడ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 521కి.మీల దూరం ప్రయాణించవచ్చని సంస్థ చెబుతోంది. టై2 7కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్​తో 10 గంటల్లో ఛార్జింగ్​ పూర్తవుతుందని, 80కేడబ్ల్యూ డీసీ ఛార్జర్​తో 50 నిమిషాల్లో ఛార్జ్​ అయిపోతుందని అంటోంది.

వారెంటీ వివరాలు..

ఈ అట్టో 3 ఈవీ బ్యాటరీపై 8ఏళ్లు లేదా 1.6లక్షల కి.మీల ప్రయాణం వరకు వారెంటీని ఇస్తోంది బీవైడీ. ఎలక్ట్రిక్​ మోటార్​పై కూడా ఇదే తరహాలో వారెంటీని ఇస్తోంది. మొత్త వాహనానికి మాత్రం.. 6ఏళ్లు లేదా 1.5లక్షల కి.మీల ప్రయాణాన్ని వారెంటీగా ఇస్తోంది. వీటితో పాటు 3ఏళ్ల 4జీ డేటా సబ్​స్క్రిప్షన్​ను, 6ఏళ్ల పాటు రోడ్​ అసిస్టెన్స్​, 6 ఫ్రీ మెయింటేనెన్స్​ సర్వీసులను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది.

Whats_app_banner

సంబంధిత కథనం