Smart TV : అందుబాటు ధరలో స్మార్ట్ టీవీలు.. ఈ 3 బెస్ట్ డీల్స్ ఓసారి చూసేయండి
Smart TV Best Deals : బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీలు కొనాలనుకునేవారి కోసం చాలా ఆప్షన్స్ ఎదురుచూస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో లభించే మూడు చౌకైన స్మార్ట్ టీవీల గురించి తెలుసుకుందాం..

తక్కువ ధరలో మంచి ఫీచర్లతో బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నట్లయితే ఇక మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకుంటే ఫ్లిప్‌కార్ట్ మీకు తక్కువ ధరలోనే స్మార్ట్ ఫోన్లను అందిస్తుంది. మూడు చౌకైన స్మార్ట్ టీవీల గురించి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ లిస్టులో శాంసంగ్, షియోమీ, థామ్సన్ టీవీలు ఉన్నాయి. ఈ టీవీలు మంచి పిక్చర్ క్వాలిటీ, గొప్ప డాల్బీ ఆడియోతో వస్తాయి. వీటిపై ఓ లుక్కేద్దాం..
శాంసంగ్ టీవీ
శాంసంగ్ 80 సెంమీ (32 అంగుళాల) హెచ్‌డీ రెడీ ఎల్ ఈడీ స్మార్ట్ టిజెన్ టీవీ విత్ బెజెల్ ఫ్రీ డిజైన్ (UA32T4380AKXXL). ఈ శాంసంగ్ టీవీ ఎలాంటి ఆఫర్ లేకుండా ఫ్లిప్‌కార్ట్ లో రూ.12,990కు లభిస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే శాంసంగ్ టీవీ మీకు 1366 x 768 పిక్సెల్ రిజల్యూషన్‌తో హెచ్‌డీ డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 50 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. టైజెన్ ఓఎస్‌పై పనిచేసే ఈ టీవీలో డాల్బీ డిజిటల్ ప్లస్‌తో 20 వాట్ల సౌండ్ అవుట్ పుట్ లభిస్తుంది.
షియోమీ టీవీ
షియోమీ ఎ సిరీస్ 80 సెం.మీ (32 అంగుళాలు) హెచ్‌డీ రెడీ ఎల్ఈడి స్మార్ట్ గూగుల్ టీవీ 2024 ఎడిషన్. ఈ టీవీ ధర రూ .12,990. ఈ టీవీ 1366×768 పిక్సెల్ రిజల్యూషన్‌తో హెచ్‌డీ రెడీ డిస్‌ప్లేతో వస్తుంది. టీవీలో అందిస్తున్న ఈ డిస్‌ప్లే 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. అద్భుతమైన సౌండ్ కోసం మీరు ఈ టీవీలో 20 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌తో డాల్బీ ఆడియోను పొందుతారు. టీవీలో బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్ కూడా లభిస్తుంది.
థామ్సన్ టీవీ
థామ్సన్ ఎఫ్ఏ సిరీస్ 108 సెం.మీ (43 అంగుళాలు) ఫుల్ హెచ్‌డీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ విత్ డాల్బీ డిజిటల్ ప్లస్ అండ్ ఆండ్రాయిడ్ 11 (43ఆర్టీ1055). ఈ టీవీ రూ.16,999కు లభిస్తుంది. ఈ సంస్థ టీవీలో అనేక గొప్ప ఫీచర్లను అందిస్తోంది. ఈ టీవీ 1080×1920 పిక్సెల్ రిజల్యూషన్తో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ 30 వాట్ల సౌండ్ అవుట్ పుట్‌ను కలిగి ఉంది. డాల్బీ డిజిటల్, డీటీఎస్ టీవీ సౌండ్ క్వాలిటీని మరింత పెంచుతాయి. థామ్సన్ టీవీ ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో పనిచేస్తుంది.