Business Idea : వీరిని టార్గెట్ చేసి ఈ బిజినెస్ పెడితే మంచి లాభాలు.. పెట్టుబడి తక్కువే!
Business Idea : కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచన చేస్తే.. మీ కోసం ఓ ఐడియా ఉంది. తక్కువ పెట్టుబడితో మీరు దీనిని ప్రారంబించొచ్చు. అదేంటో కాదు జ్యూస్ బిజినెస్.
కొత్త వ్యాపారాన్ని మెుదలుపెట్టాలని ఆలోచిస్తున్నారా? మీ దగ్గర పెట్టుబడి తక్కువగా ఉందా? నో ప్రాబ్లమ్ తక్కువ పెట్టుబడితో పెట్టే బిజినెస్ ఐడియాలు చాలానే ఉన్నాయి. కొంత డబ్బు పెట్టుబడి పెట్టి.. మంచి లాబాలు పొందవచ్చు. అలాంటి బిజినెస్ ఐడియాల్లో ఒకటి.. జ్యూస్. నిజానికి దీనిని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ ఇందులో మంచి ఆదాయం ఉంటుంది. సమతుల్య ఆహారంలో ఇది చాలా ముఖ్యమైనది. జ్యూస్‌లు ఉత్తమమైన పానీయం, ఎందుకంటే వాటిలో అవసరమైన పోషకాలు కూడాఉంటాయి.
దినచర్యలో జ్యూస్‌ని జోడించడం ఆరోగ్యానికి, శ్రేయస్సుకు కూడా చాలా ముఖ్యం. భారతదేశంలో కోవిడ్ తర్వాత ఆరోగ్యంపై చాలా మంది దృష్టి పెడుతున్నారు.జ్యూస్ దుకాణాలు పండ్లు, కూరగాయల రసాలను మాత్రమే కాకుండా ప్రోటీన్ షేక్‌లను కూడా అందిస్తున్నాయి. ఈ వ్యాపారం వల్ల మంచి లాభం కూడా ఉంది. జ్యూస్ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మీకు ఉపయోపడేది.. ఫిట్‌నెస్ ఔత్సాహికులు. జ్యూస్ కార్నర్ ప్రారంభించొచ్చు. ప్రోటీన్ షేక్‌లను అమ్ముతూ కూడా మీరు మీ మార్కెట్‌ను మరింత విస్తరించవచ్చు.
జ్యూస్ కార్నర్‌ను ప్రారంభించడానికి సాధారణంగా అవసరమైన షాప్ పరికరాలను కొనుగోలు చేయడానికి 5 నుంచి 7 లక్షల రూపాయల పెట్టుబడి కావాలి. మార్కెట్‌లోని మధ్య తరహా దుకాణం, అవసరమైన పండ్లు, పరికరాలతో కూడిన జ్యూస్ వ్యాపారం మీకు పెద్దగా ఖర్చును పెంచదు. ఫుడ్ అథారిటీ నుండి అనుమతి పొందిన తర్వాత మీరు మీ దుకాణాన్ని ప్రారంభించవచ్చు.
జ్యూస్ కార్నర్‌ను ప్రారంభించడానికి మార్కెట్‌లో దుకాణాన్ని అద్దెకు తీసుకోవాలి. స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రూట్ మిక్సర్లు, ఫ్రూట్ బ్లెండింగ్ మిషన్లు, ఫ్రూట్ కటింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి అవసరమైన యంత్రాలు ఇందుకోసం కావాలి. అవసరమైన ముడి పదార్థాలు పండ్లు, కూరగాయలు, చక్కెర, సిరప్, పాలు, ఐస్ క్రీం, నీరు, ప్రోటీన్ కొనుగోలు చేయాలి. ఉద్యోగుల సంఖ్య మీ స్టోర్ పరిమాణం, వ్యాపార విస్తరణపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరు ముగ్గురు కలిసి కూడా ఈ వ్యాపారాన్ని పెట్టుకోవచ్చు.
అందరూ మీ కస్టమర్స్ అవ్వాలంటే వివిధ రకాల జ్యూస్‌లు అమ్మాలి. జిమ్‌కు వెళ్లేవారు, రన్నర్లు, ఫిట్‌నెస్ ఔత్సాహికులకు ప్రత్యేక ఆఫర్‌లను అందించడం వల్ల ఎక్కువ మంది కస్టమర్‌లను రప్పించుకోవచ్చు. ఫిట్‌నెస్ సెంటర్‌కు సమీపంలో షాప్ పెడితే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మీ వ్యాపారాన్ని పెంచుతుంది.
మీరు విక్రయించే ప్రతి గ్లాసు రసంపై 50-70 శాతం నికర లాభం ఆశించవచ్చు. ఒక రోజులో మొత్తం రూ.5000 రూపాయల జ్యూస్‌లు విక్రయిస్తే మీ నికర లాభం దాదాపు రూ.1500 నుంచి రూ.2000 ఉండవచ్చు.
టాపిక్