ఐక్యూ సంస్థ నుంచి ఒక కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు రెడీ అవుతోంది. దాని పేరూ ఐక్యూ జెడ్10 లైట్. ఇదొక 5జీ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ జూన్ 18న ఇండియాలో లాంచ్ అవుతుందని ఐక్యూ సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. లాంచ్ తర్వాత ఈ ఐక్యూ జెడ్10 లైట్.. ఇప్పటికే అందుబాటులో ఉన్న జెడ్10, జెడ్10ఎక్స్ మోడల్స్‌తో కూడిన జెడ్10 సిరీస్‌లో చేరుతుంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్‌కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Z10 లైట్ 5Gలో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని, ఇది దాని విభాగంలోనే అతిపెద్దదని ఐక్యూ ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించింది. అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ కోసం ఒక మైక్రోసైట్ కూడా లైవ్ అయింది. ఇది ప్లాట్‌ఫామ్‌లో స్మార్ట్‌ఫోన్ లభ్యతను ధృవీకరిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 10,000 లోపు ఉంటుందని ఐక్యూ సూచించింది (ఇంకా ధ్రువీకరించలేదు). ఇది ఎంట్రీ-లెవల్ విభాగంలో ఒక ఆకర్షణీయమైన 5జీ ఆఫరింగ్‌గా నిలుస్తుంది. ఇప్పటికే విపరీతమై పోటీ ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో ఈ ధర జెడ్10 లైట్‌కు ఎడ్జ్‌ని ఇవ్వగలదని అంచనాలు మొదలయ్యాయి! ముఖ్యంగా మంచి బ్యాటరీ లైఫ్, 5జీ కనెక్టివిటీ కోరుకునే బడ్జెట్ ఫ్రెండ్లీ వినియోగదారుల మధ్య ఇది ప్రసిద్ధి చెందే అవకాశం ఉంది.
డిజైన్ విషయానికొస్తే.. జెడ్10 లైట్ రేర్ ప్యానెల్ అప్పర్ లెఫ్ట్ ఎడ్జ్‌లో పిల్ షేప్ మాడ్యూల్‌లో నిలువుగా అమర్చిన డ్యూయల్ రేర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఫోన్ పై అంచున స్పీకర్ గ్రిల్, కుడి వైపున స్టాండర్డ్ వాల్యూమ్, పవర్ బటన్లు కూడా ఉన్నాయి.
ఐక్యూ జెడ్10 లైట్ అనేది జెడ్10, జెడ్10ఎక్స్ మోడళ్లకు ఒక టోన్-డౌన్ వేరియంట్ కావచ్చు. జెడ్10, జెడ్10ఎక్స్ మోడల్స్ వరుసగా మీడియాటెక్ డైమెన్సిటీ 7300, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్‌సెట్‌లతో పనిచేస్తాయి. ఆ మోడల్స్‌లో పెద్ద బ్యాటరీలు (జెడ్10లో 7,300ఎంఏహెచ్, Z10ఎక్స్‌లో 6,500ఎంఏహెచ్) ఉంటాయి. అలాగే 50ఎంపీ డ్యూయల్ రేర్ కెమెరాలు, 8ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ సెన్సార్లతో వస్తాయి.
జెడ్10 లైట్ పూర్తి స్పెసిఫికేషన్లపై ఇంకా క్లారిటీ లేదు. అయితే, అధికారిక ఆవిష్కరణకు ముందు మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
పెద్ద బ్యాటరీ సామర్థ్యం, రూ. 10,000 లోపు ధరతో ఈ ఐక్యూ Z10 లైట్ 5జీ భారతదేశంలో సరసమైన 5జీ స్మార్ట్‌ఫోన్ విభాగంలో గణనీయమైన ప్రభావాన్ని చూపడానికి సిద్ధంగా ఉంది!
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.
సంబంధిత కథనం