Budget Electric Cars : బడ్జెట్ ధరలోని ఎలక్ట్రిక్ కార్లు.. ప్రారంభ ధర రూ.4.99 లక్షలు, అదిరే ఫీచర్లు!
Budget Electric Cars : ఇటీవల ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈవీలను చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా ప్లాన్ చేస్తే మీ కోసం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బడ్జెట్ ధరలో వచ్చే ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇక్కడ ఓ లుక్కేయండి.
భారతదేశంలో ఆటోమెుబైల్ పరిశ్రమ రోజురోజుకు కొత్త ఆవిష్కరణలతో ముందుకెళ్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. దీంతో మిడిల్ క్లాస్ ప్రజలు ఏ ఎలక్ట్రిక్ కారు కొనాలా అని ఆలోచనలు చేస్తు్న్నారు. దీనికి తగ్గట్టుగా కంపెనీలు కూడా అదిరిపోయే ఫీచర్లతో కార్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఈ సెగ్మెంట్‌లో టాప్ పొజిషన్ కోసం పోటీ పడుతున్నాయి.
భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత డిమాండ్ పెరగనుంది. అన్ని బ్రాండ్‌లు ప్రస్తుతం కొత్త ఈవీలను ప్రవేశపెడుతున్నాయి. జనాలు కూడా ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మీరు కూడా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకుంటే.. మీ కోసం కొన్ని బడ్జెట్ ఈవీలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి..
టాటా టియాగో ఈవీ
టియాగో ఈవీ అనేది టాటా మోటార్స్ అందించే చౌకైన ఎలక్ట్రిక్ కారు. ఇంటీరియర్‌లో హై-ఎండ్ హర్మాన్ సౌండ్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7 స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. దీని ప్రారంభ ధర రూ.7.99 లక్షలుగా ఉంది. నాలుగు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. టాటా టియాగో ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ కలిగి ఉంది. 19.2 kW, 24 kWతో వస్తుంది. చిన్న బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 250 కి.మీ, పెద్ద బ్యాటరీ ప్యాక్ 315 కి.మీల రేంజ్ అందిస్తుంది.
సిట్రోయెన్ ఈసీ3
సిట్రోయెన్ ఈసీ3 బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు. ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. 10.2-అంగుళాల టచ్‌స్క్రీన్‌తో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.11.61 లక్షలు. సిట్రోయెన్ ఈసీ3 ఎలక్ట్రిక్ కారు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 320 కి.మీల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. ఇది 29.2 కిలోవాట్ బ్యాటరీతో పనిచేస్తుంది. దాని ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం కారణంగా కారు బ్యాటరీని కేవలం 57 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.
ఎంజీ కామెట్ ఈవీ
దేశీయ మార్కెట్లో ఎంజీ కామెట్ ఈవీ BAAS (బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్) కింద రూ.4.99 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో ప్రారంభమవుతుంది. కిలోమీటరుకు రూ. 2.5 చొప్పున బ్యాటరీ అద్దె ఉంటుంది. కామెట్ ఈవీ దాని చిన్న పరిమాణం కారణంగా సిటీ డ్రైవింగ్‌కు అనువైనది. 17.3 కిలోవాట్ బ్యాటరీతో ఈ కారు 230 కి.మీ రేంజ్ అందిస్తుంది.
టాటా పంచ్ ఈవీ
టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు స్మార్ట్, స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ ప్లస్ అనే ఐదు వేరియంట్‌లలో దొరుకుతుంది. పంచ్ ఈవీ ఇప్పుడు ఎక్స్ షోరూమ్ ధర రూ.9.99 లక్షలుగా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 265 కి.మీపైన రేంజ్ అందిస్తుంది. ఇందులో 25, 35 కిలోవాట్ల రెండు బ్యాటరీలు ఉన్నాయి.
టాపిక్