Budget 2025 : బడ్జెట్​ వేళ ట్రేడింగ్​- ఎలా లాభాలు సంపాదించాలి? నితిన్​ కామత్​ టిప్స్​..-budget day trading expect volatility trade with caution nithin kamath ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget 2025 : బడ్జెట్​ వేళ ట్రేడింగ్​- ఎలా లాభాలు సంపాదించాలి? నితిన్​ కామత్​ టిప్స్​..

Budget 2025 : బడ్జెట్​ వేళ ట్రేడింగ్​- ఎలా లాభాలు సంపాదించాలి? నితిన్​ కామత్​ టిప్స్​..

Sharath Chitturi HT Telugu
Jan 31, 2025 11:15 AM IST

Budget Day Trading : శనివారమే అయినప్పటికీ, బడ్జెట్​ 2025 నేపథ్యంలో స్టాక్​ మార్కెట్​లు ఫిబ్రవరి 1న ఓపెన్​లో ఉంటాయి. మరి మీరు ట్రేడ్​ చేయాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే జెరోధా సీఈఓ నితిన్​ కామత్​ టిప్స్​ తెలుసుకోండి..

బడ్జెట్​ వేళ ట్రేడింగ్? నితిన్​ కామత్​ టిప్స్​..
బడ్జెట్​ వేళ ట్రేడింగ్? నితిన్​ కామత్​ టిప్స్​.. (Image: Pixabay)

కేంద్ర బడ్జెట్​ 2025 కోసం యావత్​ భారత దేశం ఎదురుచూస్తోంది. ఫిబ్రవరి 1, శనివారం ఉదయం పార్లమెంట్​లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. బడ్జెట్​ని ప్రవేశపెట్టనున్నారు. శనివారమే అయినప్పటికీ, బడ్జెట్​ నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఓపెన్​లోనే ఉంటాయి. చాలా మంది ట్రేడర్లు బడ్జెట్​ సమయంలో ట్రేడ్స్​ని కూడా ప్లాన్​ చేస్తుంటారు. వీరిలో మీరూ ఉన్నారా? అయితే.. జెరోధా సీఈఓ నితిన్​ కామత్​ చెప్పిన కొన్ని విలువైన టిప్స్​ మీకు ఉపయోగపడతాయి. అవేంటంటే..

yearly horoscope entry point

బడ్జెట్​ 2025 వేళ స్టాక్​ మార్కెట్​ ట్రేడింగ్​ ఇలా..

స్టాక్​ మార్కెట్​ అంటేనే ఒడిదొడుకులు సహజం. బడ్జెట్​ సమయంలో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు నితిన్ కామత్ కొన్ని టిప్స్​ చెబుతూ ట్వీట్​ చేశారు. బడ్జెట్ ప్రకటన వంటి అధిక ప్రభావం ఉన్న రోజుల్లో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

“మార్కెట్లు అస్థిరంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ట్రేడింగ్ చేయండి. మీరు చురుకైన ట్రేడర్ అయితే, ఈవెంట్ రోజుల్లో మీరు ట్రేడింగ్ సైజ్​ని తగ్గించాలని నేను చెబుతాను (ట్రేడింగ్​ను ఆపలేకపోతే),” అని నితిన్​ కామత్ ఎక్స్​లో పోస్ట్ చేశారు.

అనూహ్యమైన మార్కెట్ కదలికలతో లాభాలు, నష్టాలు ఒకే విధంగా ఉంటాయని జెరోధా సీఈఓ ఇచ్చిన సలహా గుర్తుచేస్తుంది.

చారిత్రాత్మకంగా, బడ్జెట్ డే నాడు సెన్సెక్స్, నిఫ్టీ వంటి బెంచ్​మార్క్​ సూచీల్లో తీవ్ర ఊగిసలాట కనిపిస్తుంది. పన్నులు, ఆర్థిక విధానాలు, రంగాల వారీగా కేటాయింపుల ప్రకటనలపై ట్రేడర్లు, ఇన్వెస్టర్లు వేగంగా స్పందిస్తుంటారు. క్షణాల్లో బై- సెల్​ చేస్తుంటారు.

బడ్జెట్ డే అస్థిరతకు ట్రేడర్లు ఎలా సిద్ధం అవ్వాలి?

ట్రేడింగ్​ సైజ్​ని తగ్గించవచ్చు - బడ్జెట్ ప్రకటనలు తరచుగా పదునైన మార్కెట్ కదలికలకు దారితీస్తాయి. పొజీషన్​ని చిన్నగా ఉంచడం సంభావ్య నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

లేవరేజ్​ని ఎక్కువగా వాడుకోకండి - అనూహ్యత దృష్ట్యా, అధిక లెవరేజ్​ని ఉపయోగించడం ప్రమాదకరం.

లాంగ్​ టర్మ్​ ట్రెండ్​ మీద ఫోకస్​ చేయండి- ఇంట్రాడే అస్థిరత ఎక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక పెట్టుబడిదారులు.. బడ్జెట్ తర్వాత ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టాలి.

స్టాప్ లాస్​ సెట్ చేయండి - మూలధనాన్ని రక్షించడానికి, కచ్చితమైన స్టాప్-లాస్ వ్యూహాన్ని మెయిన్​టైన్​ చేయండి.

కీలక రంగాలను పర్యవేక్షించండి - బడ్జెట్లు సాధారణంగా మౌలిక సదుపాయాలు, బ్యాంకింగ్, తయారీ వంటి కొన్ని రంగాలను ఇతరవాటి కన్నా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఈ రంగాలను నిశితంగా పరిశీలించడం వల్ల వ్యాపారులు సంభావ్య అవకాశాలను గుర్తించడంలో సహాయపడుతుంది.

నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ ప్రసంగంలో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అలర్ట్​గా ఉండాలి. సరైన నిర్ణయాలు తీసుకుని ఎంట్రీ, ఎగ్జిట్​ ప్లాన్​ చేయాలి. ఇది కష్టంగా అనిపిస్తే, బడ్జెట్​ రోజున ట్రేడింగ్​, ఇన్వెస్ట్​మెంట్​కి దూరంగా ఉండటం మంచిది.

(గమనిక:- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు.)

Whats_app_banner

సంబంధిత కథనం