Budget 2025 : నిర్మలమ్మ బడ్జెట్ తర్వాత ఈ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంటుందా?
Budget 2025 : బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం దగ్గర పడింది. దీంతో సామాన్యులు ఏ వస్తువులపై ధరలు తగ్గుతాయోననే అంచనాలు వేస్తున్నారు. నిర్మలమ్మ బడ్జెట్ తర్వాత ఎలాంటి వస్తువుల ధరలు తగ్గే అవకాసం ఉంది?
బడ్జెట్ మీద సామాన్య ప్రజల్లో చాలా అంచనాలు ఉన్నాయి. బడ్జెట్‌లోని ప్రకటనలు అందరినీ ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. నిత్యావసర వస్తువుల ధరల నుండి ఆదాయపు పన్ను వరకు ప్రతిదీ బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతారు.
నిత్యావసరాల నుండి ఆటోమొబైల్స్, గాడ్జెట్ల వరకు ప్రతిదాని ధర బడ్జెట్ మీద ఆధారపడి నడుస్తుంది. ముఖ్యంగా పన్ను సంబంధిత విషయాలలో అనేక మార్పులు ధరల హెచ్చుతగ్గులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపెడతాయి. ఈ సంవత్సరం సామాన్య ప్రజలు రోజువారీ వస్తువులు, ఎలక్ట్రానిక్స్ పై అధిక అంచనాలను కలిగి ఉన్నారు. ముఖ్యంగా డిజిటల్ ఉత్పత్తుల ధర తగ్గే అవకాశంపై అధిక అంచనాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం డిజిటల్ ఇండియాపై దృష్టి పెట్టడం వల్ల సామాన్యులు మరింత డిజిటల్ ఉత్పత్తులను ఉపయోగించుకునేలా ప్రోత్సహించారు. అందువల్ల ఈ సంవత్సరం బడ్జెట్‌లో డిజిటల్ ఉత్పత్తుల ధరలను తగ్గించే అవకాశం ఉండవచ్చు.
రోజువారీ అవసరాల నుండి ఆటోమొబైల్స్, గాడ్జెట్ల వరకు, బడ్జెట్‌లోని అన్ని వస్తువుల ధర బడ్జెట్‌పై ఆధారపడి ఉంటుంది. అనేక మార్పులు, ప్రత్యేకించి పన్నులు, ద్రవ్యోల్బణంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ఈ ఏడాది సాధారణ ప్రజలు రోజువారీ వినియోగ వస్తువులు, ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. డిజిటల్ ఉత్పత్తుల ధర తగ్గింపుపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ మొదలైన వాటి ధరలు తగ్గితే, వీటి విక్రయాలు కూడా మార్కెట్‌లో పెరుగుతాయి. తద్వారా డిజిటల్ ఇండియాను మరింత విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి బడ్జెట్‌లో ఇలాంటి వస్తువుల ధర తగ్గుతుందా లేదా అన్నది వేచి చూడాలి.
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌లో ప్రకటించినట్టైతే.. అన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఈకారణంగా మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు తక్కువ ధరకే దొరుకుతాయి.
ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం అవుతాయి. రాష్ట్రపతి ప్రసంగంపై లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చలు జరగుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త పార్లమెంట్ హౌస్‌లోని లోక్‌సభ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
మరోవైపు భారతీయ రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేయడానికి వ్యూహాత్మక సూచనలను అందించడం అవసరమని స్ట్రాటేజిక్ గ్రోత్, సత్వ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ శివం అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ అమలులోకి రావడంతో అనుమతి ప్రక్రియలు వేగవంతమయ్యాయని చెప్పారు. డెవలపర్ల లిక్విడిటీని మెరుగుపరిచేందుకు దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎఫ్డీఐ నిబంధనలను సమీక్షించాలని కోరారు.
'డెవలపర్ల ఆర్థిక భారం తగ్గించేందుకు అనుకూలమైన ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ విధానాన్ని ఏర్పాటు చేయాలి. వాణిజ్య రియల్ ఎస్టేట్ వృద్ధిని ప్రోత్సహించేందుకు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై జీఎస్టీ తగ్గించాలి. పట్టణ ప్రాంత సమస్యలను పరిష్కరించేందుకు అద్దె గృహాల లభ్యతను మెరుగుపరచాలి. టైర్-2 నగరాల్లో కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి.' అని శివం అగర్వాల్ చెప్పారు.