Budget stocks to buy : ఇవాళే బడ్జెట్​ 2025- ఈ స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్​..!-budget 2025 stocks to buy today 1 feb sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget Stocks To Buy : ఇవాళే బడ్జెట్​ 2025- ఈ స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్​..!

Budget stocks to buy : ఇవాళే బడ్జెట్​ 2025- ఈ స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్​..!

Sharath Chitturi HT Telugu
Feb 01, 2025 08:16 AM IST

Stocks to buy today : బడ్జెట్​ 2025 నేపథ్యంలో ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

స్టాక్​ మార్కెట్​లకు శనివారం సాధారణంగా సెలవు ఉంటుంది. కానీ బడ్జెట్​ 2025 నేపథ్యంలో దేశీయ సూచీలు నేడు ఓపెన్​లో ఉంటాయి. సాధారణ టైమింగ్స్​లానే పనిచేస్తాయి. ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 741 పాయింట్లు పెరిగి 77,501 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 259 పాయింట్లు వృద్ధిచెంది 23,508 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 275 పాయింట్లు పెరిగి 49,587 వద్దకు చేరింది.

yearly horoscope entry point

“నిఫ్టీ ట్రెండ్​ బలంగా ఉంది. 23500 స్థాయిల రెసిస్టెన్స్​ని అధిగమించిన బుల్స్​ తక్కువ సమయంలోనే 23800 స్థాయిల రెసిస్టెన్స్​ దిశగా దూసుకెళుతున్నాయి. ఇన్​స్టెంట్​ సపోర్ట్​ 23400 స్థాయిలో ఉంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి అన్నారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

దేశీయ స్టాక్​ మార్కెట్​లో ఎఫ్​ఐఐలు సెల్లింగ్​ కొనసాగుతోంది. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,188.99 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2232.22 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

జనవరి​​ నెల మొత్తం మీద ఎఫ్​ఐఐలు రూ. 87,374.66 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 86,591.8 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శనివారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.7 శాతం పడింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.5 శాతం పతనమైంది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.28 శాతం పడింది.

స్టాక్స్​ టు బై టుడే..

మారుతీ సుజుకీ- బై రూ. 12310.65, స్టాప్​ లాస్​ రూ. 11880, టార్గెట్​ రూ. 13172

కరూర్​ వైస్య బ్యాంక్​- బై రూ. 238.22, స్టాప్​ లాస్​ రూ. 230, టార్గెట్​ రూ. 256

ఎస్​బీఐ- బై రూ. 772, స్టాప్​ లాస్​ రూ. 750, టార్గెట్​ రూ. 800

ట్రెంట్​- బై రూ. 5753, స్టాప్​ లాస్​ రూ. 5500, టార్గెట్​ రూ. 6100

టాటా కెమికల్స్​- బై రూ. 987, స్టాప్​ లాస్​ రూ. 960, టార్గెట్​ రూ. 1020

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం