Budget 2025 : లోక్‌సభ ముందుకు బడ్జెట్- 10 రంగాలపై ఫోకస్..
Nirmala Sitharaman : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. లోక్‌సభలో బడ్జెట్ 2025ని ప్రవేశపెట్టారు. వరుసగా 8వసారి బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా చరిత్ర సృష్టించారు.
భారీ ఆశలు, అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ 2025ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలోనే వరుసగా 8వసారి బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు.

అయితే లోక్‌సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు నిరసనలు చేపట్టాయి. తమ మాట వినాలంటూ, తమకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాంటూ నినాదాలు చేశారు. భారీ నినాదాల మధ్యే నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు.
బడ్జెట్ 2025కి సంబంధించిన లైవ్ అప్డేట్స్ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఫోకస్ వీటిపైనే..
బడ్జెట్లో భాగంగా గురుజాడ అప్పారావు అన్న “దేశమంటే మట్టికాదోయి, దేశం అంటే మనుషులోయి,” అన్న మాటలను నిర్మలా సీతారామన్ చెప్పారు.
2025-26 కేంద్ర బడ్జెట్లో పన్నులు, పట్టణాభివృద్ధి, మైనింగ్, ఆర్థిక రంగం, విద్యుత్, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ వంటి ఆరు రంగాల్లో సంస్కరణలకు శ్రీకారం చుడతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గత పదేళ్ల ప్రభుత్వ అభివృద్ధి ట్రాక్ రికార్డు, నిర్మాణాత్మక సంస్కరణలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయని చెప్పారు.
వికసిత్ భారత్‌లో పేదరికం నిర్మూలన, నాణ్యమైన విద్య, అధిక నాణ్యత, సరసమైన, సమగ్ర ఆరోగ్య సంరక్షణ ఉంటుందని, అందరినీ సమ్మిళిత వృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే బడ్జెట్ లక్ష్యమని ఆమె అన్నారు.
బడ్జెట్ 2025 : నిర్మల రికార్డు..!
కాగా.. అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు మాత్రం మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరు మీదే ఉంది. ఆయన 10సార్లు బడ్జెట్ ప్రసంగం చేశారు. దేశాయ్ 1959-1964 మధ్య ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో మొత్తం 6 బడ్జెట్లు, 1967-1969 మధ్య 4 బడ్జెట్లను ప్రవేశపెట్టారు.
మాజీ ఆర్థిక మంత్రులు చిదంబరం తొమ్మిది బడ్జెట్లను, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఎనిమిది బడ్జెట్లను ప్రవేశపెట్టారు. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 2019లో ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టిన నిర్మల మాత్రం.. వరుసగా ఎనిమిదిసార్లు బడ్జెట్‌ని ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు.
రాష్ట్రపతితో నిర్మల..
అంతకుముందు.. నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్‌కి వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. బడ్జెట్‌కి ముర్ము ఆమోదం తెలిపారు. అనంతరం నిర్మలకు శుభాకాంక్షలు చెబుతూ చెక్కరతో కూడిన పెరుగును తినిపించారు.
అక్కడి నుంచి పార్లమెంట్‌కు చేరుకున్న నిర్మల.. కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. 2025- 26 బడ్జెట్‌ని కేబినెట్ ఆమోదించింది. అనంతరం లోక్‌సభలో తన 8వ బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్.
సంబంధిత కథనం