Budget 2025 memes: బడ్జెట్ 2025 పై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న మీమ్స్; ఆ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్
Budget 2025 memes: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ శనివారం, ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడ్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు వెల్లువెత్తుతున్నాయి. వాటిని ఒకసారి చూడండి...
Budget 2025 memes: నరేంద్ర మోడీ ప్రభుత్వం రేపు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఇది మోదీ 3.0 లో మొదటి పూర్తి బడ్జెట్. మధ్యతరగతి పన్ను ఉపశమనం కోసం, వ్యాపార వర్గాలు సరళీకృత జీఎస్టీ వ్యవస్థను ఆశిస్తుండటంతో ఈ బడ్జెట్ 2025 పై అంచనాలు భారీగా ఉన్నాయి. దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాలను ఆశీర్వదించాలని హిందూ సంపద దేవత లక్ష్మీదేవిని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రార్థించారు. ప్రధాని వ్యాఖ్యలతో పేద, మధ్యతరగతి వర్గాల్లో బడ్జెట్ పై అంచనాలు మరింత పెరిగాయి. తమకు అనుకూలంగా ఈ బడ్జెట్ లో నిర్ణయాలు ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో పలువురు తమ క్రియేటివిటీని చూపుతూ పలు అద్భుతమైన మీమ్స్ ను రూపొందించారు. అవేంటో ఇక్కడ చూడండి.

బడ్జెట్ 2025 పై మీమ్స్
రేపు బడ్జెట్ 2025
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ వ్యక్తిగత ఆదాయ పన్నులను తగ్గిస్తారని, గ్రామీణ ప్రాంతాలకు సంక్షేమాన్ని పెంచుతారని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా గురువారం ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. 2024-25 ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.