Budget 2025 Highlights : మిడిల్ క్లాస్ నుంచి రైతుల వరకు బడ్జెట్‌లో ఏం దక్కింది? 10 భారీ ప్రకటనలు
Budget 2025 Highlights : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైతుల నుంచి పన్ను చెల్లింపుదారుల వరకు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు నిర్మలా సీతారామన్ భారీ ఊరట కల్పించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైతుల నుంచి పన్ను చెల్లింపుదారుల వరకు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటనలు ఉన్నాయి. ఇక పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట కల్పించారనే చెప్పాలి. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అదే సమయంలో రైతుల కోసం కొత్త పథకాన్ని అనౌన్స్ చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలోని టాప్ 10 హైలైట్స్ చూద్దాం..

1. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఉపశమనం కలిగించారు. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది మధ్యతరగతివారికి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
2. కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) పరిమితిని రూ .3 లక్షల నుండి రూ .5 లక్షలకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.
3. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 'ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన'ను ప్రకటించారు. తక్కువ దిగుబడులు, ఆధునిక పంటల సమస్యలు, సగటు కంటే తక్కువ రుణ నిబంధనలు ఉన్న 100 జిల్లాలను ఈ స్కీమ్ కవర్ చేస్తుంది. ఈ పథకం ద్వారా 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది.
4. 'ఫస్ట్ ట్రస్ట్, చెక్ లేటర్' అనే కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్లే కొత్త ఆదాయపు పన్ను బిల్లును వచ్చే వారం ప్రభుత్వం ప్రవేశపెడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్ డీఐ) 74 శాతం నుంచి 100 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
5. వచ్చే మూడేళ్లలో అన్ని జిల్లా ఆస్పత్రుల్లో 'డే కేర్' క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని, ఈ ఆర్థిక సంవత్సరంలో 200 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
6. పీఎం జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) కింద గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా కల్పిస్తామని 2025-26 కేంద్ర బడ్జెట్‌లో వెల్లడించారు. అంతేకాదు వారికి ఐడీ కార్డులు కూడా ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇ శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి.
7. వచ్చే ఐదేళ్లలో 75,000 మెడికల్ సీట్లను పెంచుతున్నట్టుగా ప్రకటించారు. గత పదేళ్లలో 1.01 లక్షల మెడికల్ సీట్లు పెంచినట్టుగా నిర్మలా సీతారామన్ తెలిపారు.
9. ప్రపంచవ్యాప్తంగా టాయ్ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దుతామని కేంద్రమంత్రి ప్రకటించారు. వచ్చే ఐదేళ్లకు టర్మ్ లోన్‌ల కోసం 5 లక్షల మంది మహిళలతోపాటు, మెుదటిసారి వ్యాపారం చేయాలనుకునేవారి కోసం కొత్త పథకం ప్రారంభించనున్నట్టుగా ప్రకటించారు.
10. మరోవైపు బీహార్ ప్రజల ఆదాయాన్ని పెంచడానికి మఖానా బోర్డు ఏర్పాటు మీద ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి.
కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనలు మిడిల్ క్లాస్ నుంచి రైతులకు వరకు పలు ప్రయోజనాలు చేకూర్చనున్నాయి. పైన చెప్పినవాటితోపాటుగా మరికొన్ని కీలక ప్రకటనలు చేశారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.