Budget 2025: కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించడానికి బడ్జెట్ 2025 లో ఈ మార్పులు రానున్నాయా?-budget 2025 experts expect these changes in budget 2025 to encourage taxpayers to adopt new tax regime ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget 2025: కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించడానికి బడ్జెట్ 2025 లో ఈ మార్పులు రానున్నాయా?

Budget 2025: కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించడానికి బడ్జెట్ 2025 లో ఈ మార్పులు రానున్నాయా?

Sudarshan V HT Telugu
Jan 23, 2025 05:19 PM IST

Budget 2025: 2023 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం రెండు విధాలైన పన్ను విధానాలను తీసుకువచ్చింది. అప్పటికే అమల్లో ఉన్నపాత పన్ను విధానంతో పాటు కొత్త పన్ను విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలనే విషయాన్ని పన్ను చెల్లింపుదారులే నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించింది.

కొత్త పన్ను విధానం
కొత్త పన్ను విధానం

Budget 2025: ప్రస్తుతం భారతదేశంలో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కోసం రెండు పన్ను విధానాలు ఉన్నాయి. అవి పాత పన్ను విధానం. కొత్త పన్ను విధానం. కొత్త పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానం. పాత విధానం పన్ను చెల్లింపుదారులకు వివిధ మినహాయింపులు, తగ్గింపులను క్లెయిమ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపులు లేదా తగ్గింపుల్లో చాలా వాటిపై పరిమితులు ఉన్నాయి.

yearly horoscope entry point

రెండు పన్ను విధానాల వివరాలు

కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను రిటర్న్ లను దాఖలు చేయడాన్ని చాలా సులభతరం చేసింది. దాంతో, చాలా మంది పన్ను చెల్లింపుదారులు స్వయంగా తమ రిటర్న్ (itr) లను దాఖలు చేసుకుంటున్నారు. అయితే, అందువల్ల కొన్నిసార్లు, వారు తమకు అత్యంత అనుకూలమైన పన్ను విధానాన్ని ఎంచుకోవడంలో ఇబ్బంది పడుతారు. పన్ను చెల్లింపుదారులకు ప్రతీ సంవత్సరం తమ పన్నువిధానాన్ని మార్చుకునే వీలు ఉంటుంది. అయితే, 115BAC సెక్షన్ కింద కొత్త పన్ను విధానం నుండి వైదొలగే అవకాశాన్ని వినియోగించుకున్న వ్యాపారం లేదా వృత్తి నుండి ఆదాయం పొందే వ్యక్తి చెప్పిన కొత్త పన్ను విధానాన్ని తిరిగి ఎంచుకునే అవకాశాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చని గమనించడం సముచితం.

సరళీకృతం చేయడం లక్ష్యం

అయితే, కొత్త పన్ను విధానం ఇప్పటికీ పన్ను చెల్లింపుదారులలో విస్తృత ఆమోదాన్ని పొందలేదు. తగ్గింపులు, మినహాయింపులను క్లెయిమ్ చేయడంపై విధించిన పరిమితులే అందుకు ప్రధాన కారణం. కొత్త పన్ను విధానం చాలా సరళీకృతంగా ఉన్నప్పటికీ క్లెయిమ్ లపై పరిమితుల కారణంగా చాలా మంది పాత పన్ను విధానాన్నే కొనసాగిస్తున్నారు.

పన్ను స్లాబ్ లలో మార్పులు

కొత్త పన్ను విధానానికి మారేలా పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించడానికి రానున్న బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టవచ్చని తెలుస్తోంది. 25 లక్షల నుండి 30 లక్షల మధ్య ఆదాయానికి 25% పన్ను రేటును ప్రవేశపెట్టనున్నారని, 30 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి 30% పన్నును కొనసాగిస్తారని తెలుస్తోంది. ఇది అధిక ఆదాయాలకు పన్ను రేట్లలో మరింత క్రమ పురోగతిని ఏర్పరుస్తుంది. తద్వారా మొత్తం పన్ను (income tax) భారాన్ని తగ్గిస్తుంది.

ఈ మినహాయింపులు ఉన్నాయి..

ప్రామాణిక తగ్గింపు: రూ. 75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్. పాత పన్ను విధానంలో ఇది రూ. 50,000 వరకు మాత్రమే ఉంది. కుటుంబ పెన్షన్ పరిమితిని కూడా రూ. 25 వేలకి పెంచారు. పాత పన్ను విధానంలో ఇది రూ. 15,000 మాత్రమే. అలాగే, ఐటీ చట్టంలోని 80CCH(2) కింద అగ్నివీర్ కార్పస్ ఫండ్‌లో చెల్లించిన లేదా జమ చేసిన మొత్తానికి సంబంధించి మినహాయింపు లభిస్తుంది. ఉద్యోగుల ప్రయోజనం కోసం NPSకి యజమాని ఇచ్చిన వాటాపై కూడా సెక్షన్ 80CCD(2) కింద మినహాయింపు లభిస్తుంది.

ఇలా పన్ను స్లాబ్‌ లు ఉండాలి..

  • రూ. 5,00,000 వరకు - పన్ను ఉండదు.
  • రూ. 5,00,001 నుండి రూ. 10,00,000 వరకు 5% పన్ను
  • రూ. 10,00,001 నుండి రూ. 15,00,000 వరకు 10% పన్ను.
  • రూ. 15,00,001 నుండి రూ. 20,00,000 వరకు 15% పన్ను
  • రూ. 20,00,001 నుండి రూ. 25,00,000 వరకు 20% పన్ను
  • రూ. 25,00,001 నుండి రూ. 30,00,000 వరకు 25% పన్ను
  • రూ. 30,00,000 కంటే ఎక్కువ ఆదాయంపై 30% పన్ను

ఈ మినహాయంపులు కూడా ఇవ్వాలి..

కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించడానికిి ఈ కింద పేర్కొన్న మినహాయింపులు కూడా ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి

  • సెక్షన్ 80C కింద జీవిత బీమా (insurance) ప్రీమియంలు, జాతీయ పొదుపు సర్టిఫికెట్లలో పెట్టుబడులు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ల వంటి సామాజిక భద్రతా చెల్లింపులకు తగ్గింపులను అనుమతించాలి. ఇందువల్ల సావరిన్-బ్యాక్డ్ సాధనాలలో పెట్టుబడులు పెరుగుతాయి.
  • సెక్షన్ 80D కింద వైద్య బీమా (health insurance) ప్రీమియంలకు మినహాయింపు ఇవ్వాలి. కొత్త పన్ను పాలనలో ఈ తగ్గింపును అనుమతించడం వలన పన్ను చెల్లింపుదారులలో ఆరోగ్య సంబంధిత ఆందోళనలు తొలగిపోతాయి.
  • సెక్షన్ 80EEB కింద ఎలక్ట్రిక్ వాహనాల (electric vehicles) కోసం తీసుకున్న రుణాలపై వడ్డీని రూ.1,50,000 వరకు మినహాయించడం ద్వారా ఈవీల వినియోగానికి ప్రజలను ప్రోత్సహించవచ్చు.

Whats_app_banner