Nirmala Budget Speech : నిర్మలా సీతారామన్ బడ్జెట్ 'ప్రసంగం'- సొంత రికార్డును బ్రేక్ చేస్తారా?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు బడ్జెట్‌ని ప్రవేశపెట్టనున్నారు. ఆమె బడ్జెట్ ప్రసంగం ఎంత సేపు ఉంటుంది? అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. బడ్జెట్‌పై సుదీర్ఘ సమయం ప్రసగించే ఆమె, తన సొంత రికార్డును బ్రేక్ చేస్తారా?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఏడొవ బడ్జెట్‌ని నేడు, మంగళవారం ప్రవేశపెట్టనున్నారు. చివరిగా 2024 ఫిబ్రవరి 1న మధ్యంత బడ్జెట్లో ప్రసగించారు నిర్మల. కాగా నిర్మల బడ్జెట్ ప్రసంగంపైనా సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. ఇందుకు కారణం.. సుదీర్ఘ ప్రసంగాలు చేయడం ఆమెకు అలవాటు! మరి ఈసారి ఎంత సేపు మాట్లాడతారు?
సొంత రికార్డును నిర్మల బ్రేక్ చేస్తారా?
ఆర్థిక మంత్రిగా 2024 ఫిబ్రవరిలో చేసిన మధ్యంతర బడ్జెట్ ప్రసంగం నిర్మలా సీతారామన్ కెరీర్లో అతి తక్కువ స్పీచ్! ఇది సుమారు 60 నిమిషాలకే ముగిసింది.
కానీ భారతదేశ చరిత్రలో సుదీర్ఘ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు నిర్మల పేరిట ఉంది. 2020లో నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టి 2:42 గంటలు మాట్లాడారు.
ఈ రోజు మరో ప్రసంగం జరగనుండగా, భారతదేశ చరిత్రలోనే అతి పొడవైన, అతి తక్కువ బడ్జెట్ ప్రసంగాలను పరిశీలిద్దాం.
ఇదీ చూడండి:- Budget 2024 Live Updates : నేడే మోదీ 3.0 తొలి బడ్జెట్.. నిర్మల ‘పద్దు’పై భారీ ఆశలు, అంచనాలు
బడ్జెట్ 2024 - సుదీర్ఘ ప్రసంగాలు..
నిర్మలా సీతారామన్..
భారతదేశ ఆర్థిక చరిత్రలో 2019 సంవత్సరం ఐకానిక్‌గా నిలిచింది. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ ఇది. దశాబ్దానికి 10 సూత్రాల విజన్, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ప్రయోజనాలు ప్రధానాంశాలు. ఆ ఏడాది నిర్మలా సీతారామన్ ప్రసంగం రెండు గంటల 17 నిమిషాల పాటు సాగింది.
జశ్వంత్ సింగ్ 2003 బడ్జెట్ ప్రసంగం రెండు గంటల 13 నిమిషాలకు ముగిసింది. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నుల ఈ-ఫైలింగ్, కొన్ని వస్తువులపై ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీ తగ్గింపులను సింగ్ తన ప్రసంగంలో ప్రతిపాదించారు.
2014లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పన్ను మినహాయింపును ప్రకటించి, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49 శాతానికి పెంచారు. మొత్తం 2 గంటల 10 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో కీలకాంశాలు, ఇతర మార్పులను జైట్లీ వెల్లడించారు.
బడ్జెట్ 2024: పదాల్లో సుదీర్ఘ ప్రసంగాలు
బడ్జెట్లోని పదాలను ట్రాక్ చేస్తే, మాజీ ప్రధాని- మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ 18,700 పదాల సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేశారు. 1991లో ఆయన ఈ బడ్జెట్ ప్రసంగం చేశారు. 18,604 పదాలతో జైట్లీ రెండో స్థానంలో నిలిచారు.
బడ్జెట్ 2024: అతి చిన్న ప్రసంగం
1977 లో హీరుభాయ్ ఎం పటేల్ మధ్యంతర బడ్జెట్ ప్రసంగం - 800 పదాలు. 1977లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన బడ్జెట్ ప్రసంగంలో 800 పదాలే ఉన్నాయి.
సంబంధిత కథనం