BSNL launches BiTV: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్; ఇక ఫ్రీగా ఓటీటీ కంటెంట్ చూసేయొచ్చు..-bsnl launches bitv for mobile users in partnership with ottplay ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bsnl Launches Bitv: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్; ఇక ఫ్రీగా ఓటీటీ కంటెంట్ చూసేయొచ్చు..

BSNL launches BiTV: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్; ఇక ఫ్రీగా ఓటీటీ కంటెంట్ చూసేయొచ్చు..

Sudarshan V HT Telugu
Jan 30, 2025 06:48 PM IST

BSNL BiTV: టెలీకాం రంగంలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాల నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మార్కెట్ వాటా ను పెంచుకునే దిశగా పలు వినూత్న ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా తమ వినియోగదారుల కోసం ఇంటర్నెట్ టీవీ ‘బీఐటీవీ’ ని ప్రారంభించింది.

బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్

BSNL BiTV: గట్టి పోటీ నెలకొన్న భారత టెలీకాం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. యూజర్లను ఆకర్షించే మరో చర్య చేపట్టింది. బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఉచితంగా చానెళ్లను, ఓటీటీ కంటెంట్ ను వీక్షించే వీలు కల్పించే ఇంటర్నెట్ టీవీ సేవను ప్రారంభించింది. ఇది భారతదేశం అంతటా తన మొబైల్ చందాదారులకు 450 కి పైగా లైవ్ టెలివిజన్ ఛానళ్లకు ఉచితంగా చూసే వీలు కల్పిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ ఇంటర్టైన్మెంట్ టీవీ

బిఎస్ఎన్ఎల్ ఇంటర్టైన్మెంట్ (BSNL Intertainment BiTV) అనే పేరుతో ఈ ఇంటర్నెట్ టీవీ సేవలను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. దీనిని మొదట పైలట్ ప్రాజెక్టుగా పాండిచ్చేరిలో ప్రారంభించారు. తరువాత దేశవ్యాప్తంగా విస్తరిస్తారు. స్ట్రీమింగ్ అగ్రిగేటర్ ఓటీటీప్లేతో (OTTplay) భాగస్వామ్యం ద్వారా, బిఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులకు వివిధ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లను, విస్తృతమైన కంటెంట్ లైబ్రరీని ఉచితంగా అందించనుంది. బీఎస్ఎన్ఎల్ చందాదారులకు అదనపు ఖర్చులు లేకుండా అధిక-నాణ్యత స్ట్రీమింగ్ ను అందిస్తుంది.

అందరికీ ఉచితంగానే..

ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ జె రవి మాట్లాడుతూ, " మా ప్రతి వినియోగదారుడికి ప్రయాణంలో, 'ఎప్పుడైనా, ఎక్కడైనా' వినోదాన్ని ఉచితంగా అందించే లక్ష్యంతో బీఐటీవీని ప్రారంభిస్తున్నాం. బిఎస్ఎన్ఎల్ నిబద్ధతకు బిఐటివి నిదర్శనం. ఈ అద్భుతమైన సేవ ద్వారా విప్లవాత్మకమైన సేవలను అందించే మొదటి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో బిఎస్ఎన్ఎల్ ఒకటి’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ హరీందర్ కుమార్ పాల్గొన్నారు.

అన్ని చానళ్లు

సంప్రదాయ టెలివిజన్ ఛానళ్లతో పాటు భక్తిఫ్లిక్స్, షార్ట్ఫండ్లీ, స్టేజ్ వంటి ప్రముఖ స్ట్రీమింగ్ సేవలకు ఈ ఆఫర్ లో పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ పోర్టల్ లో సాధారణ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తర్వాత వినియోగదారులు ఓటిటిప్లే అప్లికేషన్ ద్వారా ఈ కంటెంట్ ను స్ట్రీమ్ చేయవచ్చు. ఈ భాగస్వామ్యం ద్వారా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ప్రీమియం కంటెంట్ ను ఉచితంగా చూసే అవకాశం లభిస్తుందని ఓటీటీప్లే సహ వ్యవస్థాపకుడు మరియు సిఇఒ అవినాష్ ముదలియార్ తెలిపారు. 'పాతాళ్ లోక్', 'రాకెట్ బాయ్స్' వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన సీరియల్స్ లో నటించిన నటుడు ఈశ్వర్ సింగ్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.

Whats_app_banner