Electric Scooter : మార్కెట్‌లో అమేజింగ్ ఫీచర్లతో మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జింగ్‌తో 200 కి.మీ పైనే!
Brisk Electric Scooter : కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారి కోసం గుడ్‌న్యూస్. మార్కెట్‌లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చింది. అదే బ్రిస్క్ ఈవీ స్కూటర్. దాని వివరాలపై ఓ లుక్కేద్దాం..
నిజానికి 2024లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఎక్కువే ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు, బైకులపై జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మార్కెట్‌లోకి కొత్త కంపెనీలు సైతం ఎంటర్ అయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ బ్రిస్క్ ఈవీ ఎనర్జీ కొత్త ఈ-స్కూటర్‌ను విడుదల చేసింది. ఆరిజిన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బడ్జెట్ ధరలో అమ్మకానికి ఉంది. ఇది అధునాతన డిజైన్, ఫీచర్లను కలిగి ఉంది. సరికొత్త ఈ స్కూటర్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తే బ్రిస్క్ ఆరిజిన్ బెటర్ ఆప్షన్.
కొత్త బ్రిస్క్ ఆరిజిన్ ఇ-స్కూటర్ సరసమైన ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ధర రూ.1,39,000 ఎక్స్-షోరూమ్‌గా ఉంది. దీనిని కావాలనుకునేవారు రూ.333 మాత్రమే అడ్వాన్స్ పేమెంట్ చెల్లించి ప్రీ బుక్ చేసుకోవచ్చు. డెలివరీ త్వరలో మెుదలవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆకట్టుకునే డిజైన్‌ను కలిగి ఉంది. స్పోర్టీ హెడ్‌లైట్, టైల్‌లైట్, ఫ్లాట్ ఫుట్ బోర్డ్, అల్లాయ్ ఫ్రంట్ ఫుట్-పెగ్‌లను పొందుతుంది. స్టార్మ్ గ్రే, పాంథర్ బ్లాక్, ఓషన్ గ్రీన్ వంటి అనేక కలర్ ఆప్షన్స్‌లో దొరుకుతుంది.
బ్రిస్క్ ఆరిజిన్ ఇ-స్కూటర్ 4.5 KWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. పూర్తి ఛార్జ్‌పై 200 పైన కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది గరిష్టంగా 94 కేఎంపీహెచ్ వేగాన్ని కలిగి ఉంది. 3.6 సెకన్లలో 0 నుండి 40 kmph వరకు వేగాన్ని అందుకోగలదు. ఎలక్ట్రిక్ మోటార్ 5.5 KW పీక్ పవర్ అండ్ 22 Nm (న్యూటన్ మీటర్) పీక్ టార్క్‌ని విడుదల చేస్తుంది. ఈ స్కూటర్ బ్యాటరీ కేవలం 7 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఎకో, రైడ్ , బ్రిస్క్ రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి.
కొత్త బ్రిస్క్ ఆరిజిన్ ఈవీ స్కూటర్‌లో 7-అంగుళాల టచ్ స్క్రీన్, యూఎస్‌బీ ఛార్జర్, సీట్ స్టోరేజ్ కింద 30 లీటర్ సామర్థ్యం, కాల్ మై స్కూటర్, రివర్స్ మోడ్‌తో సహా వివిధ ఫీచర్లను పొందుతుంది. మోనో షాక్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రండ్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్ ఆప్షన్స్ ఉన్నాయి. కాంబో బ్రేక్ సిస్టమ్ కూడా ఉంది. ఓలా, ఏథర్‌లకు బ్రిస్క్ ఈవీ పోటీ ఇవ్వనుంది.