Boult Drift+ Smartwatch : ఎంతో పాపులర్ అయిన డ్రిఫ్ట్ (Drift) స్మార్ట్‌వాచ్‍కు ‘ప్లస్’ అప్‍గ్రేడ్‍ను బోల్ట్ ఆడియో బ్రాండ్ తీసుకొచ్చింది. బోల్ట్ డ్రిఫ్ట్+ (Boult Drift+) వాచ్‍ను లాంచ్ చేసింది. జింక్ అలాయ్ ఫ్రేమ్, ఐపీఎస్ ఎల్‍సీడీ డిస్‍ప్లేను ఈ వాచ్ (Smartwatch) కలిగి ఉంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వస్తోంది. హెల్త్ ఫీచర్లు ఉంటాయి. బోల్డ్ డ్రిఫ్ట్ + స్మార్ట్‌వాచ్ పూర్తి వివరాలివే.,బోల్ట్ డ్రిఫ్ట్+ స్మార్ట్‌వాచ్ ధర, సేల్Boult Drift+ Smartwatch Price: బోల్ట్ డ్రిఫ్ట్+ స్మార్ట్‌వాచ్ ధర రూ.1,799గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్‌తో పాటు బోల్ట్ ఆడియో వెబ్‍సైట్‍లోనూ ఈ వాచ్ సేల్‍కు ఉంది. స్నో క్రీమ్, జెట్ బ్లాక్, బ్లాక్ కాఫీ, డార్క్ బ్లూ, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ వాచ్ లభిస్తోంది.,బోల్ట్ డ్రిఫ్ట్+ స్పెసిఫికేషన్లు, ఫీచర్లుBoult Drift+ Smartwatch Features: 1.85 ఇంచుల IPS LCD HD స్క్వేర్ షేప్ డిస్‍ప్లేను బోల్ట్ డ్రిఫ్ట్+ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. 500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. జింగ్ అలాయ్ ఫ్రేమ్ ఉండటంతో లుక్‍పరంగా ఇది కాస్త ప్రీమియమ్‍గా కనిపిస్తుంది. 150కుపైగా వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో ఈ వాచ్ వస్తోంది. ఇందుకోసం వాచ్‍లో స్పీకర్, మైక్ ఉంటాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.1 వెర్షన్ ఉంటుంది. ఫోన్‍కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. గూగుల్ అసిస్టెంట్, సిరి వాయిస్ అసిస్టెంట్లకు సపోర్ట్ చేస్తుంది.,Boult Drift+ Smartwatch: హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్స్ లెవెల్స్ ట్రాకింగ్ కోసం ఎస్‍పీఓ2 సెన్సార్, బ్లడ్ ప్లెజర్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్ లాంటి హెల్త్ ఫీచర్లను బోల్ట్ డ్రిఫ్ట్+ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. ఫోన్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు నోటిఫికేషన్లను వాచ్‍లోనే పొందవచ్చు.,Boult Drift+ Smartwatch: సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా సహా మొత్తంగా 100 స్పోర్ట్స్ మోడ్‍లకు ఈ Boult Drift+ వాచ్ సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 7 రోజుల వరకు ఈ వాచ్ బ్యాటరీ లైఫ్‍ను ఇస్తుంది. బ్లూటూత్ కాలింగ్ కోసం ఎక్కువగా వాడితే రెండు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. 2.5 గంటల్లో ఈ వాచ్ ఫుల్ చార్జ్ అవుతుంది. వాటర్, డస్ట్ రెసిస్టెట్స్ కోసం ఐపీ68 రేటింగ్‍తో ఈ నయా బోల్ట్ స్మార్ట్‌వాచ్ వస్తోంది.,