Kids Smartwatch: వీడియో కాల్స్, 4జీ సిమ్ కనెక్టివిటీతో పిల్లల కోసం బోట్ సరికొత్త స్మార్ట్‌వాచ్.. ధర, పూర్తి ఫీచర్లు ఇవే-boat brigns boat wanderer smartwatch for kids with 4g gps camera check price specifications features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Boat Brigns Boat Wanderer Smartwatch For Kids With 4g Gps Camera Check Price Specifications Features

Kids Smartwatch: వీడియో కాల్స్, 4జీ సిమ్ కనెక్టివిటీతో పిల్లల కోసం బోట్ సరికొత్త స్మార్ట్‌వాచ్.. ధర, పూర్తి ఫీచర్లు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
May 21, 2023 01:38 PM IST

boAt Wanderer Smartwatch: పిల్లల కోసం స్పెషల్‍గా బోట్ వాండరర్ స్మార్ట్ వాచ్ లాంచ్ అయింది. కెమెరా, 4జీ కనెక్టివిటీ, జీపీఎస్ సహా చాలా ఫీచర్లతో ఈ వాచ్ వచ్చింది.

Kids Smartwatch: వీడియో కాల్స్, 4జీ సిమ్ కనెక్టివిటీతో పిల్లల కోసం బోట్ సరికొత్త స్మార్ట్‌వాచ్.. ధర, పూర్తి ఫీచర్లు ఇవే (Photo: boAt)
Kids Smartwatch: వీడియో కాల్స్, 4జీ సిమ్ కనెక్టివిటీతో పిల్లల కోసం బోట్ సరికొత్త స్మార్ట్‌వాచ్.. ధర, పూర్తి ఫీచర్లు ఇవే (Photo: boAt)

‘boAt Wanderer Smart’watch: దేశీయ బ్రాండ్ బోట్ (boAt) స్మార్ట్‌వాచ్‍ల (Smartwatches) విభాగంలోనూ దూసుకుపోతోంది. విభిన్న రకాలైన స్మార్ట్‌వాచ్‍లను తెస్తోంది. ఈ క్రమంలో పిల్లల కోసం స్పెషల్‍గా ఓ స్మార్ట్‌వాచ్‍ను విడుదల చేసింది. బోట్ వాండరెర్ స్మార్ట్ (boAt Wanderer Smart) పేరుతో ఈ కిడ్స్ స్పెషల్ స్మార్ట్‌వాచ్ లాంచ్ చేసింది. ఇప్పటికే ఈ వాచ్ సేల్ మొదలైంది. 4జీ సిమ్ కనెక్టివిటీ, వీడియో/వాయిస్ కాల్స్ సహా చాలా పేరెంటల్ కంట్రోల్స్ ఈ వాచ్‍లో ఉంటాయి. ఈ బోట్ వాండరర్ స్మార్ట్‌వాచ్ పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

బోట్ బోట్ వాండరర్ స్మార్ట్ ఫీచర్లు, స్పెసిపికేషన్లు

boAt Wanderer Smartwatch: పిల్లలు ఎక్కడ ఉన్నారో ఎప్పటికప్పుడు తల్లితండ్రులు తెలుసుకునేందుకు, పిల్లలు కాల్స్ చేసుకునేందుకు ఈ బోట్ వాండర్స్ స్మార్ట్‌వాచ్‍ రూపొందింది. తల్లిదండ్రులు తమ ఫోన్‍లోని బోట్ వాండరర్ యాప్ ద్వారా ఈ వాచ్ ధరించిన పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు. వీడియో/వాయిస్ కాల్స్ చేయవచ్చు. ఈ వాచ్‍కు 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీంతో వీడియో కాల్స్ మాట్లాడవచ్చు. పిల్లలు ఫొటోలు కూడా తీసుకోవచ్చు. 4జీ సిమ్‍కు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. దీంతో పిల్లలు వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఈ వాచ్‍లో ఇన్‍బుల్డ్ మైక్రోఫోన్, స్పీకర్ ఉంటాయి. వాయిస్, టెక్స్ట్ చాట్‍ ఫీచర్లతో ఈ వాచ్ వచ్చింది.

boAt Wanderer Smartwatch: 1.4 ఇంచుల TFT డిస్‍ప్లేను ఈ బోట్ వాండరర్ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. రగెడ్ రబ్బర్ చేసిస్‍తో ఈ వాచ్ వచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో ఎంపిక చేసుకున్న కాంటాక్టులకు అలెర్ట్ వెళ్లేలా ఉపయోగడే SOS బటన్ కూడా ఈ వాచ్‍కు ప్రత్యేకంగా ఉంది. ఈ సాస్ బటన్‍ను పిల్లలు ప్రెస్ చేస్తే ఈ వాచ్‍లో సెట్ చేసిన వారి కాంటాక్టులకు అలెర్ట్ సెండ్ అవుతుంది.

boAt Wanderer Smartwatch: బుల్ట్ఇన్ జీపీఎస్, జియో ఫెన్సింగ్‍ కనెక్టివిటీ ఫీచర్లను బోట్ వాండరర్స్ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. దీంతో ఈ వాచ్ ధరించిన పిల్లలు ఎక్కడ ఉన్నారో తల్లిదండ్రులు తమ మొబైల్‍లో ట్రాక్ చేయవచ్చు. కావాలనుకుంటే పిల్లలు ఈ వాచ్‍ను వాడకుండా కూడా పేరెంట్స్ రిస్ట్రిక్ట్ చేయవచ్చు. తరగతుల్లో ఉన్నప్పుడు పిల్లలు ఈ వాచ్ వాడకుండా ఇది ఉపయోగపడుతుంది. ఇక 650mAh బ్యాటరీ ఈ వాచ్‍లో ఉంటుంది. 2 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. స్టెప్ కౌంటర్, ఫైండ్ మైవాచ్ లాంటి ఫీచర్లు ఉంటాయి. వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీ68 రేటింగ్‍తో ఈ వాచ్ వచ్చింది.

బోట్ వాండరర్ స్మార్ట్‌వాచ్ ధర, సేల్

boAt Wanderer Smart Price: బోట్ వాండరర్ స్మార్ట్‌వాచ్ ఇంట్రడక్టరీ ధర రూ.5,000గా ఉంది. ఈ-కామర్స్ ప్లాట్‍ఫామ్ అమెజాన్, బోట్ అధికారిక వెబ్‍సైట్‍లో ఈ వాచ్ సేల్‍కు అందుబాటులో ఉంది. కోరల్, అక్వా కలర్ ఆప్షన్‍లలో లభిస్తోంది.

WhatsApp channel