December car launches : డిసెంబర్​లో లగ్జరీ కార్ల లాంచ్​.. 2022కు గ్రాండ్​గా ముగింపు!-bmw xm to mercedes benz eqb december car launches list is here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Bmw Xm To Mercedes Benz Eqb, December Car Launches List Is Here

December car launches : డిసెంబర్​లో లగ్జరీ కార్ల లాంచ్​.. 2022కు గ్రాండ్​గా ముగింపు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 28, 2022 11:22 AM IST

December car launches list : బీఎండబ్ల్యూ, మెర్సిడెస్​ నుంచి మొత్తం మీద నాలుగు వాహనాలు.. వచ్చే నెలలో ఇండియా మార్కెట్​లోకి అడుగుపెట్టనున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం..

డిసెంబర్​లో లగ్జరీ కార్​ లాంచ్​ల హవా..!
డిసెంబర్​లో లగ్జరీ కార్​ లాంచ్​ల హవా..!

December car launches list : ఈ ఏడాదిని ఘనంగా ముగించేందుకు ఆటో సంస్థలు సిద్ధపడుతున్నాయి. డిసెంబర్​లో కొత్త మోడల్స్​ను లాంచ్​ చేసేందుకు పోటీపడుతున్నాయి. ముఖ్యంగా.. వచ్చే నెలలో లగ్జరీ కార్ల సెగ్మెంట్​ కళకళలాడనుంది! బీఎండబ్ల్యూ నుంచి మెర్సిడెస్​ బెంజ్​ వరకు.. లాంచ్​కు సిద్ధమవుతున్న కార్లపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం..

ట్రెండింగ్ వార్తలు

బీఎండబ్ల్యూ ఎక్స్​ఎం..

BMW XM launch : అంతర్జాతీయంగా.. ఈ ఏడాది సెప్టెంబర్​లో ఎక్స్​ఎం మోడల్​ను ఆవిష్కరించింది లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ. ఈ బీఎండబ్ల్యూ ఎక్స్​ఎం.. డిసెంబర్​ 10న ఇండియాలో లాంచ్​కానుంది. ఎం డివిజన్​ నుంచి వస్తున్న బీస్పోక్​ మోడల్​ ఇది.

ప్లగ్​-ఇన్​ హైబ్రీడ్​ వర్షెన్​ కలిగి ఉన్న తొలి ‘ఎం’ మోడల్​గా ఈ వెహికిల్​ గుర్తింపు పొందింది. ఈ లగ్జరీ ఎస్​యూవీలో 4.4 లీటర్​ ట్విన్​ టర్బో వీ8 ఇంజిన్​ ఉంది. సింగిల్​ ఎలక్ట్రిక్​ మోటార్​తో కూడిన మైల్డ్ హైబ్రీడ్​ టెక్నాలజీ ఆప్షన్​ కూడా ఉంది. ఐసీఈలో 483హెచ్​పీ పవర్​తో పాటు హైబ్రీడ్​ ఇంజిన్​లో 653 హెచ్​పీ పవర్​, 800ఎన్​ఎం టార్క్​ జనరేట్​ అవుతుంది. ఎలక్ట్రిక్​ మోటార్​ ఆప్షన్​లో 194 హెచ్​పీ పవర్​ జనరేట్​ అవుతుంది. ఈ బీఎండబ్ల్యూ ఎక్స్​ఎంలో 8 స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ సెటప్​ ఉంది. ఇక ప్యూర్​ ఈవీ మోడ్​లో.. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఈ వెహికిల్​ 80కి.మీల దూరం ప్రయాణించగలదని సంస్థ చెబుతోంది.

బీఎండబ్ల్యూ ఎక్స్​7..

BMW X7 launch date : బీఎండబ్ల్యూ నుంచి మరో మోడల్​ డిసెంబర్​లో లాంచ్​ కానుంది. అదే బీఎండబ్ల్యూ ఎక్స్​7. ఈ ఎస్​యూవీ.. డిసెంబర్​ 10న మార్కెట్​లోకి అడుగుపెట్టనుంది. ఈ ఏడాది ఏప్రిల్​లో ఈ బీఎండబ్ల్యూ ఎక్స్​7 ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ను ఆవిష్కరించింది సంస్థ. ఇందులో 14.9 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, 12.3 ఇంచ్​ ఆల్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంటల్​ క్లస్టర్​.

బీఎండబ్ల్యూ ఎక్స్​7.. రెండు వేరియంట్లలో లభించనుంది. అవి.. ఎక్స్​డ్రైవ్​ 40ఐ, ఎక్స్​డ్రైవ్​ 30డీ. మొదటిది.. 380హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. అది 6 సిలిండర్​ పెట్రోల్​ వేరియంట్​. ఇక రెండోది.. 6 సిలిండర్​ డీజిల్​ ఇంజిన్​. అది 352 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. రెండింటిలోనూ 48వీ మైల్డ్​ హైబ్రీడ్​ టెక్నాలజీ. ఇందులో 8 స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​ బాక్స్​ ఉంటుంది.

మెర్సిడెస్​ బెంజ్​ ఈక్యూబీ..

Mercedes Benz EQB launch date in India : ఈక్యూసీ, ఈక్యూఎస్​ మోడల్స్​ను ఇప్పటికే లాంచ్​ చేసి మెర్సిడెస్​ బెంజ్​.. ఈక్యూబీ వేరియంట్​ను డిసెంబర్​ 2న విడుదల చేయనుంది. ఫలితంగా ఇండియాలో మెర్సిడెస్​ బెంజ్​ పోర్ట్​ఫోలియో బలంగా మారింది. మెర్సిడెస్​ బెంజ్​ ఈక్యూబీ.. చాలా స్టైలిష్​గా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్​లో.. ఇది రెండు వేరియంట్లలో లభిస్తోంది. డ్యూయెల్​ మోటార్​ 300 4మాటిక్​ వేరియంట్​.. 228 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. డ్యూయెల్​ మోటార్​ 350 4మాటిక్​ గ్యూస్​ వేరియంట్​.. 292 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. ఈ రెండింట్లో.. ఏది ఇండియాలో లాంచ్​ అవుతోందో వేచి చూడాలి.

మెర్సిడెస్​ బెంజ్​ జీఎల్​బీ..

Mercedes Benz GLB launch details : మెర్సిడెస్​ బెంజ్​ నుంచి డిసెంబర్​లో లాంచ్​ కానున్న మరో మోడల్​ జీఎల్​బీ. ఇది కూడా డిసెంబర్​ 2నే లాంచ్​ అవ్వనుంది. మెక్సికో నుంచి సీబీయూ(కంప్లీట్లీ బిల్ట్​ యూనిట్​)గా ఈ మెర్సిడెస్​ బెంజ్​ జీఎల్​బీ.. ఇండియాలోకి రానుంది. జీఎల్​ఎస్​ తర్వాత వస్తున్న రెండో 7 సీటర్​ మోడల్​ ఇదే. 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, వాయిస్​ కమాండ్​, పానారోమిక్​ సన్​రూఫ్​, స్లైడింగ్​ డ్యూయెల్​ రో సీట్స్​ ఉన్నాయి. ఈ లగ్జరీ ఎస్​యూవీలో 1.3 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​, 2.0 లీటర్​ డీజిల్​ మోటార్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. పెట్రోల్​ ఇంజిన్​.. 163హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. డీజిల్​ ఇంజిన్​.. 190హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది.

నవంబర్​లో ఇవి..

నవంబర్​లో పలు సంస్థలు.. తమ మోడల్స్​తో కస్టమర్ల ముందుకు వచ్చాయి. జీప్​ గ్రాండ్​ చెరోకీ, బీవైడీ అట్టో 3 ఈవీ, ప్రవాగ్​ డిఫై ఎలక్ట్రిక్​ వంటి మోడల్స్​ లాంచ్​ అయ్యాయి. టయోటా ఇన్నోవా హైక్రాస్​.. నవంబర్​ కార్ల లాంచ్​లో హైలైట్​గా నిలిచింది.

WhatsApp channel

సంబంధిత కథనం