BMW Electric Car : 531 కిమీ రేంజ్‌తో బీఎండబ్ల్యూ ఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ ఎలక్ట్రిక్ కారు, అమేజింగ్ ఫీచర్లు!-bmw x1 long wheelbase electric suv car launched with 531km range and super new features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bmw Electric Car : 531 కిమీ రేంజ్‌తో బీఎండబ్ల్యూ ఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ ఎలక్ట్రిక్ కారు, అమేజింగ్ ఫీచర్లు!

BMW Electric Car : 531 కిమీ రేంజ్‌తో బీఎండబ్ల్యూ ఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ ఎలక్ట్రిక్ కారు, అమేజింగ్ ఫీచర్లు!

Anand Sai HT Telugu
Jan 19, 2025 02:19 PM IST

BMW Electric Car : భారత్ ఆటో ఎక్స్‌పో 2025లో కొత్త కార్లు లాంచ్ అవుతున్నాయి. ఇందులో బీఎండబ్ల్యూ ఎక్స్1 లాంగ్ వీల్‌బైస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూడా విడుదల చేశారు. ఈ కారు విశేషాలు తెలుసుకుందాం..

బీఎండబ్ల్యూ ఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ ఎలక్ట్రిక్ కారు
బీఎండబ్ల్యూ ఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ ఎలక్ట్రిక్ కారు

ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా తన బీఎండబ్ల్యూ ఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ ఆల్ ఎలక్ట్రిక్ కార్‌ను విడుదల చేసింది. కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ ఎలక్ట్రిక్ కారు ధర రూ.49 లక్షలు ఎక్స్-షోరూమ్. ఈ కొత్త కారును చెన్నై యూనిట్‌లో ఉత్పత్తి చేస్తారు. eDrive20L డ్రైవ్‌ట్రైన్‌తో వస్తుంది. ఈ బీఎండబ్ల్యూ ఎక్స్1 కారు డెలివరీలు 2025 ద్వితీయార్థంలో ప్రారంభమవుతాయి.

yearly horoscope entry point

సరికొత్త టెక్నాలజీ

బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎలక్ట్రిక్ కారు 531 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సిటీ కమ్యూటింగ్, లాంగ్ జర్నీ కోసం తయారుచేశారు. ఎక్కువ స్థలాన్ని, సౌకర్యాన్ని అందిస్తుంది. BMW X1 లాంగ్ వీల్‌బేస్ ఎలక్ట్రిక్ కారు 66.4 kWh బ్యాటరీ, eDrive టెక్నాలజీతో ఆధారితమైనది. ఇందులో సరికొత్త iDrive సిస్టమ్ వంటి స్మార్ట్ ఫీచర్‌ను కలిగి ఉంది.

ఫాస్ట్ ఛార్జింగ్

ట్రాఫిక్ పరిస్థితులు, బ్యాటరీ స్థాయిల ఆధారంగా ఛార్జింగ్ స్టాప్‌లను ఆప్టిమైజ్ చేయడం ద్వారా డ్రైవర్లు తమ ట్రిప్పులను సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవడంలో సహాయపడే స్మార్ట్ ఇ-రూటింగ్ ఫీచర్ కూడా ఈ కారులో ఉంది. కేవలం 29 నిమిషాల్లో 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయగల 130 kW DC ఛార్జర్‌తో ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో అధునాతన ఫీచర్లతో కూడిన విశాలమైన క్యాబిన్ ఉంది. మల్టీ-వే అడ్జస్టబుల్ స్పోర్ట్స్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అమేజింగ్ ఫీచర్లు

ఈ బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కారు డిజిటల్ కీ ప్లస్‌తో అమర్చబడి ఉంది. ఇది కారు ఓనర్ స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్‌ని ఉపయోగించి కారును లాక్ చేయడానికి, అన్‌లాక్ చేయడానికి, స్టార్ట్ చేయడానికి అనుమతిస్తుంది. లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, ఆటోమేటిక్ పార్కింగ్ ఫంక్షన్‌ల వంటి డ్రైవర్ అసిస్ట్ ఫీచర్‌లతో వస్తుంది. బీఎండబ్ల్యూ ఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ ఎలక్ట్రిక్ కారు మినరల్ వైట్, కార్బన్ బ్లాక్‌తో సహా డ్యూయల్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. రెండేళ్ల అపరిమిత కిలోమీటర్ వారంటీతో వస్తుంది.

Whats_app_banner