BMW new bikes launch : హ్యుందాయ్ క్రేటా కన్నా ఈ రెండు బైక్స్ ధరలే ఎక్కువ!
బిఎమ్ డబ్ల్యూ ఆర్ 12 మరియు ఆర్ 12 నైన్ టి కొత్త బాక్సర్ ట్విన్ ఇంజన్ ను ఉపయోగిస్తాయి. 2024 సెప్టెంబర్లో ఈ బైక్ల డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ ఇండియా కొత్త ఆర్ 12, ఆర్ 12 నైన్టీ బైకులను భారత మార్కెట్లో తాజాగా లాంచ్ చేసింది. వీటి ధర రూ.19.90 లక్షలు, రూ.20.90 లక్షలుగా ఉన్నాయి. ఈ రెండు ధరలు ఎక్స్-షోరూమ్. ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో ఒకటైన హ్యుందాయ్ క్రేటా ఎస్యూవీ కన్నా వీటి ధరలే ఎక్కువ! బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ ఈ రెండు మోటార్ సైకిళ్లను కంప్లీట్లీ బిల్ట్-అప్ యూనిట్స్ (సీబీయూ)గా తీసుకురానుంది. సెప్టెంబర్ 2024 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.
ఈ రెండు బీఎమ్‌డబ్ల్యూ మోటార్ సైకిళ్లలో కాస్మోటిక్స్ పరంగా, మెకానికల్ పరంగా కొన్ని గణనీయమైన మార్పుల వచ్చాయి. తాజా మోటార్ సైకిళ్లలో ఇప్పుడు సింగిల్ పీస్ ట్యూబ్యులర్ బ్రిడ్జ్ స్టీల్ స్పేస్ ఫ్రేమ్, యటాచ్డ్ రేర్ ఫ్రేమ్‌ను అమర్చారు. ఈ అప్డేటెడ్ ఫ్రేమ్ బరువు తగ్గడానికి, మోటార్ సైకిళ్లకు మరింత క్రమబద్ధమైన రూపానికి దోహదం చేసింది. అదనంగా, కొత్త ఫ్రేమ్ ఇప్పుడు సీటు కింద ఉన్న ఎయిర్ బాక్స్ విస్తరణకు అనుమతించింది.
ఈ రెండు మోటార్ సైకిళ్లలో ముందు భాగంలో ఇన్వర్టెడ్ ఫోర్కులు సపోర్ట్ చేసే ఫ్రేమ్, వెనుక భాగంలో సింగిల్ సైడ్ స్వింగ్ ఆర్మ్‌కు కనెక్ట్ చేసిన మోనోషాక్ ఉన్నాయి. ఆర్ 12 నైన్టీ పూర్తిగా అడ్జెస్టెబుల్ ఫ్రంట్ ఫోర్కులను కలిగి ఉంది. వెనుక భాగంలో పారాలెవర్ స్వింగ్ చేయిన్ కలిగి ఉంది. ముందు భాగంలో ట్విన్ 320 డిస్క్ బ్రేక్ లు, 4-పిస్టన్ మోనోబ్లోక్ బ్రేక్ కాలిపర్స్, వెనుక భాగంలో సింగిల్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. అదనంగా, బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ ఏబీఎస్ ప్రో చేర్చింది.
బీఎమ్‌డబ్ల్యూ ఆర్ 12 నైన్టీ- ఆర్ 12: స్పెసిఫికేషన్లు..
బీఎండబ్ల్యూ ఆర్ 12 నైన్టీ, ఆర్ 12 బైక్స్‌లో 1,170 సీసీ ఎయిర్ /ఆయిల్ కూల్డ్ బాక్సర్ ఇంజిన్ ఉంటుంది. ఆర్ 12 నైన్టీలో ఇది 7,000 ఆర్పీఎమ్ వద్ద 107 బీహెచ్పీ పవర్, 6,500 ఆర్పీఎమ్ వద్ద 115 ఎన్ఎమ్ గరిష్ట టార్క్.. ఆర్ 12లో 6,500 ఆర్పీఎమ్ వద్ద 93 బీహెచ్పీ పవర్, ఆర్ 12 లో 6,000 ఆర్పీఎమ్ వద్ద 110 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ట్విన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఇప్పుడు ఎడమ వైపున అమర్చింది సంస్థ.
బీఎమ్‌డబ్ల్యూ ఆర్ 12 నైన్టీ- ఆర్ 12: ఫీచర్లు
రెండు మోటార్ సైకిళ్లలో స్టాండర్డ్‌గా మూడు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. అవి రెయిన్, రోడ్, డైనమిక్. అదనంగా, ఆర్ 12 నైన్టీ రోల్, రాక్ మోడ్‌ను కూడా పొందుతుంది. బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, కీలెస్ రైడ్, ఇంజిన్ డ్రాగ్ టార్క్ కంట్రోల్, కొత్త క్లాసిక్ రౌండ్ ఇన్స్ట్రుమెంట్స్తో పాటు యూఎస్బీ-సి, 12 వీ సాకెట్లను స్టాండర్డ్‌గా అందిస్తుంది.
బీఎమ్‌డబ్ల్యూ ఆర్ 12 నైన్టీ- ఆర్ 12: ఆప్షనల్ ప్యాకేజీలు
బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ కూడా కొన్ని ఆప్షనల్ ప్యాకేజీలను అందిస్తోంది. హిల్ స్టార్ట్ కంట్రోల్ ప్రో, షిఫ్ట్ అసిస్టెంట్ ప్రో, హీటెడ్ గ్రిప్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి కంఫర్ట్ ప్యాకేజీ ఇందులో ఉంది. తరువాత ఆప్షన్ 719 "అల్యూమినియం" స్టైల్ ఉంది. ఇది రేసింగ్ రెడ్, డార్క్ ఎలిమెంట్స్‌లో ఫినిష్ చేసిన ఫ్రేమ్‌తో పాటు సింగిల్-పీస్ సీటుతో వస్తుంది. చివరిగా 719 స్టైల్ అవస్ సిల్వర్ ఆప్షన్ ఉంది. ఇందులో డార్క్ ఎలిమెంట్స్‌తో పాటు మెటాలిక్ పెయింట్ వర్క్ లభిస్తుంది. గోల్డ్ కలర్ స్టిచింగ్, డిజైన్ ఆప్షన్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో కూడిన ఆప్షన్ 719 సీట్ కూడా ఉంది.
సంబంధిత కథనం