Smart Helmet : ఈ హెల్మెట్‌తో కాల్ మాట్లాడుకోవచ్చు.. దారి తప్పితే అలర్ట్.. ఇంకా ఎన్నో ఫీచర్లు
Bluarmor C50 Pro Helmet : మార్కెట్లో ఎన్నో హెల్మెట్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్నింటిలో కావాల్సిన ఫీచర్లు ఉండవు. బ్లూఅర్మూర్ అనే సంస్థ వినియోగదారుల కోసం స్మార్ట్ హెల్మెట్‌లను తయారు చేస్తోంది. అందులో అనేక స్మార్ట్ ఫీచర్లను పెడుతుంది. సీ50 ప్రో హెల్మెట్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది.
హెల్మెట్‌లో అనేక రకాల ఫీచర్లు ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారి కోసం గుడ్ న్యూస్. బెంగుళూరుకు చెందిన స్టార్టప్ బ్లూఅర్మర్ C50 ప్రో హెల్మెట్‌ను ఇంటర్‌కామ సిస్టమ్‌తో విడుదల చేసింది. ఈ హెల్మెట్ కావాలనుకునేవారు బ్లూ అర్మర్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 28 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం కొనుగోలు కోసం అందుబాటులో ఉన్న బ్లూమర్ C30 ఇంటర్‌కామ్‌తో పోలిస్తే ఇది మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.
కొత్త బ్లూఅర్మర్ C50 Pro పరిమాణంలో Bluarmor C30 ఇంటర్‌కామ్ కంటే చాలా చిన్నది. ఇది అదనపు ఫీచర్లను కలిగి ఉంది. వినియోగదారుల నుండి వచ్చిన కొన్ని సూచనల ఆధారంగా నైపుణ్యం కలిగిన ఇంజనీర్ల బృందం ఈ ఇంటర్‌కామ్‌ను అభివృద్ధి చేసింది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాని బ్యాటరీ 16 గంటల వరకు ఉంటుంది.
C50 ప్రో ఇంటర్‌కామ్‌లోని PORTWEAVE టెక్నాలజీ.. ఫోన్‌లు, కెమెరాలు, జీపీఎస్, ఇతర పరికరాలను కనెక్ట్ చేయడం సులభం చేస్తుంది. దీనిని 3 బటన్ మాడ్యులర్ ఇంటర్‌ఫేస్, వైర్‌లెస్ T స్టిక్ ఉపయోగించి నియంత్రించవచ్చు. C50 Pro ఇంటర్‌కామ్‌ను మాగ్నెటిక్ డాక్, క్లిక్‌డాక్ సిస్టమ్ సహాయంతో హెల్మెట్‌కు చక్కగా జతచేయవచ్చు. హెల్మెట్‌కు ఇబ్బంది కలిగించేలా ఉండదు. దీనికి IP-67 రేటింగ్ కూడా ఉంది. దీనిని ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనైనా ఉపయోగించవచ్చు. బయటి శబ్ధాలు కూడా ఎక్కువగా వినిపించవు. ఒక రకమైన మ్యూజిక్ కూడా ప్లే చేసుకోవచ్చు.
RIDEGRID 2.0 Mesh ఇంటర్‌కామ్ సిస్టమ్ ఇందులో ఉపయోగించారు. అంటే ఇది వాయిస్‌ను స్పష్టంగా వినడానికి సహాయపడుతుంది. ఈ హెల్మెట్‌లో ద్విచక్ర వాహనదారుల భద్రతకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. క్రాష్-డిటెక్షన్ ఫీచర్ తీసుకువచ్చారు. రైడర్ ఆపదలో ఉన్నప్పుడు SOS హెచ్చరిక వారి ప్రియమైన వారికి పంపేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది సందేశం, కాల్ రూపంలో ఉండవచ్చు. అంతేకాదు హెల్మెట్లను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసేందుకు యాక్టివ్ లింగ్ ట్రాకింగ్ టెక్నాలజీని వాడారు. దీనితో రైడర్లు కమ్యూనికేట్ చేసుకోవచ్చు.
బెంగళూరుకు చెందిన స్టార్టప్ బ్లూ అర్మర్ కంపెనీ తయారు చేసిన ఈ C50 హెల్మెట్ ఇంటర్‌కామ్ పరికరం చాలా అధునాతనమైనది. దీనిని ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఉపయోగించవచ్చు. సీ50 హెల్మెట్ ఇంటర్‌కామ్ పరికరం ధర రూ.24,999గా నిర్ణయించారు. ప్రారంభ ఆఫర్ కింద రూ.22 వేలకు కొనొచ్చు.