Blinkit ambulance service: ‘10 నిమిషాల్లో అంబులెన్స్’ సర్వీసును ప్రారంభించిన బ్లింకిట్
Blinkit ambulance service: క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ కొత్తగా అంబులెన్స్ సేవలను ప్రారంభించింది. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా అంబులెన్స్ ను బుక్ చేస్తే, 10 నిమిషాల్లోపే సేవకు సిద్ధంగా ఉంటుందని బ్లింకిట్ హామీ ఇస్తోంది. అయితే, మొదట ఈ సేవలను గురుగ్రామ్ లో మాత్రమే ప్రారంభించింది.
Blinkit ambulance service: గుర్గావ్ వాసులకు 10 నిమిషాల అంబులెన్స్ డెలివరీ సర్వీసును క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ ప్రకటించింది. బ్లింకిట్ వినియోగదారులు ఇకపై అత్యవసర పరిస్థితుల్లో కేవలం 10 నిమిషాల్లో అంబులెన్స్ సేవలను వారి ఇంటి వద్దనే పొందవచ్చు.
మొదట గురుగ్రామ్ లో..
10 నిమిషాల్లో అంబులెన్స్ సేవలను బ్లింకిట్ మొదట గురుగ్రామ్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. "మా నగరాల్లో వేగవంతమైన, విశ్వసనీయమైన అంబులెన్స్ సేవలను అందించే సమస్యను పరిష్కరించే దిశగా మేము మా మొదటి అడుగు వేస్తున్నాము. తొలి ఐదు అంబులెన్స్ లు నేటి నుంచి గురుగ్రామ్ లో రోడ్డెక్కనున్నాయి. మేము సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించడంతో, బ్లింకిట్ యాప్ ద్వారా బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) అంబులెన్స్ ను మీరు బుక్ చేసుకోవచ్చు" అని బ్లింకిట్ సీఈఓ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
దీనికి ఎంత ఖర్చవుతుంది?
ఈ సేవకు ఎంత ఖర్చవుతుందో ధిండ్సా వెల్లడించనప్పటికీ, కొత్తగా ప్రారంభించిన సేవకు "లాభం ఒక లక్ష్యం కాదు" అని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులకు అందుబాటు ధరల్లో ఈ సేవలను అందిస్తామని, దీర్ఘకాలికంగా ఈ క్లిష్టమైన సమస్యను పరిష్కరించేందుకు పెట్టుబడులు (investment) పెడతామని తెలిపారు. ‘‘మేము ఈ సేవను జాగ్రత్తగా పెంచుతున్నాము, ఎందుకంటే ఇది మాకు ముఖ్యమైనది మరియు కొత్తది. వచ్చే రెండేళ్లలో అన్ని ప్రధాన నగరాలకు విస్తరించాలనేది మా లక్ష్యం’’ అన్నారు.
రెండో సర్వీసు
బ్లింకిట్ ఈ వారంలో ప్రారంభించిన రెండో కొత్త సర్వీసు ఇది. అంతకు ముందు సీఈఓ అల్బిందర్ ధిండ్సా భారీ ఆర్డర్ ఫ్లీట్ ను ప్రకటించారు. "ఇవన్నీ అన్ని పెద్ద (ఎలక్ట్రానిక్స్ / పార్టీ ఆర్డర్లు) ఆర్డర్లను నిర్వహించడానికి రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలు. ప్రస్తుతం ఢిల్లీ (delhi), గురుగ్రామ్ లలో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఇతర నగరాల్లోనూ ప్రారంభిస్తాం' అని ఆ వాహనాల ఫొటోలను షేర్ చేశారు.