Crypto currency : స్టాక్​ మార్కెట్లే కాదు, క్రిప్టోలోనూ భారీ పతనం!-bitcoin slumps to 78 000 dollars cryptos face sharp sell off amid trumps tariffs hit ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Crypto Currency : స్టాక్​ మార్కెట్లే కాదు, క్రిప్టోలోనూ భారీ పతనం!

Crypto currency : స్టాక్​ మార్కెట్లే కాదు, క్రిప్టోలోనూ భారీ పతనం!

Sharath Chitturi HT Telugu

Crypto currency crash : ట్రంప్​ ఎఫెక్ట్​ క్రిప్టో కరెన్సీపైనా పడింది. అనేక క్రిప్టో కాయిన్లు విపరీతంగా పడుతున్నాయి. స్టాక్​ మార్కెట్లలానే క్రిప్టోల్లోనూ ప్యానిక్​ సెల్లింగ్​ కనిపిస్తోంది.

క్రిప్టో కరెన్సీ కూడా క్రాష్​.. (Pixabay)

ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ‘టారీఫ్​’ షాక్​తో స్టాక్​ మార్కెట్లు మాత్రమే కాదు, క్రిప్టో కరెన్సీలు కూడా విలవిలలాడుతున్నాయి. ప్యానిక్​ సెల్లింగ్​ కారణంగా క్రిప్టోలు అత్యంత భారీగా పతనమయ్యాయి. పలు నివేదికల ప్రకారం గత 24 గంటల్లో 745 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోలను అమ్మేశారు. ఇది దాదాపు ఆరు వారాల్లో అత్యధికమని తెలుస్తోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్​కాయిన్ ఏప్రిల్ 7న సింగపూర్​లో ప్రారంభమైన మార్కెట్లలో 7 శాతం క్షీణించి 77,077 డాలర్లకు పడిపోయింది. రెండో అతిపెద్ద క్రిప్టో అయిన ఎథేరియం 2023 అక్టోబర్ తర్వాత ఇంట్రాడే కనిష్ట స్థాయికి పడిపోయి 1,538 డాలర్లకు చేరింది.

ట్రంప్ టారిఫ్​ల మధ్య గ్లోబల్ క్రిప్టో మార్కెట్లు క్రాష్..

ఏప్రిల్ 7న ప్రపంచ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) 2.5 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. గత 24 గంటల్లో 6.59 శాతం తగ్గింది. మొత్తం మీద గత 24 గంటల్లో మొత్తం క్రిప్టో మార్కెట్ ట్రేడింగ్ వాల్యూం 137.91 శాతం పెరిగి 101.84 బిలియన్ డాలర్లుగా ఉంది.

డీఫైలో మొత్తం పరిమాణం ప్రస్తుతం 6.02 బిలియన్ డాలర్లు. ఇది మొత్తం క్రిప్టో మార్కెట్ 24 గంటల వాల్యూమ్​లలో 5.91 శాతం. అన్ని స్థిరమైన నాణేల వాల్యూం ఇప్పుడు 95.57 బిలియన్ డాలర్లు. ఇది మొత్తం క్రిప్టో మార్కెట్ 24 గంటల - వాల్యూంలో 93.84 శాతం.

ఏప్రిల్ 7న క్రిప్టో మార్కెట్​లో బిట్ కాయిన్ ఆధిపత్యం 62.52 శాతంగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు..

ఏప్రిల్ 7 ఉదయం 7 గంటలకు బిట్​కాయిన్ తన ప్రారంభ స్థాయిల నుంచి కొద్దిగా కోలుకుంది. కానీ గత 24 గంటల్లో పోల్చితే 5.69 శాతం క్షీణించి 78,938 డాలర్ల వద్ద ఉంది. బిట్ కాయిన్ ఎం-క్యాప్ 1.56 ట్రిలియన్ డాలర్లు, ట్రేడింగ్ వాల్యూ 40.97 బిలియన్ డాలర్లుగా ఉందని కాయిన్ మార్కెట్ క్యాప్ గణాంకాలు వెల్లడించాయి.

ఎథేరియం అంతకుముందు రోజుతో పోలిస్తే 12.10 శాతం క్షీణించి 1,590.06 డాలర్ల వద్ద ఉంది. ఎం-క్యాప్ 191.88 బిలియన్ డాలర్లు, ట్రేడ్​ వాల్యూం 24.77 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

సొలానా గత 24 గంటల్లో 11.44 శాతం క్షీణించి ఏప్రిల్ 7న 106.53 డాలర్ల వద్ద ఉంది. మార్కెట్ క్యాప్ 54.91 బిలియన్ డాలర్లు, వాణిజ్య పరిమాణం 4.25 బిలియన్ డాలర్లుగా ఉంది.

టెథర్ 0.9994 వద్ద ఉంది. మార్కెట్ క్యాప్ 144.18 బిలియన్ డాలర్లు, వాల్యూం 82.48 బిలియన్ డాలర్లు - బిట్ కాయిన్ కంటే రెట్టింపు! ముఖ్యంగా, టెథర్ యుఎస్ డాలర్​తో అనుసంధానించిన స్థిరమైన కాయిన్ కావడంతో, చాలా మంది ఇతర క్రిప్టో టోకెన్లను కొనడానికి- విక్రయించడానికి దీనిని ఉపయోగిస్తారు. తద్వారా దాని ట్రేడింగ్ వాల్యూం ఎక్కువగా ఉంటుంది.

క్రిప్టో మార్కెట్ల పతనంపై నిపుణులు ఏమంటున్నారు?

డిజిటల్ అసెట్ ప్రైమ్ బ్రోకరేజీ సంస్థ ఫాల్కన్​ఎక్స్​లో ఏపీఏసీ డెరివేటివ్స్ హెడ్ సీన్ మెక్​నల్టీ మాట్లాడుతీ.. క్రిప్టోలో అమ్మకాల ఒత్తిడి కొనసాగవచ్చని అన్నారు. బిట్ కాయిన్, ఈథర్​లకు కీలక సపోర్ట్​ లెవల్స్​ వరుసగా 75,000 డాలర్లు, 1,500 డాలర్లుగా ఉన్నాయన్నారు.

'టారిఫ్ ఆధారిత సెల్లింగ్​ నడుస్తోంది. కానీ ఇది అతిపెద్ద ఆర్థిక సమస్య కాదు. కృత్రిమంగా ఇంజెక్ట్ చేసినట్లే, ఇతర దేశాల నుంచి రాయితీలు పొందినట్లు ట్రంప్ ప్రభుత్వం భావించిన తర్వాత టారీఫ్​లను తొలగించవచ్చు,' అని పాంటెరా క్యాపిటల్ జనరల్ పార్టనర్ కాస్మో జియాంగ్ తెలిపారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం