Bike Buying Tips : కొత్త బైక్ కొనేటప్పుడు ఈ ఫీచర్స్ చెక్ చేయండి.. అవి మిమ్మల్ని ప్రమాదాల నుంచి కాపాడుతాయి-bike buying tips check top safety features when buying new bike check more details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bike Buying Tips : కొత్త బైక్ కొనేటప్పుడు ఈ ఫీచర్స్ చెక్ చేయండి.. అవి మిమ్మల్ని ప్రమాదాల నుంచి కాపాడుతాయి

Bike Buying Tips : కొత్త బైక్ కొనేటప్పుడు ఈ ఫీచర్స్ చెక్ చేయండి.. అవి మిమ్మల్ని ప్రమాదాల నుంచి కాపాడుతాయి

Anand Sai HT Telugu
Nov 12, 2024 10:07 AM IST

Bike Buying Tips In Telugu : కొత్త బైక్ తీసుకుంటున్నామనే సంబరం అందరికీ ఉంటుంది. ఈ ఆనందంలో కొన్ని ఫీచర్లను చెక్ చేయడం మరిచిపోతారు. బైక్ కొనేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలో బైక్ తప్పనిసరి అయిపోయాయి. ఇంటికో బైక్ ఉన్నట్టుగా ఉంది. బైక్ వాడకం కంపల్సరీ అయిపోయింది. చిన్న చిన్న ప్రయాణాలకు హాయిగా వెళ్లి రావొచ్చు. రోజూవారీ అవసరాలకు టూ వీలర్ కచ్చితమైపోయింది. అయితే బైక్ కొనేటప్పుడు కొన్ని విషయాలను జాగ్రత్తగా చూడాలి.

కొత్త బైక్ కొనుగోలు చేసేటప్పుడు మైలేజీ, ఫీచర్లతో పాటు సేఫ్టీని కూడా చెక్ చేయాలి. కస్టమర్స్ భద్రత కోసం చాలా కంపెనీలు.. బైకు ఫీచర్లను అప్‌డేట్ చేస్తున్నాయి. మీరు కొత్త బైక్ కొనే ఆలోచనలో ఉంటే.. తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం..

చాలా మంది రైడర్లు బైక్ నడుపుతున్నప్పుడు సైడ్ స్టాండ్‌ని పైకి లేపడం మరిచిపోతారు. దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్పీడ్ బ్రేకర్, ఏదైనా పెద్ద రాయిలాంటిది స్టాండ్‌కి తగిలితే కిందపడే అవకాశాలు ఉంటాయి. స్టాండ్ పైకి లేపకుండా బైక్ నడపడం చాలా ప్రమాదకరం. కొత్త బైక్‌లు, స్కూటర్లు సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్‌తో వస్తున్నాయి. దీనిద్వారా మీరు స్టాండ్ తీయకుంటే బైక్ ఆఫ్ అయిపోతుంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ అనేది స్మార్ట్ టెక్నాలజీ, ఇది బైక్ స్టాండ్‌ని తీయనప్పుడు ఇంజిన్‌ను స్టార్ట్ చేయడానికి అనుమతించదు. అంటే బైక్ స్టార్ట్ అవ్వదు.

ఏబీఎస్ బైక్‌లో కనిపించే ఒక రకమైన బ్రేకింగ్ ఫీచర్. యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అని అర్థం. మీరు కొన్నిసార్లు అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయడం వల్ల బ్యాలెన్స్ తప్పిపోయి బైక్ పడిపోవడం గమనించే ఉంటారు. అటువంటి పరిస్థితిలో ఏబీఎస్ ఫీచర్ బైక్ పడిపోకుండా నిరోధిస్తుంది. కమ్యూటర్ బైక్‌లకు ఏబీఎస్ సదుపాయం లేకపోయినా, ఇప్పుడు స్పోర్ట్స్ బైక్‌లలో కూడా ఈ సదుపాయం కల్పిస్తున్నారు. ఏబీఎస్ ఫీచర్ డిస్క్ బ్రేక్‌లతో కలిపి ఉంటుంది. ఇది బైక్‌ను వేగంలో కూడా ఆపడాన్ని సులభం చేస్తుందన్నమాట.

చాలా క్రూయిజర్‌లు, ప్రీమియం బైక్‌లు ఇప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్‌తో వస్తున్నాయి. ఈ ఫీచర్ మీకు తడి లేదా జారే రోడ్లపై మంచి నియంత్రణను అందిస్తుంది. బైక్‌లో ఈ ఫీచర్ ఉండటం వల్ల ఆఫ్-రోడింగ్ చాలా సులభం అవుతుంది.

కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఒక రకమైన బ్రేకింగ్ సిస్టమ్. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్న బైక్‌లలో ఫ్రంట్, బ్యాక్ బ్రేక్‌లు కలుపుతారు. ఈ బ్రేకింగ్ సిస్టమ్‌తో వెనుక బ్రేక్ నొక్కినప్పుడు ఆటోమేటిక్ ఫ్రంట్ బ్రేక్ కూడా ప్రభావితమవుతుంది.

బైక్ నడిపేటప్పుడు మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి హెల్మెట్ ధరించాలి. మీరు లాంగ్ రైడ్‌కి వెళ్తుంటే.. కచ్చితంగా రైడింగ్ జాకెట్, రైడింగ్ గ్లోవ్స్, రైడింగ్ ప్యాంటు ఉపయోగించాలి. ఇసుకలాంటి ప్రదేశాల్లో ఫ్రంట్ బ్రేక్ ఎక్కువగా ఉపయోగించకూడదు. అలాంటి రోడ్లపై బైక్ స్కిడ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా బైక్ వంచి నడపకూడదు.

Whats_app_banner