WhatsApp Status : వాట్సాప్‌లో అదిరిపోయే అప్డేట్.. వీడియో స్టేటస్ పరిమితి 60 నుంచి 90 సెకన్లకు!-big update whatsapp extends video status limit 60 to 90 seconds report ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp Status : వాట్సాప్‌లో అదిరిపోయే అప్డేట్.. వీడియో స్టేటస్ పరిమితి 60 నుంచి 90 సెకన్లకు!

WhatsApp Status : వాట్సాప్‌లో అదిరిపోయే అప్డేట్.. వీడియో స్టేటస్ పరిమితి 60 నుంచి 90 సెకన్లకు!

Anand Sai HT Telugu

WhatsApp Video Status : వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్. త్వరలో మీకోసం అదిరిపోయే అప్డేట్ రానుంది. ఇక మీరు వాట్సాప్ వీడియో స్టేటస్‌ను మరింత పెద్దదిగా పెట్టుకోవచ్చు.

వాట్సాప్​ వీడియో స్టేటస్ అప్డేట్ (MINT_PRINT)

ఇప్పుడు ఎదుటివారికి ఏదైనా చెప్పాలనుకున్నా.. సంతోషంలో ఉన్నా.. స్టేటస్ పెట్టడం అనేది తప్పనిసరైపోయింది. కొంతమంది ఉదయం లేవగానే ఒక స్టేటస్. రాత్రి పడుకునేముందో మరో స్టేటస్ పెట్టనిదే రోజు గడవదు. అయితే ఈ స్టేటస్‌లలో వీడియో పెడుతుంటే కొందరికి ఆ సమయం సరిపోదు. అలాంటి వారి కోసం వాట్సాప్ శుభవార్త తీసుకొచ్చింది. వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది

90 సెకన్ల వీడియో స్టేటస్

వాట్సాప్ యూజర్లు 90 సెకన్ల నిడివి గల వీడియో స్టేటస్ అప్‌డేట్‌లను షేర్ చేసుకోవచ్చు. ఈ అప్‌డేట్ ప్రస్తుతం బీటా దశలో ఉంది. ఎంపిక చేసిన కొందరికి మాత్రమే ఇప్పటికే యాక్సెస్ కలిగి ఉంది. రాబోయే కొన్ని వారాల్లో ఇది యూజర్లకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. స్టేటస్-షేరింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వాట్సాప్ చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక భాగం.

ఇప్పటికీ వాట్సాప్ వీడియో స్టేటస్‌లను ఒక నిమిషానికి పరిమితంగా ఉంది. వినియోగదారులు పొడవైన కంటెంట్‌ను భాగాలుగా విభజించాల్సి వస్తుంది. 60 సెకన్ల చొప్పున పెట్టుకోవాలి. ఇప్పుడు 90 సెకన్ల వరకు వీడియోను పోస్ట్ చేయగల అప్డేట్ వస్తే.. యూజర్లకు మరింత హ్యాపీ.

బీటా వెర్షన్

వీడియో స్టేటస్ నిడివిని పెంచే అప్‌డేట్ ఆండ్రాయిడ్ కోసం తాజా వాట్సాప్ బీటా వెర్షన్ 2.25.12.9లో ప్రవేశపెట్టారు. దీనిని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. గతంలో 30 సెకన్లు ఉండేది.. తర్వాత 60 సెకన్లకు మారింది. గత సంవత్సరం ఈ పొడిగింపుపై సానుకూల స్పందన రావడంతో తాజాగా 90 సెకన్ల వీడియో స్టేటస్ కోసం పని చేస్తున్నారు.

పొడవైన స్టేటస్

WABetaInfo షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం.. ఈ ఫీచర్ వీడియో నిడివిని క్రమంగా 60 నుండి 90 సెకన్లకు పెంచుతుంది. ఈ పొడిగింపు యూజర్లు పొడవైన వీడియో ఫార్మాట్లలో స్టేటస్ పెట్టుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. క్రమంగా ఈ అప్డేట్‌ మీద పని చేస్తున్నందున బీటా టెస్టర్లందరూ ఒకేసారి అప్‌డేట్‌ను పొందలేరు. యాక్సెస్ ఉన్నవారు ఒక నిమిషం కంటే ఎక్కువ నిడివి గల వీడియోలను అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నించడం ద్వారా ఫీచర్‌ను పరీక్షించవచ్చు. ఫీచర్ మెుదలైతే.. కట్‌లు లేకుండా మొత్తం 90-సెకన్ల వీడియోను స్టేటస్ పెట్టుకోవచ్చు.

వాట్సాప్ దీనిపై అభిప్రాయాన్ని సేకరించడానికి, అవసరమైన సర్దుబాట్లు చేయడానికి చూస్తుంది. వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్‌ల కోసం వీడియో నిడివిని 90 సెకన్లకు పొడిగించాలనే నిర్ణయం యూజర్లకు మంచి అనుభవాన్ని ఇచ్చేందుకని కంపెనీ అభిప్రాయపడుతుంది.

Anand Sai

eMail

సంబంధిత కథనం