MS WordPad: ఎంఎస్ వర్డ్ ప్యాడ్ ఇక కనిపించదు; త్వరలో డిస్కంటిన్యూ చేయనున్న మైక్రోసాఫ్ట్-big blow for users microsoft wordpad to be killed off soon ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Big Blow For Users, Microsoft Wordpad To Be Killed Off Soon

MS WordPad: ఎంఎస్ వర్డ్ ప్యాడ్ ఇక కనిపించదు; త్వరలో డిస్కంటిన్యూ చేయనున్న మైక్రోసాఫ్ట్

HT Telugu Desk HT Telugu
Sep 05, 2023 09:03 PM IST

Microsoft WordPad: మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్ వేర్ లో ముఖ్యమైన వర్డ్ ప్యాడ్ (WordPad) త్వరలో కనిపించకుండా పోతోంది. వర్డ్ ప్యాడ్ ను డిస్కంటిన్యూ చేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT Tech)

Microsoft WordPad: గత 30 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్ వేర్ లో వర్డ్ ప్యాడ్ చాలా ఫేమస్. ఈ ప్లాట్ ఫామ్ ను ఉపయోగించనివారు చాలా తక్కువ. అయితే, ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా టెక్ట్సింగ్ యాప్స్ అందుబాటులోకి రావడంతో వర్డ్ ప్యాడ్ ప్రభ తగ్గడం ప్రారంభమైంది. దాంతో, ఫ్యూచర్ అప్ గ్రేడ్స్ లో నుంచి వర్డ్ ప్యాడ్ ను తొలగించాలని మైక్రో సాఫ్ట్ నిర్ణయించింది.

ట్రెండింగ్ వార్తలు

విండోస్ 95 నుంచి..

విండోస్ 95 నుంచి వర్డ్ ప్యాడ్ విండోస్ లో భాగంగా ఉంటోంది. అయితే, ఇకపై ఈ యాప్ ను అప్ గ్రేడ్ చేయబోవడం లేదని, భవిష్యత్తు విండోస్ వర్షన్స్ లో వర్డ్ ప్యాడ్ ఉండబోదని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా .డాక్, .ఆర్టీఎఫ్ డాక్యుమెంట్స్ కు మైక్రోసాఫ్ట్ వర్డ్ ను, ప్లెయిన్ టెక్స్స్ డాక్యుమెంట్స్ అయిన .టీఎక్స్ టీ వంటి డాక్యుమెంట్స్ కు నోట్ ప్యాడ్ ను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నాం అని మైక్రోసాఫ్ట్ తెలిపింది. యూజర్లు కూడా వర్డ్ ను, నోట్ ప్యాడ్ ను ఉపయోగించినట్లుగా ఇటీవలి కాలంలో వర్డ్ ప్యాడ్ ను ఉపయోగించడం లేదని వెల్లడించింది. కాగా, విండోస్ 12 నుంచి వర్డ్ ప్యాడ్ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. విండోస్ 12 ను 2024 లో లాంచ్ చేయనున్నారు. అందులో కృత్రిమ మేథ ఆధారిత మైక్రోసాఫ్ట్ కో పైలట్ ను లాంచ్ చేయనున్నారు.

WhatsApp channel