BHEL Q3 Earnings: 56 శాతం పెరిగిన ‘మహారత్న’ కంపెనీ లాభాలు-bhel q3 earnings net profit grew by 56 revenue lags marginally in q3 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Bhel Q3 Earnings: Net Profit Grew By 56%, Revenue Lags Marginally In Q3

BHEL Q3 Earnings: 56 శాతం పెరిగిన ‘మహారత్న’ కంపెనీ లాభాలు

HT Telugu Desk HT Telugu
Feb 10, 2023 10:01 PM IST

BHEL Q3 Earnings: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్ (Bharat Heavy Electricals Limited BHEL) ఈ Q3 లో మెరుగైన ఆర్థిక ఫలితాలను సాధించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

BHEL Q3 Earnings: ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ (Bharat Heavy Electricals Limited BHEL) మహారత్న కంపెనీల్లో ఒకటి. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 26,237.35 కోట్లు. బీహెచ్ఈఎల్ (Bharat Heavy Electricals Limited BHEL) శుక్రవారం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3FY23) ఫలితాలను ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

BHEL Q3 Earnings: రూ. 42. 28 కోట్లు

బీహెచ్ఈఎల్ (Bharat Heavy Electricals Limited BHEL) ఈ Q3 లో రూ. 42. 28 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం Q3 లో బీహెచ్ఈఎల్ నికర లాభాలు రూ. 27.02 కోట్లు మాత్రమే. అంటే, గత Q3 కన్నా, ఈ Q3 లో సంస్థ నికర లాభాలు 56.48% పెరిగాయి. అలాగే, ఆపరేషన్స్ రెవెన్యూ గత Q3 లో రూ. 4918.98 కోట్లు కాగా, ఈ Q3 లో రూ. 4939.49 కోట్లు. విభాగాల వారీగా చూస్తే, ఈ Q3 లో ఇండస్ట్రీ నుంచి రూ. 947.37 కోట్ల రెవెన్యూని, పవర్ నుంచి రూ. 3,992.12 కోట్ల రెవెన్యూని BHEL సాధించింది. BHEL షేర్ వాల్యూ శుక్రవారం ఎన్ఎస్ఈ (NSE) లో గురువారం నాటి ముగింపు ధర అయిన రూ. 76.35 నుంచి 1.64% తగ్గి, రూ. 75.10 వద్ద ముగిసింది.

WhatsApp channel

టాపిక్