Airtel, SpaceX agreement: ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ తో భారతి ఎయిర్ టెల్ అగ్రిమెంట్; భారత్ లోకి స్టార్ లింక్-bharti airtel to bring starlink to india signs agreement with elon musks spacex ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Airtel, Spacex Agreement: ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ తో భారతి ఎయిర్ టెల్ అగ్రిమెంట్; భారత్ లోకి స్టార్ లింక్

Airtel, SpaceX agreement: ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ తో భారతి ఎయిర్ టెల్ అగ్రిమెంట్; భారత్ లోకి స్టార్ లింక్

Sudarshan V HT Telugu

Airtel, SpaceX agreement: టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం స్పేస్ ఎక్స్ కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఎయిర్ టెల్ ద్వారా ను భారత్ లోకి రానున్నాయి.

స్పేస్ఎక్స్ తో ఎయిర్ టెల్ అగ్రిమెంట్

Airtel, SpaceX agreement: దేశంలో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించడానికి భారత టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, వ్యాపారాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, మారుమూల ప్రాంతాలకు స్టార్ లింక్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించడానికి స్పేస్ ఎక్స్, భారతి ఎయిర్ టెల్ కలిసి పనిచేస్తాయి. ఎయిర్టెల్ ప్రస్తుత నెట్ వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో స్టార్ లంక్ టెక్నాలజీని ఏకీకృతం చేసే మార్గాలను కూడా ఈ ఒప్పందం పరిశీలిస్తుంది.

భారత ప్రభుత్వ మద్ధతు

స్టార్ లింక్ లైసెన్స్ దరఖాస్తు పరిశీలనలో ఉన్నప్పటికీ, స్పెక్ట్రమ్ ను వేలం వేయకుండా, నేరుగా కేటాయించాలన్న స్పేస్ఎక్స్ డిమాండ్ కు భారత ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. భారత్ లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు స్పెక్ట్రమ్ కేటాయింపులపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ డీల్ కుదిరింది. స్పేస్ ఎక్స్, ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోలు స్పెక్ట్రమ్ ను నేరుగా కేటాయించాలా లేక వేలం వేయాలా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. రిలయన్స్ జియో వేలం వేయడాన్ని సమర్ధిస్తోంది.

ఒప్పందంలో ఏముంది?

స్పేస్ ఎక్స్, ఎయిర్ టెల్ ల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా స్పేస్ ఎక్స్ భారత్ లో తన కార్యకలాపాలకు మద్దతుగా ఎయిర్ టెల్ గ్రౌండ్ నెట్ వర్క్, సంబంధిత మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. స్టార్ లింక్ శాటిలైట్ కనెక్టివిటీని ఉపయోగించి తన సేవలను పెంచుకునే మార్గాలను ఎయిర్ టెల్ అన్వేషిస్తుంది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.