Auto Expo 2025 : నేటి నుంచి ఆటో ఎక్స్పో- కార్లు, స్కూటర్ల జాతరకు సర్వం సిద్ధం!
Bharat Mobility Global Expo location : నేటి నుంచి జనవరి 22 వరకు ఆటో ఎక్స్పో 2025 జరగనుంది.- కార్లు, స్కూటర్ల జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ ఈవెంట్‌కి సమయం ఆసన్నమైంది! దేశ రాజధాని దిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 నేడు ప్రారంభం కానుంది. రెండేళ్లకి ఒకసారి జరిగే ఈ మెగా ఈవెంట్.. ఈసారి మరింత గ్రాండ్‌గా జరగనుంది. దిగ్గజ బ్రాండ్స్‌తో పాటు సరికొత్త ఆటోమొబైల్ సంస్థలు సరికొత్త మోడల్స్‌తో ఈసారి మరింత సందడి చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆటో ఎక్స్పో 2025కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ఎందుకు?
వివిధ ఆటోమొబైల్ సంస్థలు ఒక చోట చేరి తమ కొత్త ప్రాడెక్ట్స్‌ని, భవిష్యత్తులో లాంచ్ చేయబోయే మోడల్స్‌కి సంబంధించిన వివరాలను పంచుకునే వేదిక ఈ ఆటో ఎక్స్పో. దిల్లీలోని భారత్ మండపంలో ఈ ఈవెంట్ జరుగుతుంది. అదే సమయంలో దిల్లీ ద్వారకలోని యషోభూమిలో ఆటో కాంపొనెంట్స్ ఎక్స్పో జరుగుతంది. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో భారత్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎక్స్పో అండ్ అర్బన్ మొబిలిటీ- ఇన్ఫ్రాస్ట్రక్చర్ షో జరుగుతుంది.
హ్యుందాయ్ క్రేటా ఈవీ, కియా సైరోస్, టాటా సియారా ఈవీ, హీరో ఎక్స్‌పల్స్ 210, హోండా యాక్టివా ఈతో పాటు మరెన్నో ఆసక్తికర మోడల్స్ ఈసారి భారత్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు వస్తున్నాయి.
ఆటో ఎక్స్పో ముఖ్యమైన డేట్స్-
ఆటో ఎక్స్పో 2025 జనవరి 17 నుంచి జనవరి 22 వరకు జరుగుతుంది. అయితే పబ్లిక్‌కి జనవరి 19 నుంచి అనుమతి ఉంటుంది.
- జనవరి 17- మీడియా డే
- జనవరి 18- మీడియా అండ్ డీలర్స్ డే
- జనవరి 19- 22 - పబ్లిక్ డే
ఆటో ఎక్స్పో 2025 టైమింగ్స్-
జనవరి 19 నుంచి 22 వరకు ఆటో ఎక్స్పో 2025 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది.
ఎంట్రీ ఫీజు-
ఆటో ఎక్స్పో 2025కి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. పబ్లిక్ డేస్‌లో సందర్శకులు ఉచితంగా వెళ్లొచ్చు. అయితే భారత్ మొబిలిటీ వెబ్సైట్లో ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆటో ఎక్స్పోకి ఎలా వెళ్లాలి?
ఆటో ఎక్స్పో కోసం భారత్ మండపం వద్దకు వెళ్లే సందర్శకులకు సుప్రీం కోర్టు మెట్రో స్టేషన్ (బ్లూ లైన్) అతి సమీప ఆప్షన్. అక్కడి నుంచి కాలి నడకన వెన్యూకు చేరుకోవచ్చు. ఆటో కాంపొనెంట్స్ ఎక్స్పోకి వెళుతున్న సందర్శకులు ద్వారకా సెక్టార్ 25 మెట్రో స్టేషన్ దగ్గర దిగాల్సి ఉంటుంది. ఇండియా ఎక్స్పో సెంటర్ అండ్ మార్ట్‌కి వెళుతున్న వరు పరీ చౌక్ మెట్రో స్టేషన్ దగ్గర దిగాలి.
ఆటో ఎక్స్పో 2025కి సంబంధించిన లేటెస్ట్ వివరాలను ఎప్పటికప్పుడు మేము మీకు అప్డేట్ చేస్తాము. హెచ్‌టీ తెలుగుని ఫాలో అవ్వండి!
సంబంధిత కథనం