Top Mi smartphones: 10 వేలకు పైగా ధర ఉన్న ఎంఐ ఫోన్స్ లో ఇవే బెస్ట్..-best xiaomi smartphones above rs 10 000 and with most advanced features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Best Xiaomi Smartphones Above <Span Class='webrupee'>₹</span>10,000 And With Most Advanced Features

Top Mi smartphones: 10 వేలకు పైగా ధర ఉన్న ఎంఐ ఫోన్స్ లో ఇవే బెస్ట్..

HT Telugu Desk HT Telugu
Mar 23, 2023 07:35 PM IST

Top Mi smartphones: అడ్వాన్స్డ్ ఫీచర్లు, అందుబాటులో ధర.. స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఇంతకన్నా కావాల్సినదేముంటుంది? ఈ సూత్రాన్నే ఆధారం చేసుకుని ఎప్పటికప్పుడు అందుబాటు ధరలో అత్యాధునిక ఫీచర్లను ఎంఐ (Mi) అందిస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Top Mi smartphones: అడ్వాన్స్డ్ ఫీచర్లు, అందుబాటులో ధర.. స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఇంతకన్నా కావాల్సిన దేముంటుంది? ఈ సూత్రాన్నే ఆధారం చేసుకుని ఎప్పటికప్పుడు అందుబాటు ధరలో అత్యాధునిక ఫీచర్లను ఎంఐ (Xiaomi) అందిస్తోంది. అలా రూ. 10 వేల కన్నా ఎక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ అందిస్తున్న ఎంఐ ఫోన్స్ ఇవే..

ట్రెండింగ్ వార్తలు

Xiaomi 11i 5G : షావోమీ 11 ఐ 5జీ

ప్రస్తుతం 5జీ కాలం నడుస్తోంది. అన్ని మేజర్ స్మార్ట్ ఫోన్ మేకింగ్ కంపెనీలు 5 జీ ఫోన్లపైననే దృష్టి పెడుతున్నాయి. షావోమీ నుంచి వచ్చిన షావోమీ 11 ఐ 5జీ (Xiaomi 11i 5G) అందులో ఒకటి. ఇది 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ (Mediatek Dimensity 920 processor) ను అమర్చారు. ఇది 6.67 అంగుళాల ఎఫ్ హెచ్ డీ అమొలెడ్ డిస్ ప్లే తో వస్తుంది. దీని ప్రైమరీ కెమెరా 108 ఎంపీ ఉంటుంది.

Mi 10: ఎంఐ 10

షావోమీ నుంచి వచ్చిన మరో అఫర్డబుల్ ఫోన్ ఎంఐ 10 (Mi 10). ఇది 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ (Snapdragon 865 processor) ను అమర్చారు. ఇది 6.67 అంగుళాల ఎఫ్ హెచ్ డీ అమొలెడ్ డిస్ ప్లే తో వస్తుంది. దీని ప్రైమరీ కెమెరా 108 ఎంపీ ఉంటుంది. ఇది కూడా 5 జీ ని సపోర్ట్ చేస్తుంది.

Redmi Note 11: రెడ్ మి నోట్ 11

ఇది 5జీ ని సపోర్ట్ చేయదు. ఇందులో 6.43 అంగుళాల FHD AMOLED డిస్ ప్లే ఉంటుంది. 4 జీబీ, 6 జీబీ ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది. ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ, 50 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

Xiaomi Mi A3 : షావోమీ ఎంఐ ఏ 3

అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లున్న ఫోన్ ఇది. ఈ ఫోన్ 6.088 అంగుళాల AMOLED మల్టీ టచ్ టచ్ స్క్రీన్ తో వస్తుంది. ఇందులో 2.0GHz క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665 అక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది కూడా 4 జీబీ, 6 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ఫ్రంట్ కెమెరా 32 ఎంపీ, 48 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

Xiaomi 12 Pro: షావోమీ 12 ప్రొ

ఇది 5 జీ ఫోన్. ఫొటోస్, సెల్ఫీస్ లవర్స్ కు మోస్ట్ సూటబుల్ ఫోన్. ఇందులో 50 MP + 50 MP + 50 MP రియర్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంది. అయితే, ఆటో ఫోకస్ లేకపోవడం ఒక లోపం. అదీకాకుండా, ఇందులో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది. 6.73 అంగుళాల WQHD+ 120 Hz AMOLED లార్జ్ డిస్ ప్లే తో వస్తోంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ ఉంది. దీనివల్ల ఈ ఫోన్ పనితీరు అత్యంత వేగవంతంగా ఉంటుంది.

Top Mi smartphones: ఇవి కూడా..

పైన పేర్కొన్న ఐదు మోడల్సే కాకుండా, షావోమీ రెడ్ మీ 10 ప్రైమ్ (Xiaomi Redmi 10 Prime), రెడ్ మీ 9ఏ (Redmi 9A), షావోమీ 11 టీ ప్రొ 5 జీ(Xiaomi 11T Pro 5G), రెడ్ మీ 11 ప్రైమ్ 5జీ (Redmi 11 Prime 5G) మోడల్స్ కూడా వినియోగదారులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

WhatsApp channel